తల్లులకు పోషణ.. పిల్లలకు రక్షణ: సీఎం జగన్‌

7 Sep, 2020 12:09 IST|Sakshi

సంపూర్ణ పోషణ పథకాలను ప్రారంభించిన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి

సాక్షి, అమరావతి: నేటి బాలలే రేపటి పౌరులని.. చిన్నారులకు పౌష్టికాహారం అందించడం కోసమే సంపూర్ణ పోషణ పథకాలను ప్రారంభించామని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. వైఎస్సార్‌ సంపూర్ణ పోషణ ప్లస్, వైఎస్సార్‌ సంపూర్ణ పోషణ పథకాలను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తన క్యాంపు కార్యాలయంలో సోమవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు తానేటి వనిత, బొత్స సత్యనారాయణ, శంకర్‌ నారాయణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ హెల్దీ బాడీ, హెల్దీ మైండ్‌ చాలా అవసరమని తెలిపారు. (చదవండి: జగన్‌ పాలనపై వంద శాతం సంతృప్తి

‘‘గర్భిణీల్లో 53 శాతం మందికి రక్తహీనత ఉంది. తక్కువ బరువున్న పిల్లలు సుమారు 32 శాతం మంది ఉన్నారు. రక్తహీనత, పౌష్టికాహార లోపంతో బాధపడుతున్న గర్భిణీలు, బాలింతలు, 6 నుంచి 72 నెలలలోపు పిల్లలకు పౌష్టికాహారం అందిస్తాం. చదువు, ఆలోచనల్లో బలహీనులుగా ఉండకూడదనే ఈ పథకాలు. అంగన్‌వాడీ కేంద్రాలను ప్రీ ప్రైమరీ కేంద్రాలుగా మార్చబోతున్నాం. 55,607 అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా పౌష్టికాహారం అందిస్తాం. ప్రపంచంతో పోటీ పడే విధంగా ఇంగ్లీష్‌ మీడియాన్ని కూడా తీసుకొచ్చాం. తల్లులకు పోషణ, పిల్లలకు రక్షణగా వైఎస్ఆర్ పోషణ, వైఎస్ఆర్‌ పోషణ ప్లస్ పథకాలు ఉంటాయని’ సీఎం తెలిపారు.

వైఎస్ఆర్‌ సంపూర్ణ పోషణ పథకం కింద 26.36లక్షల మంది గర్భిణీలు, బాలింతలు, చిన్నారుల కోసం రూ.1,555.56 కోట్లు ఖర్చు చేయబోతున్నామని తెలిపారు. వైఎస్సార్‌ సంపూర్ణ పోషణ ప్లస్ పథకం కింద 77 గిరిజన మండలాల్లో 3.80లక్షల మంది గర్భిణీలు, బాలింతలు, చిన్నారుల కోసం రూ.307.55 కోట్లు కేటాయించామన్నారు. మొత్తంగా సుమారు రూ.1863 కోట్లు ఖర్చు చేయబోతున్నామని సీఎం వైఎస్‌ జగన్‌ పేర్కొన్నారు.

సీఎం ప్రసంగంలో ముఖ్యాంశాలు..
ఇవాళ ప్రారంభిస్తున్న వైఎస్సార్‌ సంపూర్ణ పోషణ, వైఎస్సార్‌ సంపూర్ణ పోషణ ప్లస్‌ పథకాలు నిజంగా మంచి చేయడంలో సంతృప్తి ఇచ్చే కార్యక్రమాలు. 
గతంలో పిల్లలు ఎలా ఉన్నారు? ఎత్తుకు తగ్గ బరువు ఉన్నారా? లేదా? ఆరోగ్యంగా ఉన్నారా? వారి తల్లులు ఎలా ఉన్నారన్నది ఎవరూ ఆలోచన చేయలేదు. వారికి ఏం చేయాలన్నది కూడా ఆలోచించలేదు. హెల్తీ బాడీ. హెల్తీ మైండ్‌. అన్నది ఎవ్వరూ పట్టించుకోలేదు.
చాలీ చాలని విధంగా నిధులు ఇచ్చేవారు. ఏటా రూ.500 కోట్లు ఇస్తే ఎక్కువ అన్నట్లుగా ఉండేది.
మన పిల్లలు రేపటి పౌరులు, రేపటి ప్రపంచంతో వారు పోటీ పడే స్థితిలో ఉన్నారా? లేరా? అన్నది చూశాక వారిలో మార్పు తీసుకురావాలని అన్ని కోణాల్లో ఆలోచించి నిర్ణయం తీసుకున్నాం.
నేటి తరంలో చాలా మందికి మంచి ఆహారం లభించడం లేదు. పిల్లలు, తల్లిదండ్రులు ఆ పరిస్థితిలో ఉన్నారు. వారందరిలో మార్పు తీసుకురావడం కోసమే ఈ పథకాలు.
పేదల పిల్లలకు బలహీనత, రక్తహీనత వంటి అనేక అనారోగ్య సమస్యలు ఉన్నాయి. 
వాటికి సంబంధించి మన పిల్లలు ఎలా ఉన్నారన్నది చూస్తే, అలాగే తల్లుల పరిస్థితి చూస్తే.. గర్భవత్లులో దాదాపు 53  శాతం మంది రక్తహీనతతో బాధ పడుతున్నారు.
31.9 శాతం పిల్లలు తక్కువ బరువుతో జన్మించడం లేదా 5 ఏళ్ల వరకు అలాగే ఉంటున్నారు.
17.2 శాతం మంది పిల్లలు ఎత్తుకు తగ్గ బరువు లేరు. మరో 31 శాతం మంది పిల్లలు బరువుకు తగ్గ ఎత్తులో లేరు.
ఇంత దుస్థితి ఉంది, ఇవి కొత్తగా వచ్చినవి కావు, కానీ గతంలో పాలకులు ఏ మాత్రం పట్టించుకోలేదు.
ఈ నెంబర్లు మారాలి, పరిస్థితి మారాలి. పిల్లల ఎదుగుదల లేక, వారు వెనకబడి పోతున్నారు.
ఇంట్లో తినడానికి తగిన ఆహారం లేకపోతే, అది పిల్లల మేధస్సు, ఎదుగుదలలో కనిపిస్తోంది. తల్లిదండ్రులకు తగ్గట్లుగా పిల్లలు కూడా తగిన ఎదుగుదల లేక ఉన్నారు. ఈ పరిస్థితి మారాలి
ఇవన్నీ తెలిసినా, గతంలో ఎవరూ పట్టించుకోలేదు. అందుకే ఈ ప్రభుత్వం ముందుకు అడుగు వేసింది. ఆ దిశలోనే పిల్లలు, గర్భిణీలు, బాలింతల బాగు కోసం ఈ పథకాలు.
55607 అంగన్‌వాడీల పరిధిలో పూర్తి మార్పులు చేస్తూ, పీపీ–1, పీపీ–2 ప్రారంభిస్తున్నాం.
బాగా డబ్బున్న వారి కుటుంబాల వారి పిల్లలు ప్రాథమిక స్థాయిలో రకరకాల చదువులు చదువుతున్నారు, పేద పిల్లలు కూడా అలాగే చదవాలన్న తపనతో ఈ మార్పులు చేస్తున్నాం.
పీపీ–1, పీపీ–2 ప్రారంభిస్తూ, ఇంగ్లిష్‌ మీడియం‌లో గట్టి పునాది వేసేలా అంగన్‌వాడీల్లో మార్పు చేస్తున్నాం.

రూపు మార్చుకున్న అంటరానితనం:
ఇంగ్లిష్‌ మీడి​యాన్ని వ్యతిరేకిస్తున్న వారిలో రూపం మార్చుకున్న అంటరానితనం కనిపిస్తోంది, వారిలో మార్పు రావాలి.
వైఎస్సార్‌ సంపూర్ణ పోషణ పథకం, వైఎస్సార్‌ సంపూర్ణ పోషణ పథకం ప్లస్‌ పథకాల ద్వారా దాదాపు 30.16 లక్షల అక్క చెల్లెమ్మలు, చిన్నారులకు లబ్ధి.
47,248 అంగన్‌వాడీ కేంద్రాలు గిరిజనేతర ప్రాంతాల్లో ఉన్నాయి.
మొత్తంగా ఏటా రూ.1863.11 కోట్ల వ్యయంతో పౌష్టికాహారం సరఫరా.
గత ప్రభుత్వం ఏటా కనీసం రూ.500 కోట్లు కూడా ఖర్చు చేయలేదు.

ఖర్చుకు వెనకాడవద్దు:
రోజూ పెట్టే మెనూలో ఇంకా ఏమైనా మార్పులు తీసుకురండి. ఎక్కువ ఖర్చైయినా ఫరవాలేదు, తినడానికి ఆసక్తిగా ఉండాలి.
ప్రతి లబ్ధిదారునిపై గతంలో నెలకు కనీసం రూ.200 కూడా ఖర్చు చేయలేదు, కానీ ఈ ప్రభుత్వం రూ.1100 ఖర్చు చేస్తోంది.
కోవిడ్‌ సమయంలో ఆదాయాలు పడిపోయాయి. గత ప్రభుత్వం పెద్ద ఎత్తున బకాయిలు పెట్టి పోయింది. వాటన్నింటినీ తీరుస్తూ, అందరికీ మేలు చేయడం కోసం ఈ పథకాలు అమలు.
అధికారంలోకి వచ్చి 15 నెలలు గడిచాయి. అధికారం లోకి రాగానే తొలుత 77 మండలాల్లో ప్రయోగాత్మకంగా పథకం అమలు. దాని ఫలితాలు విశ్లేషించి ఇవాళ్టి నుంచి రాష్ట్రవ్యాప్తంగా అమలు.

రాబోయే రోజుల్లో..
రాబోయే రోజుల్లో అంగన్‌వాడీ కేంద్రాలలో ఇంకా అభివృద్ధి.
నాడు–నేడులో రూపురేఖలు మార్పు.
ఆ దిశలో కొత్తగా పీపీ–1, పీపీ–2లు ప్రారంభం, బాలలకు పౌష్టికాహారం.
పేదలు కూడా సగర్వంగా మంచి విద్యను పొందేలా ఈ కార్యక్రమం ద్వారా చేయగలుగుతామని నమ్మకం.

మరిన్ని వార్తలు