పోర్టుల అభివృద్ధిపై సీఎం జగన్‌ ప్రత్యేక శ్రద్ధ

21 Nov, 2020 20:32 IST|Sakshi

వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి

సాక్షి, విశాఖపట్నం: దేశంలోనే 11 శాతం పారిశ్రామిక పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్‌లో పెట్టడానికి ముందుకు వస్తున్నట్టు అంచనా అని వైఎస్సార్‌సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి అన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ పారిశ్రామిక సమీక్షలో చర్చించిన అంశాలు  పరిష్కార దిశగా అధికారులు పనిచేస్తారని పేర్కొన్నారు. 972 కి.మీ. తీరంలో పోర్టుల అభివృద్ధిపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రత్యేక శ్రద్ధతో వున్నారని తెలిపారు.  ప్రపంచ పటంలో విశాఖ సిటీ  అభివృద్ధికి ఐదు అంశాలు పరిగణలోకి తీసుకుని అభివృద్ధి చేస్తామని ఆయన పేర్కొన్నారు. విశాఖలో స్కిల్డ్ లేబర్ అందుబాటులో ఉండేలా స్కిల్ డెవలప్‌మెంట్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తున్నామని విజయసాయిరెడ్డి తెలిపారు. (చదవండి: వైఎస్సార్‌ విగ్రహం అంటే.. బాబుకు నిద్రపట్టట్లేదు)

మరిన్ని వార్తలు