విలేజ్‌ క్లినిక్స్‌ నిర్మాణంపై ప్రత్యేక దృష్టి పెట్టాలి: సీఎం జగన్‌

6 Oct, 2021 16:24 IST|Sakshi

హెల్త్‌ హబ్స్‌లో ఏర్పాటు చేయనున్న ఆస్పత్రుల వివరాలను అడిగి తెలుసుకున్న సీఎం

వైద్యం కోసం ఇతర నగరాలకు వెళ్లాల్సిన అవసరం ఉండకూడదు

మనకు కావాల్సిన స్పెషలైజేషన్‌తో కూడిన ఆస్పత్రుల నిర్మాణంపై దృష్టి పెట్టాలన్న సీఎం 

సాక్షి,తాడేపల్లి: ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వైద్య, ఆరోగ్య శాఖపై తాడేపల్లి క్యాంప్‌ కార్యాలయంలో బుధవారం సమీక్ష నిర్వహించారు. కోవిడ్‌ –19 నివారణ, నియంత్రణ, వ్యాక్సినేషన్‌తో పాటు హెల్త్‌ హబ్స్‌పై వైద్య ఆరోగ్యశాఖ అధికారులతో సమీక్షించారు. రాష్ట్రంలో కొత్తగా చేపడుతున్న 16 మెడికల్‌ కాలేజీల నిర్మాణ ప్రగతిపై చర్చించారు. కొత్త మెడికల్‌ కాలేజీల విషయంలో ఏమైనా అంశాలు పెండింగ్‌లో ఉంటే.. వాటిపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఈ నెలాఖరు నాటికి వాటిని పరిష్కరించాలని అధికారులను సీఎం జగన్ ఆదేశించారు.

ఫ్యామిలీ డాక్టర్‌ కాన్పెప్ట్‌పైనా సీఎం సమీక్ష
కొత్త పీహెచ్‌సీల నిర్మాణం, ఉన్న పీహెచ్‌సీల్లో నాడు–నేడు పనులు, ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ అమలుకు అవసరమైన 104 వాహనాల కొనుగోలు.. వీటిని పూర్తిచేయడానికి చర్యలు తీసుకోవాలన్నారు సీఎం జగన్‌. వచ్చే ఏడాది జనవరి 26 నాటికి పూర్తిస్థాయిలో ఫ్యామిలీ డాక్టర్‌ కాన్సెప్ట్‌ను అమల్లోకి తీసుకురావడానికి అన్నిరకాలుగా సిద్ధంగా ఉండాలని.. విలేజ్‌ క్లినిక్స్‌ నిర్మాణంపైనా అధికారులు ప్రత్యేక దృష్టిపెట్టాలన్నారు.

మహిళలు, బాలికల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి
స్వేచ్ఛ కార్యక్రమం ద్వారా బాలికల ఆరోగ్యంపై దృష్టిపెట్టామని సీఎం జగన్‌ తెలిపారు. స్వేచ్ఛ ద్వారా బాలికల్లో అవగాహన కల్పించే కార్యక్రమాలను చేపడుతున్నామని.. నెలకు ఒక్కసారి ఈ రకమైన కార్యక్రమం చేపట్టాలన్నారు. వీటిని దృష్టిలో ఉంచుకుని పీహెచ్‌సీ వైద్యుల నియామకాల్లో మహిళా డాక్టర్లకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు సీఎం జగన్‌. ఆరోగ్య శ్రీ పై గ్రామ, వార్డు సచివాలయాల్లో హోర్డింగ్స్‌ పెట్టి.. దాని రిఫరెల్‌ మీద ప్రచారం ఉండాలని.. ఆరోగ్య మిత్రల ఫోన్‌నంబర్లను సచివాలయాల హోర్డింగ్స్‌లో ఉంచాలలని సీఎం ఆదేశించారు. ఎమ్‌పానెల్‌ ఆస్పత్రుల జాబితాలను అందుబాటులో ఉంచాలన్నారు. డిజిటల్‌ పద్ధతుల్లో పౌరులకు ఎమ్‌పానెల్‌ ఆస్పత్రుల జాబితాలు అందుబాటులో ఉంచాలని అలానే 108 వెహికల్స్‌ సిబ్బందికి కూడా రిఫరెల్‌ ఆస్పత్రుల జాబితా అందుబాటులో ఉంచాలని ఆయన తెలిపారు. 

ఏపీ డిజిటల్‌ హెల్త్‌పై సీఎం సమీక్ష
హెల్త్‌కార్డుల్లో సంబంధిత వ్యక్తి ఆరోగ్య వివరాలన్నీ కూడా క్యూఆర్‌ కోడ్‌ ద్వారా తెలుసుకునే అవకాశం ఉండాలని సీఎం జగన్‌ తెలిపారు. పరీక్షలు, వాటి ఫలితాలు, చేయించుకుంటున్న చికిత్సలు, వినియోగిస్తున్న మందులు.. ఇలా ప్రతి వివరాలను ఆ వ్యక్తి డేటాలో భద్రపరచాలన్నారు. దీనివల్ల వైద్యంకోసం ఎక్కడకు వెళ్లినా ఈ వివరాలు ద్వారా సులభంగావైద్యం చేయించుకునే అవకాశం ఉంటుందని తెలిపారు. బ్లడ్‌ గ్రూపు లాంటి వివరాలు కూడా ఇందులో ఉండాలన్న సీఎం జగన్‌ 104 ద్వారా వైద్యం అందించే క్రమంలో చేస్తున్న పరీక్షల ఫలితాలకు సంబంధించిన డేటాను ఎప్పటికప్పుడు ఈ హెల్త్‌కార్డుల్లో పొందుపర్చాలన్నారు. డిజిటిల్‌ హెల్త్‌ కార్యక్రమంలో భాగంగా పౌరులందరికీ కూడా హెల్త్‌ఐడీలు క్రియేట్‌చేస్తున్నామని అధికారులు తెలియజేశారు.

కోవిడ్‌ –19 నివారణ, నియంత్రణ, వ్యాక్సినేషన్‌పై సీఎంకు వివరాలందించిన అధికారులు...
►రాష్ట్రంలో యాక్టివ్‌ పాజిటివ్‌ కేసులు 9,141
►రికవరీ రేటు 98.86 శాతం
►ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నవారు 2201
►కోవిడ్‌ కేర్‌ సెంటర్లలో చికిత్స పొందుతున్న వారు 313 
►హోం ఐసోలేషన్‌లో ఉన్నవారు 6627
►జీరో కేసులు నమోదైన సచివాలయాలు 11,997
►పాజిటివిటీ రేటు 1.62 శాతం
►0 నుంచి 3 శాతం వరకు పాజిటివిటీ రేటు ఉన్న జిల్లాలు 12
►3 లోపు పాజిటివిటీ రేటు ఉన్న జిల్లా 1
 ►ఆరోగ్యశ్రీ కింద నెట్‌వర్క్‌ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న బెడ్స్‌ శాతం 92.27 శాతం
►ప్రైవేటు ఆస్పత్రులలో ఆరోగ్యశ్రీ కింద చికిత్స పొందుతున్న బెడ్స్‌ 69.70 శాతం 
►104 కాల్‌సెంటర్‌కు వచ్చిన ఇన్‌కమింగ్‌ కాల్స్‌ 649

థర్డ్‌ వేవ్‌ సన్నద్ధత
►మొత్తం అందుబాటులో ఉన్న ఆక్సిజన్‌ కాన్సంట్రేటర్స్‌ 20,964
►ఇంకా రావాల్సినవి 2,493
►అందుబాటులో ఉన్న డి టైప్‌ ఆక్సిజన్‌ సిలెండర్లు 27,311 
►రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న ఆక్సిజన్‌ జనరేషన్‌ (పీఎస్‌ఏ) ప్లాంట్లు 140 
►అక్టోబరు నెలాఖరు నాటికి పూర్తిగా అందుబాటులో రానున్న ఆక్సిజన్‌ జనరేషన్‌ ప్లాంట్లు

వ్యాక్సినేషన్‌ 
►సింగిల్‌ డోసు వ్యాక్సినేషన్‌ పూర్తయినవారు 1,38,32,742
►రెండు డోసుల వ్యాక్సినేషన్‌ పూర్తయినవారు 1,44,94,731
►మొత్తం వ్యాక్సినేషన్‌ చేయించుకున్నవారు 2,83,27,473
►వ్యాక్సినేషన్‌ కోసం ఉపయోగించిన మొత్తం డోసులు 4,28,22,204 
వ్యాక్సినేషన్‌ కార్యక్రమంపై ప్రత్యేక దృష్టి పెట్టి పూర్తి చేయాలని సీఎం జగన్‌ అధికారులను ఆదేశించారు. 

ఈ సమీక్షా సమావేశంలో ఉప ముఖ్యమంత్రి వైద్య ఆరోగ్యశాఖ ఆళ్ల కాళీ కృష్ణ శ్రీనివాస్‌ (నాని), సీఎస్‌ డాక్టర్‌ సమీర్‌ శర్మ, వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌ కుమార్‌ సింఘాల్, కోవిడ్‌ టాస్క్‌ఫోర్స్‌ కమిటీ ఛైర్మన్‌ ఎం టీ కృష్ణబాబు, ఆర్ధికశాఖ కార్యదర్శి ఎన్‌ గుల్జార్, 104 కాల్‌ సెంటర్‌ ఇంఛార్జి ఎ బాబు, వైద్య ఆరోగ్యశాఖ ప్రత్యేక కార్యదర్శి జి యస్‌ నవీన్‌ కుమార్, ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్‌ కాటమనేని భాస్కర్, ఆరోగ్యశ్రీ సీఈఓ వి వినయ్‌ చంద్, వైద్య ఆరోగ్యశాఖ డైరెక్టర్‌ (డ్రగ్స్‌) రవిశంకర్, ఏపీవీవీపీ కమిషనర్‌ డాక్టర్‌ వి వినోద్‌ కుమార్,  ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.

చదవండి: AP: రాష్ట్రాభివృద్ధిలో అందరికీ భాగస్వామ్యం
‘రైతుల ఆనందం చూడలేక టీడీపీ నేతలకు కడుపుమంట’

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు