CM YS Jagan Review Meeting: ప్రత్యేక ప్రణాళిక సిద్ధం చేసుకోండి.. సీఎం జగన్‌ కీలక ఆదేశాలు

12 Oct, 2022 17:46 IST|Sakshi

ఇంధన శాఖపై సీఎం సమీక్ష

సాక్షి, అమరావతి: ఇంధనశాఖపై తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బుధవారం సమీక్ష నిర్వహించారు. సీఎం ఆదేశాల మేరకు గతంలో తీసుకున్న నిర్ణయాల అమలు ప్రగతిని విద్యుత్‌ శాఖ అధికారులు వివరించారు. ఈ సమావేశంలో విద్యుత్, అటవీ పర్యావరణం, భూగర్భ గనులు, శాస్త్ర సాంకేతిక శాఖమంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, సీఎస్‌ సమీర్‌ శర్మ, విద్యుత్‌ శాఖస్పెషల్‌ సీఎస్‌ కె విజయానంద్, ఆర్థిక శాఖ స్పెషల్‌ సీఎస్‌ ఎస్‌ ఎస్‌ రావత్, ఏపీ జెన్‌కో ఎండీ బి శ్రీధర్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
చదవండి: దివ్యాంగులు దరఖాస్తు చేసుకోండి 

సీఎం ఆదేశాల మేరకు విద్యుత్‌ డిమాండ్, కొనుగోళ్లు, మార్కెట్లో అందుబాటులో ఉన్న విద్యుత్, వాటి ధరలు తదితర అంశాలపై డేటా అనలిటిక్స్‌ ఎస్‌ఎల్‌డీసీలో ఏర్పాటు చేశామని అధికారులు తెలిపారు. విద్యుత్‌ కొనుగోలు ఖర్చు తగ్గించుకునేందుకు ఇది చాలా ఉపయోగపడుతోందని అధికారులు పేర్కొన్నారు. కచ్చితమైన డిమాండ్‌ను తెలిపిపేందుకు ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ విధానాన్ని ఉపయోగించుకుంటున్నామని, గతంలో ఎంఓపీఈ 4 నుంచి 5 శాతం ఉంటే, ఇప్పుడు 2 శాతానికి తగ్గిందని అధికారులు తెలిపారు.

సీఎం ఆదేశాల మేరకు ట్రాన్స్‌ఫార్మన్‌ పాడైన 24 గంటల్లోపే ట్రాన్స్‌ఫార్మర్‌ పెడుతున్నామని, దీనివల్ల రైతులకు ఎలాంటి అవాంతరాలు లేకుండా విద్యుత్‌ అందిస్తున్నామని అధికారులు వివరించారు. గడచిన 90 రోజుల్లో 99.5శాతం ట్రాన్స్‌ఫార్మర్లను 24 గంటల్లోపే రీప్లేస్‌ చేశామని అధికారులు తెలిపారు. ఇది నూటికి నూరుశాతం జరగాలని సీఎం అన్నారు. 

ఈ సందర్భంగా సీఎం ఏమన్నారంటే..
బొగ్గు నిల్వలకు ఎలాంటి కొరత లేకుండా చూసుకోవాలని అధికారులను ఆదేశించిన సీఎం
విదేశీ బొగ్గు ధరలు మండిపోతున్న దృష్ట్యా దేశీయంగానే వీటిని సమకూర్చేకునేలా తగిన ప్రయత్నాలు చేయాలన్న సీఎం
వేసవి కోసం ప్రత్యేక ప్రణాళిక సిద్ధం చేసుకోవాలన్న సీఎం. 
ప్రపంచవ్యాప్తంగా ఉన్న పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఆ మేరకు చర్యలు తీసుకోవాలన్న సీఎం
సులియారీ, మహానది కోల్‌బాక్స్‌ నుంచి పూర్తిస్థాయి ప్రయోజనాలు పొందేలా ఆలోచనలు చేయాలని అధికారులకు సూచించిన సీఎం

వ్యవసాయ పంపుసెట్లకు మీటర్లు పెట్టుకునేందుకు ఇప్పటికే 16,63,705 మంది రైతుల అంగీకరించారన్న అధికారులు
రైతులు స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నందున వీలైనంత త్వరగా ఈ ప్రక్రియను పూర్తిచేస్తామన్న  అధికారులు
వ్యవసాయ పంపుసెట్లకు విద్యుత్‌ పంపిణీ అత్యంత పారదర్శకంగా, నాణ్యంగా, రైతులకు మేలు చేసేదిగా ఉండాలని స్పష్టం చేసిన సీఎం
అత్యంత మెరుగైన వ్యవస్థను తీసుకురావాలన్న సీఎం
రైతులకు మీటర్లపై నిరంతర అవగాహన కల్పించాలన్న సీఎం
దీనివల్ల కలుగుతున్న ప్రయోజనాలపై ఎప్పటికప్పుడు రైతులకు వివరాలు అందించాలన్న సీఎం

రైతుల పేరు చెప్పి దొంగతనంగా విద్యుత్‌ వాడుతున్న ఘటనలు కూడా దాదాపుగా అడ్డుకోగలుగుతున్నామన్న అధికారులు
మీటర్లు పెట్టడం వల్ల రైతులకు ఎంత కరెంటు అవసరమో తెలుస్తుంది: సీఎం
దీనివల్ల సరిపడా విద్యుత్‌ను వారికి పంపిణీ చేయడానికి వీలు కలుగుతుంది: సీఎం
దీనివల్ల రైతుల మోటార్లు కాలిపోవు, ట్రాన్స్‌ఫార్మర్లు కాలిపోవు: సీఎం

రైతులకు ఒక్కపైసా కూడా ఖర్చు కాకుండా విద్యుత్‌ పంపిణీ సంస్థలే మీటర్లను బిగిస్తాయి: సీఎం
వినియోగించుకున్న విద్యుత్‌కు అయ్యే ఖర్చును కూడా నేరుగా రైతుల ఖాతాల్లోకి పంపుతారు. 
అక్కడనుంచి ఆడబ్బు విద్యుత్‌ పంపిణీ సంస్థలకు చేరుతుంది: సీఎం
దీనివల్ల రైతులకు విద్యుత్‌ పంపిణీ సంస్థలు జవాబుదారీగా ఉంటాయి:
మోటార్లు కాలిపోయినా? నాణ్యమైన కరెంటు రాకపోయినా డిస్కంలను రైతు ప్రశ్నించగలుగుతాడు: సీఎం
ఈ వివరాలన్నింటిపైనా రైతులకు అవగాహన కల్పించాలి: సీఎం
శ్రీకాకుళం జిల్లాలో చేపట్టిన పైలట్‌ ప్రాజెక్టు కారణంగా రైతులకు పెద్ద ఎత్తున మేలు జరుగుతోంది: సీఎం
దీనివల్ల చాలా విద్యుత్‌ ఆదా అయ్యింది: సీఎం
ఈ వివరాలను కూడా విడుదల చేయాలని అధికారులకు సీఎం ఆదేశం

కృష్ణపట్నంలో 800 మెగావాట్ల యూనిట్‌ అందుబాటులోకి వచ్చిందని తెలిపిన అధికారులు
ఈ ప్రాజెక్టును ఇదే నెలలో ముఖ్యమంత్రిచే ప్రారంభిస్తామని తెలిపిన అధికారులు.
విజయవాడ థర్మల్‌ పవర్‌ కేంద్రంలో కూడా మరో 800 మెగావాట్ల కొత్త యూనిట్‌ కూడా వచ్చే ఏడాది మార్చినాటికి పూర్తిచేస్తామని తెలిపిన అధికారులు

జగనన్న కాలనీల్లో విద్యుత్‌ సదుపాయం కల్పనపై వివరాలు తెలిపిన అధికారులు
కాలనీలు పూర్తయ్యే కొద్దీ విద్యుత్, తాగునీరు, డ్రైనేజీ సదుపాయాలు కల్పించాలన్న సీఎం
క్రమేణా ఇతర మౌలిక సదుపాయాలను మెరుగుపరుచుకుంటూ పోవాలన్న సీఎం

పంప్డు స్టోరేజీ ప్రాజెక్టులపైనా సీఎం సమీక్ష
రాష్ట్రంలో పంప్డు స్టోరేజీ ప్రాజెక్టుల ప్రగతిని వివరించిన అధికారులు
పంప్డు స్టోరేజీ ప్రాజెక్టుల వల్ల రాష్ట్రానికి చక్కటి ప్రయోజనాలున్నాయి: సీఎం
ప్రాజెక్టులకు భూములు ఇచ్చిన వారికి, అసైన్డ్‌ భూములున్న వారికి కూడా  ఏడాదికి ఎకరాకు రూ.30వేల చొప్పున ప్రయోజనం: సీఎం
దీర్ఘకాలం ఈ ప్రయోజనాలు అందుతాయి: సీఎం
ప్రతి రెండేళ్లకు ఒకసారి 5శాతం చొప్పున ఈ ధర పెరుగుతుంది
భూమిలిచ్చే రైతులకు గరిష్ట ప్రయోజనం కల్పించాలన్నదే ఉద్దేశం, దానికోసమే ఈ విధానానికి శ్రీకారం చుట్టాం

గ్రీన్‌ఎనర్జీ ఉత్పత్తికోసం భారీ ప్రాజెక్టు ప్రతిపాదనలు రాష్ట్రానికి అందాయన్న అధికారులు
గ్రీన్‌ హైడ్రోజన్, గ్రీన్‌అమ్మోనియా ప్రాజెక్టులను పెడతామంటూ రాష్ట్ర ప్రభుత్వానికి రెన్యూ కంపెనీ నుంచి ప్రతిపాదనలు వచ్చాయన్న అధికారులు
విశాఖపట్నం, కాకినాడ పోర్టులకు సమీపంలో ఈ ప్రాజెక్టులు పెట్టేందుకు ప్రతిపాదించారన్న అధికారులు
దాదాపుగా రూ.20వేల కోట్లు పెట్టుబడులు వీటికోసం పెడతామని ప్రతిపాదించారని తెలిపిన అధికారులు
అలాగే ఎన్టీపీసీ నుంచి కూడా ప్రతిపాదనలు వచ్చాయన్న సీఎంకు తెలిపిన అధికారులు
విశాఖ జిల్లా పూడిమడక సమీపంలో గ్రీన్‌ హైడ్రోజన్‌ ఇ– మెథనాల్, గ్రీన్‌అమ్మోనియా, ఆఫ్‌ షోర్‌ విండ్‌ పవర్,  హైడ్రోజన్‌ ఆధారిత విద్యుత్‌ కేంద్రాలపై రూ. 95వేల కోట్ల పెట్టుబడులు పెడతామన్న ప్రతిపాదనలు వచ్చాయని తెలిపిన అధికారులు

పోలవరం విద్యుత్‌ ప్రాజెక్టులో నిర్మాణ పనుల ప్రగతిని వివరించిన అధికారులు
ఇప్పటికే టర్బైన్‌ మోడల్‌ టెస్ట్‌ ముగిసిందని, ఇంజనీరింగ్‌ డ్రాయింగ్స్‌ వేగంగా పూర్తవుతున్నాయని తెలిపిన అధికారులు. పవర్‌ హౌస్‌లో కాంక్రీటు పనులు ముందుకు సాగుతున్నాయని తెలిపిన అధికారులు.
అప్పర్‌ సీలేరులో 1350 మెగావాట్ల ప్రాజెక్టుకు సంబంధించి డీపీఆర్‌ పూర్తయ్యిందని తెలిపిన అధికారులు
టెండర్ల ప్రక్రియకు సిద్ధమవుతున్నామని తెలిపిన అధికారులు

మరిన్ని వార్తలు