తిరుమలకు చేరుకున్న సీఎం జగన్‌

23 Sep, 2020 16:39 IST|Sakshi

సాక్షి, తిరుపతి: ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తిరుమలకు చేరుకున్నారు. టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి, ఈవో, అదనపు ఈవో ఆయనకు సాదర స్వాగతం పలికారు. కాసేపట్లో అన్నమయ్య భవన్‌లో ప్రధాని నరేంద్ర మోదీతో సీఎం జగన్‌ వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొంటారు. అంతకుముందు ఢిల్లీ పర్యటన ముగించుకుని రేణిగుంట ఎయిర్‌పోర్టుకు చేరుకున్న సీఎం జగన్‌కు మంత్రులు, పార్టీ ఎమ్మెల్యేలు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. ప్రధానితో వీడియో కాన్ఫరెన్స్‌ అనంతరం  శ్రీవారి సాలకట్ల బ్రహోత్సవాల్లో ముఖ్యమంత్రి పాల్గొంటారు.

ప్రభుత్వం తరపున శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పిస్తారు. రాత్రికి పద్మావతి గెస్ట్‌హౌస్‌లో సీఎం జగన్‌ బస చేయనున్నారు. ఇక రెండు రోజుల ఢిల్లీ టూర్‌లో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా, కేంద్ర జలశక్తి శాఖమంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌ వంటి ప్రముఖులను సీఎం జగన్‌ కలిశారు. ఆంధ్రప్రదేశ్‌ పునర్‌ వ్యవస్థీకరణ చట్టంలోని నిబంధనల ద్వారా రాష్ట్రానికి కేంద్రం నుంచి అందాల్సిన సాయంపై చర్చించారు. అనంతరం ఏపీ భవన్‌లో వైఎస్సార్‌ సీపీ ఎంపీలతో ముఖ్యమంత్రి సమావేశం అయ్యారు.
(చదవండి: ముగిసిన సీఎం జగన్‌ ఢిల్లీ పర్యటన)

రేణిగుంటలో ఘన స్వాగతం
రెండు రోజుల ఢిల్లీ పర్యటన ముగించుకుని రేణిగుంట ఎయిర్‌పోర్టుకు చేరుకున్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి ఘన స్వాగతం లభించింది. ఆయన వెంట పార్లమెంట్ సభ్యులు మిథున్ రెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర రెడ్డి ఉన్నారు. ఉప ముఖ్యమంత్రులు కె.నారాయణ స్వామి, ఆళ్ల నాని, జిల్లా ఇంచార్జి మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి, మంత్రులు ఆదిమూలపు సురేష్‌, పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి, ఎమ్మెల్యేలు భూమన కరుణాకర రెడ్డి, బియ్యపు మధుసూధనరెడ్డి, ఆర్కే రోజా, ఎమ్మెస్‌ బాబు, వెంకటె గౌడ, కోరుముట్ల శ్రీనివాసులు, మేడా మల్లిఖార్జున రెడ్డి, ఎమ్మెల్సీ యండవల్లి శ్రీనివాసులు రెడ్డి, టీటీడీ ఛైర్మన్ వై.వీ.సుబ్బారెడ్డి, జేసీ  మార్కండేయులు (ఇంచార్జి కలెక్టర్), నగరపాలక కమిషనర్ గిరీషా, అసిస్టెంట్ కలెక్టర్ విష్ణు చరణ్, డీఐజీ కాంతిరణా టాటా, అర్బన్ ఎస్పీ రమేష్ రెడ్డి, చిత్తూరు ఎస్పీ సెంథిల్ కుమార్, జేఈఓ బసంత్ కుమార్, ఐజీ శశిధర్ రెడ్డి, ఎయిర్ పోర్ట్ డైరెక్టర్ సురేష్, డిప్యూటీ కమాండెంట్ దుర్గేష్ చంద్ర శుక్లా, సీ.ఎస్.ఓ. రాజశేఖర్ రెడ్డి, డిసిసిబి చైర్మన్ రెడ్డెమ్మ, స్విమ్స్ డైరెక్టర్ వెంగమ్మ, టర్మినల్ మేనేజర్ గోపాల్ తదితరులు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌, ఎంపీలకు ఘన స్వాగతం పలికారు.

మరిన్ని వార్తలు