నేడు పులివెందులకు సీఎం వైఎస్‌ జగన్‌

5 Oct, 2020 07:26 IST|Sakshi

డాక్టర్‌ ఈసీ గంగిరెడ్డి సంస్మరణ సభకు సీఎం హాజరు 

పాల్గొననున్న వైఎస్‌ కుటుంబ సభ్యులు

సాక్షి, పులివెందుల : ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సోమవారం పులివెందులకు రానున్నారు. సీఎం మామ డాక్టర్‌ ఈసీ గంగిరెడ్డి శనివారం మృతి చెందిన విషయం విదితమే. డాక్టర్‌ గంగిరెడ్డి సంస్మరణ సభను ఆయన కుటుంబ సభ్యులు భాకారాపురంలోని వైఎస్సార్‌ ఆడిటోరియంలో ఏర్పాటు చేశారు. ఈనేపథ్యంలో సంస్మరణ సభకు సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి హాజరై గంగిరెడ్డికి నివాళులు అర్పించనున్నారు. నేడు పులివెందులకు చేరుకుని ఇక్కడ కార్యక్రమాల తర్వాత ముఖ్యమంత్రి ఢిల్లీ బయలు దేరి వెళతారు. సీఎం పర్యటన వివరాలను ముఖ్యమంత్రి కార్యాలయం వెల్లడించింది. 

పర్యటన ఏర్పాట్లు పరిశీలించిన ఎంపీ
పులివెందుల రూరల్‌ : ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సోమవారం పులివెందులకు రానున్నారు. ఈనేపథ్యంలో ఏర్పాట్లను ఆదివారం ఎంపీ వైఎస్‌ అవినా‹Ùరెడ్డి, జాయింట్‌ కలెక్టర్లు గౌతమి, రవికాంత్‌ వర్మ పరిశీలించారు. ప్రముఖ చిన్న పిల్లల వైద్యులు ఈసీ గంగిరెడ్డి సంతాప సభను సోమవారం పట్టణంలోని ఆడిటోరియంలో నిర్వహిస్తున్నారు. సంతాప సభకు ముఖ్యమంత్రి  రానున్న నేపథ్యంలో ఆయన పర్యటించే ప్రాంతాలను వారు పరిశీలించారు.

 పార్కింగ్‌కు సంబంధించిన స్థలాన్ని పరిశీలిస్తున్న ఎంపీ  అవినాష్‌రెడ్డి, వైఎస్‌ మనోహరరెడ్డి తదితరులు  

ఏర్పాట్ల గురించి కడప ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి  జాయింట్‌ కలెక్టర్లు, పాడా ఓఎస్డీ అనిల్‌కుమార్‌రెడ్డితో చర్చించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ ఇన్‌చార్జి వైఎస్‌ మనోహరరెడ్డి, చక్రాయపేట వైఎస్సార్‌ సీపీ ఇన్‌చార్జి వైఎస్‌ కొండారెడ్డి, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి దేవిరెడ్డి శివశంకరరెడ్డి, ఆర్‌అండ్‌బీ ఈఈ సిద్ధారెడ్డి, డీఈ శ్రీధర్‌రెడ్డి, వైఎస్సార్‌ పౌండేషన్‌ ప్రతినిధి జనార్ధన్‌రెడ్డి, తహశీల్దార్‌ శ్రీనివాసులు, మున్సిపల్‌ కమిషనర్‌ నరసింహరెడ్డి, వైఎస్సార్‌ సీపీ నాయకులు పాల్గొన్నారు.

సీఎం పర్యటన వివరాలు ..
ఉదయం 9.00 ముఖ్యమంత్రి తాడేపల్లెలోని నివాసం నుంచి గన్నవరం ఎయిర్‌ పోర్టుకు బయలు దేరుతారు. 9.20 గన్నవరం ఎయిర్‌ పోర్టుకు చేరుకుంటారు. 9.30 గన్నవరం ఎయిర్‌ పోర్టునుంచి విమానంలో కడప ఎయిర్‌ పోర్టుకు బయలుదేరుతారు. 10.10 కడప ఎయిర్‌ పోర్టుకు చేరుకుంటారు. 10.15 కడప ఎయిర్‌ పొర్టు నుంచి హెలిక్యాప్టర్‌లో పులివెందులకు బయలు దేరుతారు. 10.35 పులివెందులలోని భాకారాపురంలోని హెలీప్యాడ్‌కు చేరుకుంటారు. 10.40హెలీప్యాడ్‌ నుంచి భాకారాపురంలోని నివాసానికి బయలు దేరుతారు. 10.50 భాకారాపురంలోని నివాసానికి ముఖ్యమంత్రి చేరు కుంటారు. 10.50 నుంచి మధ్యాహ్నం 1.00 గంట వరకు రిజర్వుగా ప్రకటించారు. మధ్యాహ్నం 1.00 పులివెందుల నివాసం నుంచి హెలీప్యాడ్‌కు బయలు దేరుతారు.  

1.10 భాకారాపురంలోని హెలీప్యాడ్‌కు చేరుకుంటారు. 1.15 హెలీక్యాప్టర్‌లో కడప ఎయిర్‌ పోర్టుకు బయలుదేరుతారు. 1.35: హెలీక్యాప్టర్‌లో కఎయిర్‌ పోర్టుకు చేరుకుంటారు. 1.40 కడప ఎయిర్‌ పోర్టు నుంచి విమానంలో గన్నవరం బయలు దేరుతారు. 2.20 గనవరం ఎయిర్‌ పోర్టుకు చేరుకుంటారు. 2.30 గన్న వరం ఎయిర్‌ పోర్టు నుంచి ఢిల్లీకి బయలు దేరుతారు. సాయంత్రం5.00 ఢిల్లీ ఎయిర్‌ పోర్టుకు చేరుకుంటారు. 5.10 ఢిల్లీ ఎయిర్‌ పోర్టు నుంచి 1–జనపథ్‌కు బయలు దేరుతారు. 5.50 ఢిల్లీలోని1– జనపథ్‌కు చేరుకుంటారు. రాత్రి అక్కడే బస చేస్తారని కార్యాలయ వర్గాలు అధికారికంగా ధ్రువీకరించాయి.

మరిన్ని వార్తలు