మ‌హిళ‌ల‌కు భ‌రోసా క‌ల్పించేందుకు 'దిశ‌'

8 Sep, 2020 11:20 IST|Sakshi

సాక్షి, కాకినాడ :  రాష్ట్రాల్లో పోలీసు వ్యవస్థను పటిష్టం చేసే దిశగా ముఖ్యమంత్రి జ‌గ‌న్‌మోహ‌న్ రెడ్డి చర్యలు చేపట్టార‌ని మంత్రి కుర‌సాల‌ క‌న్న‌బాబు ప్ర‌శంసించారు. పోలీసుల పట్ల ప్రజల్లో గౌరవం పెరిగేలా  సిఎం జగన్ పలు సంస్కరణలు తీసుకువచ్చారన్నారు. పోలీసు వ్యవస్థకు గౌరవం  తీసుకుని వచ్చే విధంగా సిబ్బంది నడుచుకోవాలని ఈ సంద‌ర్భంగా ఆయ‌న సూచించారు.  అత్యంత కీల‌క‌మైన  ఏపిఎస్పీ బెటాలియన్ విపత్తు సమయాల్లో  అందించిన సేవ‌లు అభినంద‌నీయం అని కొనియాడారు.

పోలీసు వ్యవస్థను ఆధునికంగా సాంకేతికపరంగా పటిష్ట పరిచే దిశగా సిఎం జగన్ అనేక చర్యలు తీసుకుంటున్నార‌ని క‌న్న‌బాబు వెల్ల‌డించారు. మహిళలకు మేమున్నామని భరోసా కల్పించేందుకు దిశ చట్టాన్ని సిఎం జగన్ తీసుకు వచ్చారని,  పోలీసు వ్యవస్థలో వీక్లీ ఆఫ్ ప్రకటించిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జ‌గ‌న్‌కే  దక్కుతుద‌న్నారు.  ఫ్రెండ్లీ పోలీసింగ్ వ్యవస్థ ద్వారా  సేవలందించేందుకు  స్పందన కార్యక్రమం నిర్వహిస్తున్నామ‌ని, మ‌రిన్ని సంస్క‌ర‌ణ‌ల దిశ‌గా ప్ర‌భుత్వం ముందుకెళ్తుంద‌ని మంత్రి స్ప‌ష్టం చేశారు. (సీఎంగా చంద్రబాబుది అధికార దుర్వినియోగమే)


 

>
మరిన్ని వార్తలు