వైఎస్సార్‌ రైతు భరోసా–పీఎం కిసాన్‌ నిధులు జమ చేసిన సీఎం జగన్‌

1 Jun, 2023 08:56 IST|Sakshi

Updates..

► బటన్‌ నొక్కి వైఎస్సార్‌ రైతు భరోసా–పీఎం కిసాన్‌ నిధులు జమ చేసిన సీఎం జగన్‌

► బాబు బతుకే కాపీ, మోసం. చంద్రబాబుకు క్యారెక్టర్‌, క్రెడిబిలిటీ లేవు. 175 నియోజకవర్గాల్లో అభ్యర్థుల్లేని పార్టీ టీడీపీ. పొత్తుల కోసం ఎంతకైనా దిగజారే పార్టీ టీడీపీ. పొత్తుల కోసం ఎలాంటి గడ్డికరవడానికైనా సిద్దపడే పార్టీ టీడీపీ. పొత్తులు, ఎత్తులు, జిత్తులు, కుయుక్తులు కలగలిపిన పార్టీ టీడీపీ. 

► మంచి చేయడమనేది చంద్రబాబు డిక్షనరీలోనే లేదు. ఎవరికైనా మంచి చేశానని చెప్పుకోలేని వ్యక్తి చంద్రబాబు. గజ దొంగల ముఠా, చంద్రబాబుది అధికారం కోసం ఆరాటం. దోచుకుని, దాచుకుని నలుగురూ పంచుకోవడానికే వీరి పోరాటం. ధైర్యంగా, ఒంటరిగా పోటీ చేసే సత్తా చంద్రబాబుకు లేదు. 


► రాబోయే ఎన్నికల్లో యుద్ధం జరగబోతోంది. చంద్రబాబు డీపీటీ కావాలా.. మన డీబీటీ కావాలా?. పేదవాడికి, పెత్తందారుడికీ మధ్య యుద్ధం జరుగుతోంది. మీ బిడ్డ కేబినెట్‌లో ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాల వారే ఉన్నారు. గతంలో ఎస్సీల్లో ఎవరైనా పుట్టాలనుకుంటున్నారా అని వెటకారం చేశారు. 

► చంద్రబాబు ఎల్లో మీడియా ప్రచారానికి, ఇప్పుడు జరుగుతున్న మంచికీ మధ్య యుద్దం. వీరి యుద్ధం జగన్‌తో కాదు పేదలతో. మీ బిడ్డ నమ్ముకుంది దేవుడి దయ, మీ చల్లని దీవెనలు మాత్రమే. 


► నా నమ్మకం మీరేనని గర్వంగా చెబుతున్నా. మీ ఇంట్లో మంచి జరిగి ఉంటే మీ బిడ్డకు సైనికుల్లా నిలబడండి. మీ బిడ్డకు దేవుడి దయ, మీ చల్లని దీవెనెలు ఎప్పుడూ ఉండాలి. 

► ఎన్నికలు వస్తుంటే చంద్రబాబుకు ప్రాజెక్టులు గుర్తొస్తాయి. చంద్రబాబుకు ఎన్నికలప్పుడు మాత్రమే కర్నూలు గుర్తొచ్చేది. తన హయాంలో కర్నూలుకు 10కోట్లు కూడా ఖర్చు చేయలేదు. 

► లిఫ్ట్‌ ఇరిగేషన్‌ ప్రాజెక్ట్‌ కోసం రూ.80కోట్లు కేటాయిస్తున్నాం. టామోటా ప్రాసెసింగ్‌ యూనిట్‌ కోసం రూ.10కోట్లు కేటాయిస్తున్నాం. 

► మేనిఫెస్టో ఎలా తయారవుతుందో బాబుకు తెలుసా?. నా పాదయాత్రలో ప్రజల కష్టాల నడుమ మేనిఫెస్టో పుట్టింది. పేదవాడి గుండె చప్పుడు నుంచి మన మేనిఫెస్టో పుట్టింది. మన మట్టి నుంచి మన మేనిఫెస్టో పుట్టింది.

► చంద్రబాబు మేనిఫెస్టో ఏపీలో పుట్టలేదు. చంద్రబాబు మేనిఫెస్టో కర్ణాటకలో పుట్టింది. కర్ణాటక రెండు పార్టీల మేనిఫెస్టోతో బిస్మిల్లా బాత్‌ వండేశాడు. అన్ని పార్టీల పథకాలు కాపీ చేసేసి మేనిఫెస్టో​ తీసుకొచ్చాడు. మన పథకాలను కాపీ కొట్టేసి పులిహోర కలిపేశాడు. 

► కరువు సీమగా పేరున్న రాయలసీమ ఇప్పుడు కళకళలాడుతోంది. రిజర్వాయర్లు కూడా నిండుగా కనిపిస్తున్నాయి. రైతన్నకు అదనపు ఆదాయం రావాలన్న లక్ష్యంతోనే పథకాలు తీసుకొచ్చాం. 

► ప్రపంచలోనే ప్రముఖ కంపెనీ అమూల్‌ను తీసుకొచ్చాం. గతంలో హెరిటేజ్‌ పేరుతో దోచుకున్న వారికి అడ్డుకట్ట వేశాం. అమూల్‌ ధర పెంచాక హెరిటేజ్‌ కూడా ధర పెంచింది. 

► రైతుకు శత్రువైన చంద్రబాబు అన్నదాతను ముంచేశాడు. రాజమండ్రిలో డ్రామా కంపెనీ మాదిరి ఒక షో జరిగింది. ఆ డ్రామా పేరు మహానాడు. 

 వ్యవసాయం దండగ అన్న వ్యక్తి చంద్రబాబు. ఉచిత విద్యుత్‌ ఇస్తే కరెంట్‌ తీగలపై బట్టలు ఆరేసుకోవాలన్న వ్యక్తి చంద్రబాబు. 

► తానే చంపేసిన మనిషికి మళ్లీ తానే పూల దండలు వేస్తున్నారు. 

 చంద్రబాబు మరోసారి మోసపూరిత మేనిఫెస్టోతో వచ్చాడు. చంద్రబాబుకు విలువలు, విశ్వసనీయత అసలే లేవు. చంద్రబాబు సత్యం పలకడు, ధ‍ర్మానికి కట్టుబడడు, మాట నిలబడడు. చంద్రబాబును చూస్తే మారీచుడు, రావణుడు గుర్తుకొస్తారు. 

► చంద్రబాబు హయాంలో ఈ-క్రాప్‌ లేదు, సోషల్‌ ఆడిట్‌ లేదు. 

సమగ్ర భూసర్వేతో భూవివాదాలను పరిష్కరిస్తున్నాం. వందేళ్ల తర్వాత సమగ్ర భూసర్వే జరుగుతోంది. సబ్‌ రిజిస్ట్రార్‌ ఆఫీసులు మీ గ్రామానికే తీసుకొచ్చే అడుగులు పడుతున్నాయి. 

► చుక్కల భూములపై సర్వ హక్కులు రైతులకే ఇచ్చిన ప్రభుత్వం మనదే. ఆక్వారైతులకు మేలు చేసిన ప్రభుత్వం కూడా మనదే. 

► రైతులకు పగటి పూటే 9 గంటల పాటు ఉచిత విద్యుత్‌. రూ.1700 కోట్లతో ఫీడర్లను బలపరుస్తున్నాం. రూ.1.50కే యూనిట్‌ విద్యుత్‌ అందిస్తున్న ఏకైక రాష్ట్రం ఏపీ. 

► చంద్రబాబు పాలనలో ప్రతీ ఏటా కరువే. టీడీపీ పాలనలో కనీసం సగం మండలాలను కరువు మండలాలుగా ప్రకటించేవారు. ఇప్పుడు రాష్ట్రంలో కరువు లేదు, వలసలు లేవు. 

► గడిచిన నాలుగేళ్లలో ఒక్క మండలాన్ని కూడా కరువు మండలంగా ప్రకటించలేదు. మీ బిడ్డ పరిపాలన ప్రారంభమైన తర్వాత మంచి వానలు ఉన్నాయి. 

► గత ప్రభుత్వ పాలనకు, మీ బిడ్డ పాలనకూ మధ్య తేడా చూడండి. మహానేత వైఎస్సార్‌ జయంతి రోజున ఇస్క్యూరెన్స్‌ కూడా జమ చేస్తాం. 

► ప్రతీ రైతన్నకు ఇప్పటికే రూ.54వేలు చొప్పున అందించాం. ఇప్పుడు అందిస్తున్న రైతు భరోసాతో కలిపితే ప్రతీ రైతన్న ఖాతాలో రూ.61,500 జమ. 

► ఇప్పటి వరకు రైతు భరోసా ద్వారా రూ. 31వేల కోట్లు జమ. ఇన్‌పుట్‌ సబ్సిడీ చరిత్రలోనే విప్లవాత్మక మార్పు తీసుకొచ్చాం. ఏ సీజన్‌లో పంట నష్టం జరిగితే అదే సీజన్‌లోనే ఇన్‌పుట్‌ సబ్సిడీ. 

► వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చాం. ప్రతీ గ్రామంలో రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేశాం. చంద్రబాబు హయాంలో ఇలాంటి ఆలోచన ఎప్పుడైనా చేశారా?.

► రాష్ట్రంలో ఆహారధాన్యాల దిగుబడి పెరిగింది. ఉద్యానవన పంటల దిగుబడి 332 లక్షల టన్నులకు పెరిగింది. 

► సీఎం జగన్‌ మాట్లాడుతూ.. రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది. మీ ప్రేమానురాగాలకు రెండు చేతులూ జోడించి నమస్కరిస్తున్నాను. 

► బటన్‌ నొక్కి నేరుగా రైతుల ఖాతాల్లో సాయం జమ చేస్తున్నాం. ఈ అవకాశం ఇచ్చిన దేవుడికి సదా రుణపడి ఉంటాను. మేనిఫెస్టోలో రైతులకు ఇచ్చిన ప్రతీ హామీని నిలబెట్టుకున్నాం. 

► రైతులు ఇబ్బంది పడకూడదనే పెట్టుబడి సాయం అందిస్తున్నాం.  వైఎస్‌ఆర్‌ రైతు భరోసాతో అన్నదాతలకు ఎంతో మేలు జరిగింది. 

► మేనిఫెస్టోలో ప్రకటించిన దాని కంటే ఎక్కువగా రూ.12,500కి బదులుగా ఏడాదికి రూ.13,500 రైతు భరోసా అందిస్తున్నాం. 

► ఈ కార్యక్రమంలో లబ్దిదారులు మాట్లాడుతూ.. రైతులకు అండగా నిలిచిన సీఎం జగన్‌కు ధన్యవాదాలు. రైతుల పక్షపాతి ప్రభుత్వాన్ని చూస్తున్నాం. పంట బీమా అందించిన సీఎం జగన్‌కు రుణపడి ఉంటాం. రైతు భరోసా కేంద్రాలతో ఎంతో మేలు జరిగింది.

ఎమ్మెల్యే కొంగటి శ్రీదేవి మాట్లాడుతూ.. పత్తికొండ ప్రజల తరఫున సీఎం జగన్‌కు స్వాగతం. 

 వైఎస్సార్‌ అడుగుజాడల్లో జగనన్న రైతులకు అండగా ఉన్నారు. సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్లుగా సీఎం జగన్‌ పాలన అందిస్తున్నారు. భవిష్యత్తు తరాల అభ్యున్నతికి సీఎం జగన్‌ కృషి చేస్తున్నారు. హామీలన్నీ నెరవేర్చినా సీఎం జగన్‌పై దుష్ప్రచారం చేస్తున్నారు. 

► బడుగు బలహీన వర్గాల ఆశాదీపం సీఎం జగన్‌. ప్రజల గుండెల్లో జగనన్న సుస్థిర స్థానం సంపాదించుకున్నారు. ప్రజల కష్టాలు తెలిసిన జననేత సీఎం జగన్‌. పాలనలో సీఎం జగన్‌ విప్లవాత్మక సంస్కరణలు తీసుకొచ్చారు. 

► వేదిక వద్ద మహానేత వైఎ‍స్సార్‌ విగ్రహానికి సీఎం జగన్‌ నివాళులు.

► సీఎం జగన్‌ పత్తికొండ చేరుకున్నారు. 

► కర్నూలు జిల్లా పర్యటనకు బయలుదేరిన సీఎం జగన్‌

► ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఐదో ఏడాది.. తొలి విడత వైఎస్సార్‌ రైతు భరోసా–పీఎం కిసాన్‌ పథకం లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమ చేయనున్నారు. 

2023–24 సీజన్‌కు సంబంధించి 52.31 లక్షల రైతు కుటుంబాలకు తొలివిడతగా రూ.7,500 చొప్పున మొత్తం రూ.3,923.22 కోట్ల పెట్టుబడి సాయంతో పాటు మార్చి, ఏప్రిల్, మే నెలల్లో కురిసిన అకాల వర్షాలతో  పంటలు నష్టపోయిన 51 వేల మంది రైతులకు రూ.53.62 కోట్ల మేర ఇన్‌పుట్‌ సబ్సిడీని సీఎం జగన్‌ గురువారం కర్నూలు జిల్లా పత్తికొండలో నిర్వహించే కార్యక్రమంలో బటన్‌ నొక్కి రైతుల ఖాతాల్లో జమ చేస్తారు.

నాలుగేళ్లలో రూ.30,985.31 కోట్ల పెట్టుబడి సాయం
► వైఎస్సార్‌ రైతు భరోసా కింద ఏటా మూడు విడతల్లో రూ.13,500 చొప్పున పెట్టుబడి సాయాన్ని అందిస్తున్నారు. వెబ్‌ల్యాండ్‌ ఆధారంగా అర్హులైన భూ యజమానులతో పాటు దేవదాయ, అటవీ (ఆర్‌ఓఎఫ్‌ఆర్‌) భూముల సాగుదారులతోపాటు సెంటు కూడా భూమి లేని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన కౌలుదారులకు మే నెలలో రూ.7,500, అక్టోబర్‌లో రూ.4 వేలు,  జనవరిలో రూ.2 వేలు చొప్పున జమ చేస్తున్నారు.

 2019–20లో 46,69,375 మందికి రూ.6,173 కోట్లు సాయం అందించారు. 2020–21లో 51,59,045 మందికి రూ.6,928 కోట్ల మేర సాయం అందింది. 

2021–22లో 52,38,517 మందికి రూ.7,016.59 కోట్లు, 2022–23లో 51,40,943 మందికి రూ.6944.50 కోట్లు చొప్పున సాయాన్ని ఖాతాల్లో జమ చేశారు. తాజాగా 2023–24కి సంబంధించి 52,30,939 మంది అర్హత పొందగా వీరికి తొలి విడతగా రూ.3923.22 కోట్ల మేర సాయం అందించనున్నారు.

మరిన్ని వార్తలు