ఎన్టీఆర్‌ జిల్లా తిరువూరుకి సీఎం జగన్‌.. జగనన్న విద్యాదీవెన నిధుల విడుదల

18 Mar, 2023 15:23 IST|Sakshi

సాక్షి, ఎన్టీఆర్‌ జిల్లా: జిల్లాలోని తిరువూరులో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదివారం పర్యటించనున్నారు. జగనన్న విద్యాదీవెన పథకం నాలుగో విడత నిధులను సీఎం జగన్‌ విడుదల చేయనున్నారు. 11 లక్షల మంది విద్యార్థుల తల్లుల ఖాతాల్లో రూ. 700 కోట్ల రూపాయలు జమచేయనున్నారు. అనంతరం బహిరంగ సభలో ముఖ్యమంత్రి ప్రసంగించనున్నారు. 

సీఎం జగన్‌ తిరువూరు పర్యటన నేపథ్యంలో..  వైఎస్సార్‌ సీపీ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్‌ శనివారం మాట్లాడుతూ.. వైఎస్‌ జగన్ సీఎం అయిన తర్వాత చదువుల్లో విప్లవం తెచ్చారని ప్రశంసించారు. ప్రతీ ఒక్కరూ చదువుకోవాలనే లక్ష్యంతో పనిచేస్తున్నారని.. కార్పొరేట్ స్కూళ్లకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దారని పేర్కొన్నారు. ఈ మూడేళ్లలో 31.4 లక్షల మందికి జగనన్న విద్యాదీవెనను చేరువ చేశారని తెలిపారు.  

‘గతంలో పేదలకు చదువు భారంగా మారింది. ప్రభుత్వ విద్యను చంద్రబాబు పూర్తిగా నిర్వీర్యం చేశాడు. ప్రైవేట్ విద్యాసంస్థల బలోపేతం చేసే దిశగా పనిచేశాడు. చంద్రబాబు కేవలం 16 లక్షలు మందికి ఫీజులరీయింబర్స్ మెంట్ ఇచ్చారు చదువు ద్వారానే అన్నీ సాధ్యమని నమ్మిన వ్యక్తి  జగన్‌. అందుకే విద్యకు పెద్దపీట వేశారు’ అని పేర్కొన్నారు. 

విద్యాదీవెన కార్యక్రమం రేపు తిరువూరులో సీఎం ప్రారంభిస్తారు. పేదలు సైతం కార్పొరేట్ స్కూల్స్ లో చదవాలనేది సీఎం ఆలోచన. ఇంగ్లీష్ మీడియానికి ప్రాధాన్యత ఇచ్చారు.  చంద్రబాబు కోర్టులకు వెళ్లి అడ్డుకున్నా న్యాయం మా వైపు ఉంది. రూ. 700 కోట్లు రేపు నేరుగా విద్యార్ధుల తల్లుల ఖాతాల్లో వేయనున్నారు. చంద్రబాబు విద్యారంగాన్ని విస్మరించాడు. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత సీఎం జగన్‌ తరహాలో ఎవరూ విద్యకు ప్రాధాన్యత ఇవ్వలేదు. ఇతర రాష్ట్రాలు కూడా ఇక్కడ ప్రభుత్వ స్కూల్స్ ను చూసి ఆశ్చర్యపోతున్నాయి. ఏపీలోలాగా తమ రాష్ట్రాల్లోని స్కూల్స్‌ను తీర్చిదిద్దాలని ఆలోచన చేస్తున్నాయి. 
- ప్రభుత్వ విప్, సామినేని ఉదయభాను

చదవండి: రెండు సీట్లకు ఎగిరి గంతేయడమే టీడీపీ స్టైల్‌!

మరిన్ని వార్తలు :

ASBL
మరిన్ని వార్తలు