బద్వేలు, కడపలో సీఎం జగన్‌ పర్యటన షెడ్యూల్‌ ఇదే..

9 Jul, 2021 08:37 IST|Sakshi

కడప కార్పొరేషన్‌: రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శుక్రవారం బద్వేలు, కడప నియోజకవర్గాల్లో  పర్యటించనున్నారు. రెండు నియోజకవర్గాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు. రెండుచోట్లా బహిరంగ సభల్లో పాల్గొంటారు.

9వ తేదీ ఉదయం 10.15 గంటలకు వైఎస్సార్‌ ఎస్టేట్‌లోని హెలీప్యాడ్‌ నుంచి హెలికాప్టర్‌లో బయలుదేరి 10.40కి బద్వేల్‌లోని విద్యానగర్‌ హెలీప్యాడ్‌కు  చేరుకుంటారు.   
11.10 గంటల నుంచి 12.45 వరకూ బహిరంగ సభ జరిగే మైదానంలో బద్వేల్‌ నియోజకవర్గానికి  సంబంధించిన  పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేసిన అనంతరం  సభలో ప్రసంగిస్తారు. 
మధ్యాహ్నం 1.20 గంటలకు హెలీప్యాడ్‌ నుంచి  హెలికాప్టర్‌లో బయలుదేరి 1.45గంటలకు రిమ్స్‌ జనరల్‌ హాస్పిటల్‌లోని హెలీప్యాడ్‌కు చేరుకుంటారు.  
1.50కి  అక్కడి నుంచి రోడ్డు మార్గాన బయలుదేరి  2.05 గంటలకు  ఎర్రముక్కపల్లెలోని  సీపీ బ్రౌన్‌ రీసెర్చ్‌ సెంటర్‌కు చేరుకుంటారు.  
2.10 నుంచి 2.20 గంటల వరకూ అక్కడ  బ్రౌన్‌  విగ్రహాన్ని ఆవిష్కరించి, సీపీ బ్రౌన్‌ రీసెర్చ్‌ సెంటర్‌ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారు.  
2.35 గంటలకు కలెక్టరేట్‌ సమీపంలోని మహావీర్‌ సర్కిల్‌కు చేరుకుంటారు.  
2.40 గంటల నుంచి 3.25 గంటల వరకూ  శిలాఫలకాలను ఆవిష్కరించి పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవం చేస్తారు. 
3.45 గంటలకు వైఎస్‌ రాజారెడ్డి ఏసీఏ క్రికెట్‌ స్టేడియం చేరుకుంటారు.  
3.50 గంటల నుంచి 4.20 గంటల వరకూ అక్కడ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసి దివంగత వైఎస్‌ రాజారెడ్డి, వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డిల విగ్రహాలను ఆవిష్కరిస్తారు.  
సాయంత్రం  4.25 గంటలకు వైఎస్‌ రాజారెడ్డి క్రికెట్‌ స్టేడియం నుంచి బయలుదేరి 4.35 గంటలకు  రిమ్స్‌లోని హెలీప్యాడ్‌కు చేరుకుంటారు.  
5 గంటలకు కడప విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరి 5.45 గంటలకు గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంటారు. 
 6.10కి అమరావతిలోని నివాసానికి చేరుకుంటారు. 

మరిన్ని వార్తలు