గత ప్రభుత్వం ఎగ్గొట్టిన రాయితీ బకాయిలు చెల్లించాం: సీఎం జగన్‌

26 Oct, 2021 12:34 IST|Sakshi

రైతుకు అన్ని సమయాల్లో అండగా నిలవడమే ప్రభుత్వం లక్ష్యం

వైఎస్సార్‌ రైతు భరోసా, వైఎస్సార్‌ సున్నా వడ్డీ పంట రుణాలు కార్యక్రమంలో సీఎం జగన్‌

సాక్షి, అమరావతి: రైతులకు సంబంధించి మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను నూటికి నూరుశాతం అమలు చేస్తున్నామని, ఇది రైతు పక్షపాత ప్రభుత్వమని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. సీఎం క్యాంపు కార్యాలయంలో వైఎస్సార్‌ రైతు భరోసా, వైఎస్సార్‌ సున్నా వడ్డీ పంట రుణాలు కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, రైతు పక్షపాత ప్రభుత్వం ఇది. ఒకేసారి మూడు పథకాలకు సంబంధించి నిధులను విడుదల చేస్తున్నామన్నారు. (చదవండి: మాది రైతు పక్షపాత ప్రభుత్వం: సీఎం జగన్‌

 ముఖ్యమంత్రి ఏమన్నారంటే...
‘‘ వైఎస్సార్‌ రైతు భరోసా, వైఎస్సార్‌ సున్నావడ్డీ, యంత్రసేవా పథకం... ఈ మూడు పథకాలకోసం రూ. 2190 కోట్ల లబ్ధి. వరుసగా మూడో సంవత్సరం.. రెండో విడత కింద రూ.2052 కోట్ల రూపాయలను జమచేస్తున్నాం. ఇప్పటికే రైతు భరోసా రెండో విడతగా ఆగస్టు మాసంలో రూ. 977 కోట్లు ఇచ్చాం. కేవలం ఈ ఒక్క రైతు భరోసా కింద మాత్రమే రూ.18,777కోట్లు ఇవ్వగలిగాం. దేశంలో ఎక్కడా కూడాలేని విధంగా, జరగని విధంగా సొంత భూములను సాగుచేసుకుంటున్న రైతులతోపాటు, కౌలు రైతులకు, అటవీ, దేవాదాయ భూములను సాగుచేసుకుంటున్న రైతులకు ప్రతి ఏటా రూ.13500రూపాయలను అందిస్తున్న ఏకైక ప్రభుత్వం మనది. వైఎస్సార్‌ సున్నా వడ్డీ పథకం ద్వారా 6,67లక్షల రైతులకు రూ.112 కోట్లకుపైగ సున్నా వడ్డీ పథకాన్ని వర్తింపు చేస్తున్నాం. ఏడాదిలోపే పంటరుణాలు చెల్లించిన వారికి.. వారు కట్టీని వడ్డీని తిరిగి వారి ఖాతాల్లోకి జమచేస్తున్నామని’’ సీఎం అన్నారు.  (చదవండి: టార్గెట్‌.. జాబ్స్‌)

‘‘మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటిన నుంచి సున్నా వడ్డీ పథకం కింద అక్షరాల 1674 కోట్ల రూపాయలు ఇచ్చాం. 10778 రైతు భరోసా కేంద్రాల్లో 9160 మంది బ్యాంకింగ్‌ కరస్పాండెట్లను కూడా పెట్టాం. మిగిలిన చోట్లా కూడా పెట్టేందుకు చర్యలు తీసుకుంటున్నాం. కౌలు రైతులతో సహా.. రైతులందరికీ కూడా బ్యాంకు లావాదేవీలు జరుపుకునేందుకు, రైతుల పంటరుణాలు అందుకునేందుకు బ్యాకింగ్‌ కరస్పాండెంట్ల సేవలు మీకు బాగా ఉపయోగపడతాయి. వైఎస్సార్‌ రైతు భరోసా, సున్నావడ్డీతోపాటు వైయస్సార్‌ యంత్రసేవా పథకం కింద 1720 గ్రూపులకు రూ. 25.55 కోట్ల రూపాయలు నేడు జమ చేస్తున్నామని’’ సీఎం పేర్కొన్నారు.

రాష్ట్రవ్యాప్తంగా రూ.2134 కోట్లతో రైతు భరోసా కేంద్రాల్లో యంత్రసేవా కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నాం
వరి ఎక్కువగా సాగయ్యే ప్రాంతాల్లో మండలానికి అదనంగా 5 చొప్పున 1035 కంబైన్డ్‌ హార్వెస్టర్లను పెడుతున్నాం
29 నెలల్లో గణనీయమైన మార్పులు తీసుకు వచ్చాం
దేవుడి దయతో వాతావరణం అనుకూలించి కరువు సీమ సైతం.. నీటితో పుష్కలంగా ఉంది
రైతుకు ఇంతకుముందు కరువులు, కాటకాలు మాత్రమే తెలుసు
కరోనా సవాల్‌ విసిరినా.. రైతు అడుగు ముందుకేస్తున్నాడు
గత ప్రభుత్వం ఎగ్గొట్టిన బకాయిలను సైతం చెల్లించుకుంటూ వస్తున్నాం
వ్యవస్థలను సరిదిద్దుతున్నాం
మార్కెటింగ్‌ మీద విపరీతమైన శ్రద్ధ కూడా పెట్టాం
ధరల స్థిరీకరణ నిధిని కూడా తీసుకు వచ్చాం
పొగాకుకు కూడా ధరల స్థిరీకరణను వర్తింప చేస్తాం
జోక్యం చేసుకుని రైతులకు బాసటగా నిలిచాం
విత్తనం నుంచి పంట అమ్మకం వరకూ కూడా అన్నింట్లోనూ కూడా రైతులను చేయిపట్టుకుని ఆర్బీకేలు నడిపిస్తున్నాయి
ఇలాంటి గొప్ప మార్పులు తీసుకు వస్తున్నాం
వ్యవసాయ సలహా మండళ్లను ఏర్పాటు చేస్తాం
ఆర్బీకే, మండల, జిల్లా, రాష్ట్రస్థాయి.. నాలుగు అంచెలుగా సమావేశాలు ఏర్పాటు చేశాం
సలహాలు, సూచనలతో మార్పులు, చేర్పులు చేసుకుంటున్నాం
ఇ- క్రాపింగ్‌ అన్నది.. ప్రతి రైతుకు, ప్రతి పంటకూ నమోదు చేసుకోవడం ద్వారా పంటల బీమా, ఇన్‌పుట్‌ సబ్సిడీ, పంట కొనుగోలు, పంటరుణాలు, సున్నావడ్డీలు ఇవన్నీ కూడా పారదర్శకంగా అందిస్తున్నాం
ఎలాంటి అవకతవకలకు తావు లేకుండా పారదర్శకంగా ప్రతి పథకానికి ఇ- క్రాపింగ్‌ ద్వారా అనుసంధానం చేస్తున్నాం
యంత్రసేవా కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నాం
గ్రామ స్థాయిలో వ్యవసాయాన్ని యాంత్రీకరిస్తున్నాం
ప్రతి గ్రామంలోనూ వ్యవసాయ సహాయకులను ఉంచాం
ప్రతి సేవను వారిద్వారా అందిస్తున్నాం
సహకార వ్యవస్థలో హెచ్‌ఆర్‌విధానాన్ని తీసుకు వస్తున్నాం
ప్రాథమిక వ్యవసాయ సహకార సంస్థలను కంప్యూటరీకరిస్తున్నాం
సీఎం యాప్‌ద్వారా.. రైతులు ధరల విషయంలో ఇబ్బంది పడే పరిస్థితి ఉంటే.. వెంటనే వారిని ధరల స్థిరీకరణ ద్వారా ఆదుకునేందుకు అడుగులు ముందుకేస్తున్నాం
ఆర్బీకేల ద్వారా కేంద్రం ప్రకటించిన 17 పంటలకు మాత్రమే కనీస గిట్టుబాటు ధరలను వర్తింపు చేయడమే కాకుండా మరో 7 పంటలకు కూడా ఎంఎస్‌పీ వర్తింపు చేస్తున్నాం:
ఇవన్నీ చేయడానికి గ్రామ స్థాయిలోనే ఆర్బీకే ఉంది
కొత్తగా వ్యవసాయ కళాశాలలు, పాలిటెక్నిక్‌లు మంజూరుచేస్తూ... వ్యవసాయ మార్కెట్లను కూడా ఆధునీకరిస్తున్నాం
కల్తీ నివారణమీద మన ప్రభుత్వం దృష్టిపెట్టినట్టుగా మరే ప్రభుత్వం దృష్టిపెట్టలేదు
కల్తీలేని ఎరువులు, పురుగుమందులు, విత్తనాలు అందిస్తున్నాం
ప్రైవేటు వ్యాపారుల వద్ద కూడా కల్తీలేని వాటిని అమ్మేలా చర్యలు తీసుకుంటున్నాం
పగటిపూటే రైతులకు 9 గంటలపాటు నాణ్యమైన విద్యుత్‌ను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు రూ.18వేల కోట్ల రూపాయలు ఖర్చుచేశాం
ఇది కాక గత ప్రభుత్వం కట్టకుండా వదిలేసిన మరో రూ.10వేల కోట్ల బకాయిలను కూడా మన ప్రభుత్వం చిరునవ్వుతో కట్టింది
నాణ్యమైన కరెంటు ఇచేందుకు, అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ఫీడర్ల అభివృద్ది కోసం రూ.1700 కోట్ల రూపాయలు కూడామనం ఖర్చు చేశాం
29 నెలల కాలంలో వైయస్సార్‌ ఉచిత పంటల భీమా ద్వారా 31.7లక్షలమంది రైతులకు రూ. 3716 కోట్ల రూపాయలు అందించగలిగాం
ఇది కాక ధాన్యం సేకరణకోసం రూ.35వేల కోట్ల పైచిలుకు ఖర్చుచేశాం
మరో రూ.1800 కోట్ల రూపాయలతో పత్తిపంటను కూడా కొనుగోలు చేశాం
ఇతర పంటలకోసం రూ.6400 కోట్లకుపైగా ఖర్చు చేశాం
ధరలు పడిపోకూడదు.. రైతు నష్టపోకూడదని.. ఈ కార్యక్రమాలు చేశాం
గత ప్రభుత్వం ఎగ్గొట్టిన రూ.960 కోట్ల ధాన్యం బకాయిలను కూడా రైతుల కోసం మన ప్రభుత్వం కట్టింది
గత ప్రభుత్వం వదిలేసిన రూ.384 కోట్ల రూపాయల విత్తన బకాయిలను కూడా మనమే చెల్లించాం
ఏ సీజన్‌లో పంట నష్టం జరిగితే.. అదే సీజన్‌లో అందించేలా చేస్తున్నాం
ఇన్‌పుట్‌ సబ్సిడీని పంట నష్టం జరిగిన అదే సీజన్‌లో నే ఇచ్చే కొత్త ఒరవడిని తీసుకు వచ్చాం
ఏపీ అమూల్‌ పాలవెల్లువను తీసుకు రాగలిగాం
ఆక్వా రైతులకు కరెంటు సబ్సిడీ కింద రూ.1.5కే యూనిట్‌ అందిస్తున్నాం
రెండు సంవత్సరాల్లో రూ.1560 కోట్లు సబ్సిడీ రూపంలో ఆక్వారైతులకు ఇచ్చాం
రైతన్నల ఆత్మహత్యలు చూడ్డానికి ఈ రాష్ట్రానికి బృందాలు వస్తే.. మన రైతు భరోసా కేంద్రాలను చూడ్డానికి ఇతర రాష్ట్రాలనుంచి బృందాలు వస్తున్నాయి
సకాలంలో మంచి వర్షాలు పడాలని, వ్యవసాయం పండుగగా కొనసాగాలని మనసారా కోరుకుంటున్నాను


 

మరిన్ని వార్తలు