కోవిడ్‌పై నిరంతరం అప్రమత్తంగా ఉండాలి: సీఎం జగన్‌

27 Jul, 2021 17:44 IST|Sakshi

రాష్ట్రంలో కోవిడ్‌ను బాగా అరికట్టగలిగాం

స్పందన కార్యక్రమంలో సీఎం వైఎస్ జగన్

సాక్షి, అమరావతి: స్పందన కార్యక్రమంలో భాగంగా జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారం తన క్యాంపు కార్యాలయంలో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. కోవిడ్‌ నివారణా చర్యలు, రాష్ట్రంలో వర్షాలు, సహాయ కార్యక్రమాలు, ఖరీఫ్‌కు సన్నద్ధత, ఉపాధి హామీ పనులు, వైఎస్సార్‌ అర్బన్‌ క్లినిక్స్, గృహ నిర్మాణం, గ్రామ, వార్డు  సచివాలయాల్లో  తనిఖీలు, ఆగష్టులో అమలు చేయనున్న పథకాలపై సీఎం వైఎస్‌ జగన్‌ సమీక్ష నిర్వహించారు. స్పందనతో ప్రజలకు మేలు జరుగుతుందని, స్పందన కార్యక్రమం మళ్లీ ప్రారంభించడం సంతోషకరం ఉందని సీఎం అన్నారు. కోవిడ్‌కారణంగా ఇన్నాళ్లుగా జరగలేదని, మళ్లీ పునఃప్రారంభం కావడం ఆనందంగా ఉందని సీఎం అన్నారు.

వీడియో కాన్ఫరెన్స్‌లో సీఎం వైఎస్‌ జగన్‌ ఏమన్నారంటే..
కోవిడ్‌ –19 నియంత్రణ, నివారణ, వ్యాక్సినేషన్‌ కోవిడ్‌తో కలిసి జీవించాల్సిన పరిస్థితి:
వ్యాక్సినేషన్‌తోనే పరిష్కారం
దేశంలో ఉత్పత్తి అయ్యే వ్యాక్సిన్ల సంఖ్య తక్కువగా ఉంది
కేంద్రం మనకు ఇచ్చే కేటాయింపుల మేరకే ఇవ్వగలుగుతాం
ఉత్పత్తి పెరిగేదాకా... కోవిడ్‌తో కలిసి బతకాల్సిన పరిస్థితి
కోవిడ్‌ ప్రభావం క్రమంగా తగ్గుతోంది
ప్రస్తుతం రోజువారీ పాజిటివిటీ రేటు 2.82 శాతం:
రెండో వేవ్‌లో కొన్ని జిల్లాల్లో 25శాతం పాజిటివిటీ రేటు చూశాం.. క్రమంగా తగ్గుకుంటూ వచ్చింది:

కోవిడ్‌ నివారణలో సమిష్టి కృషి
కలెక్టర్లు నుంచి గ్రామ సచివాలయ సిబ్బంది, వలంటీర్లు, ఆశావర్కర్‌లు, డాక్టర్లు, ఏఎన్‌ఎంలు అందరుకూడా కలిసికట్టుగా పనిచేశారు
ప్రతి ఒక్కరూ బాగా పనిచేశారు
13 సార్లు ఇంటింటికీ వెళ్లి ఫీవర్‌ సర్వే  చేశారు
ఇది ఒక రికార్డు అనవచ్చు 
లక్షణాలు ఉన్నవారికి వెంటనే పరీక్షలు చేసి, వైద్యం అందించారు
ఫోకస్‌గా టెస్టింగ్‌ చేశారు
ముందుగానే వైరస్‌ను గుర్తించి.. సరైన సమయంలో తగిన విధంగా చికిత్స అందించారు
మరణాల రేటును తగ్గించగలిగి, కోవిడ్ ‌విస్తరణను అరికట్టగలిగాం
అందరికీ అభినందనలు తెలియజేస్తున్నా

ఇక ముందూ ఫోకస్డ్‌గా టెస్టులు
పరీక్షల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది
ఫోకస్‌గా పరీక్షలు చేయాలి, లక్షణాలు ఉన్నవారికి పరీక్షలు చేయాలి
ఎవరైనా అడిగితే.. వారికి కూడా పరీక్షలు చేయాలి
చేసే పరీక్షలన్నీ కూడా ఆర్టీపీసీఆర్‌ పరీక్షలు చేయాలి
ఇవి కచ్చితంగా చేసుకుంటూ పోవాలి
104 కాల్‌సెంటర్‌ నుంచి జిల్లాలకు పోవాలి, జిల్లాల్లో ఉండే కాల్‌సెంటర్ల నుంచి కోవిడ్‌తో బాధపడుతున్న వారికి కచ్చితంగా సర్వీసులు అందాలి
ఇంటింటి సర్వేలు జరగాలి, 104 కాల్‌సెంటర్‌ను సమర్థవంతంగా నడపడం కచ్చితంగా జరగాలి
మాస్క్‌లు ధరించాలి, భౌతిక దూరం పాటించాలి
ఇవి కచ్చితంగా అమలు కావాలి
కోవిడ్‌ ప్రోటోకాల్స్‌పై నిరంతర పర్యవేక్షణ ఉండాలి
కేసులు తగ్గుతున్న దృష్ట్యా అవసరాల మేరకు ఆస్పత్రులను పెట్టుకోవాలి
ప్రస్తుతం 302 ఆస్పత్రుల్లో సేవలు అందుతున్నాయి
కేసుల సంఖ్యను బట్టి అవసరమైన ఆస్పత్రులను అందుబాటులో ఉంచుకోవాలి
అలాగే కోవిడ్‌కేర్‌సెంటర్ల విషయంలో కూడా వ్యవహరించాలి
ప్రస్తుతం 123 కోవిడ్‌కేర్‌ సెంటర్లు ఉన్నాయి

థర్డ్‌వేవ్‌ సన్నద్ధత
మూడోవేవ్‌ వస్తుందన్న సమాచారంతో గతంలో ఇచ్చిన ఆదేశాల ప్రకారం అప్రతమతగా ఉండాలి: కలెక్టర్లకు స్పష్టం చేసిన సీఎం
థర్డ్‌వేవ్‌ వస్తుందో, లేదో తెలియదు కాని, మనం అప్రమత్తంగా ఉండాలి
జిల్లాల వారీగా మనం వేసుకున్న ప్రణాళికలు ప్రకారం ఆగస్టు చివరినాటికి అన్నిరకాలుగా సిద్ధం కావాలి:
ఆస్పత్రుల్లో అవసరాలమేరకు మౌలిక సదుపాయాలను, ఆక్సిజన్‌బెడ్లను పెంచుకోవాలి
అన్నిరకాలుగా మందులు, బయోమెడికల్‌ ఎక్విప్‌మెంట్లను సిద్ధంచేసుకోవాలి
స్టాఫ్‌ నర్సులకు పీడియాట్రిక్‌ కేర్‌లో శిక్షణ ఇవ్వని సందర్భాలు ఉంటే.. వారికి కూడా శిక్షణ ఇవ్వండి:

వ్యాక్సినేషన్‌
1.53 కోట్ల మందికి ఇప్పటివరకూ ఒక డోసు వాక్సిన్‌ ఇచ్చాం
దాదాపు 7 కోట్ల డోసులు అవసరం ఉంటే.. .1.53 కోట్ల డోసులు వేశాం
వ్యాక్సినేషన్‌ విషయంలో ఇంకా మనం చాలా దూరం వెళ్లాల్సి ఉంది
45 ఏళ్లకు పైబడ్డ వారికి 75.89 శాతం మందికి వ్యాక్సిన్‌ ఇచ్చాం
దీన్ని 90శాతం వరకూ తీసుకెళ్లాల్సి ఉంది
తర్వాత మిగిలిన ప్రాధాన్యతా వర్గాలకు వ్యాక్సిన్లు ఇవ్వాలి
టీచర్లకు, గర్భవతులకు, కాలేజీలకు వెళ్లే విద్యార్థులకు ప్రాధాన్యత ఇవ్వాలి
కాలేజీలుకూడా ప్రారంభమవుతున్నందున ఈచర్యలు తీసుకోవాలి
టీచర్లకు వ్యాక్సినేషన్‌లో ప్రాధాన్యత ఇవ్వండి
మొదటి డోసు ఇచ్చన వారికి, రెండో డోసు ఇవ్వడం చాలా అవసరం
కోవిడ్‌కారణంగా ముప్పుఉన్న వారికి ముందుగా వ్యాక్సిన్‌ ఇవ్వడంపై దృష్టి పెట్టండి
వ్యాక్సినేషన్‌పై అధికారులకు సీఎం దిశా నిర్దేశం

వర్షాలు, అప్రమత్తత, పునరావాసం
శ్రీశైలంలో డెడ్‌స్టోరేజీ నుంచే విద్యుత్‌ ఉత్పత్తిని స్టార్ట్‌చేశారు
796 అడుగుల నుంచే నీటిని విడుదల చేయడం మొదలుపెట్టారు
దేవుడు చాలా గొప్పవాడు.. అందుకనే వర్షాలు బాగా కురిశాయి..
నీళ్లు బాగా వస్తున్నాయి, శ్రీశైలం నిండుతోంది
వీటితోపాటు వర్షాలవల్లే  రాయలసీమ, ప్రకాశం, నెల్లూరు జిల్లాలో జలాశయాలు నిండే పరిస్థితి వచ్చింది
రాష్ట్ర వ్యాప్తంగా 8 జిల్లాల్లో అదనపు వర్షపాతం నమోదైంది
చిత్తూరు జిల్లాలో 77 శాతం, కడప జిల్లాలో 93.6 శాతం, అనంతపురంలో 82.4శాతం, కర్నూలులో 42.9 శాతం, ప్రకాశం జిల్లాలో 25 శాతం అదనపు వర్షపాతం నమోదైంది
రాష్ట్ర వ్యాప్తంగా 23 శాతం అదనపు వర్షపాతం నమోదైంది

అల్పపీడనం– అప్రమత్తంగా అధికారులు
వాతావరణశాఖ సమాచారం ప్రకారం జులై 28న అల్పపీడనం ఏర్పడే అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు:
అధికారులు అప్రమత్తంగా ఉండాలి
వర్షాలు ఎక్కువగా కురిసే అవకాశాలు నేపథ్యంలో తగిన చర్యలు తీసుకోవాలి
ధవళేశ్వరం వద్ద 5 లక్షల క్యూసెక్కులకుపైగా నీళ్లు కిందకు వెళ్తున్నాయి
కాపర్‌డ్యాం నిర్మాణం పూర్తైన నేపథ్యంలో దీని ప్రభావం వల్ల... వరదనీరు తక్కువగా ఉన్నప్పటికీ కూడా  ముంపు ఉండే అవకాశాలు ఉంటాయి
లెక్కలను సరిచేసుకోవాల్సిన అవసరం ఉంటుంది
గతంలో 10 లక్షల క్యూసెక్కులకు ముంపు ఉంటే.. ఇప్పుడు 6–7 లక్షలకే ముంపు ఉండే అవకాశాలు ఉంటాయి
ఈ అంశాలన్నింటినీ పరిగణలోకి తీసుకుని అన్నిరకాల జాగ్రత్తలు తీసుకోండి
సహాయ కార్యక్రమాలకోసం వెంటనే నిధులు కూడా విడుదలచేశాం
ఉభయగోదావరి జిల్లాల్లో ఎన్డీఆర్‌ఎఫ్, ఎస్డీఆర్‌ఎఫ్‌ బలగాలు కూడా ఉన్నాయి
మెడికల్‌క్యాంపులు, లైఫ్‌ జాకెట్లు, సహాయ కార్యక్రమాలకోసం బోట్లు... వీటన్నింటినీ సిద్ధంచేసుకోవాలని కలెక్టర్లును ఆదేశించిన సీఎం
కంట్రోల్‌ రూం ఏర్పాటు చేసి, దాన్ని 24 గంటలపాటు పర్యవేక్షించాలి

ఖరీఫ్‌ సన్నద్ధత:
మంచి వర్షాల వల్ల ఖరీఫ్‌ విస్తీర్ణం కూడా పెరుగుతోంది
సాధారణ విస్తీర్ణం 92.26 లక్షల ఎకరాలు అయితే ఇప్పటికే 27.46 లక్షల ఎకరాల్లో నాట్లు వేశారు
ఇ–క్రాపింగ్‌ అధిక ప్రాధాన్యత
కలెక్టర్లు ఇ–క్రాపింగ్‌పై దృష్టిపెట్టాలి
కలెక్టర్లు, జేసీలు ఆర్బీకేల పరిధిలో ఇనస్పెక్షన్లు చేయాలి
కలెక్టర్లు, జేసీలు కనీసం 10శాతం ఇ–క్రాప్‌ బుకింగ్‌ను ఇనస్పెక్షన్లు చేయాలి
జేడీఏలు, డీడీఏలు 20శాతం తప్పనిసరిగా చేయాలి
వ్యవసాయాధికారులు 30శాతం ఇనస్పెక్షన్లు చేయాలి
మరింత వేగంగా ఇ–క్రాపింగ్‌ చేపట్టాలి
ఇ– క్రాపింగ్‌ జరగని రైతు ఉండకూడదు
భౌతికంగా రశీదు, డిజిటల్‌ రశీదు ఉండాలి
దీనిపై రైతు సంతకం, అగ్రికల్చర్‌ అసిస్టెంట్‌ సంతకం ఉండాలి
డాక్యుమెంట్లు కావాలని క్షేత్రస్థాయి సిబ్బందికి ఎలాంటి బలవంతం చేయొద్దు
పంట వేసిన ప్రతిచోటా ఇ–క్రాపింగ్‌ చేయాలి
ఒక పొలంలో ఏ పంట ఏశారు, ఎవరు వేశారు, ఎన్ని ఎకరాలు వేశారు అన్నది ఇ–క్రాపింగ్‌లో నమోదు చేయాలి
పంటల బీమా చేయాలన్నా, సున్నా వడ్డీ ఇవ్వాలన్నా.. పంటల కొనుగోలు చేయాలన్నా.. ఇలా అన్ని రకాల అంశాల్లో ఇ– క్రాపింగ్‌ కీలకం
అందుకే రైతుల్లో అవగాహన కల్పించి.. ఇ–క్రాపింగ్‌పై దృష్టిపెట్టాలి

వ్యవసాయ సలహా మండలి సమావేశాలు
వ్యవసాయ సలహా మండలి సమావేశాలపై కలెక్టర్లకు కీలక ఆదేశాలు జారీ చేసిన సీఎం 
వ్యవసాయ సలహా మండలి సమావేశాలపై కలెక్టర్లు దృష్టిపెట్టాలి
ఆర్బీకే స్థాయిలో, మండల స్థాయిలో, జిల్లా స్థాయిలో ఈ సమావేశాలు జరగాలి
కలెక్టర్లు దీనిపై పర్యవేక్షణచేయాలి
పంటల ప్రణాళికను అమలు చేయడానికి ఈ సమావేశాలు మంచి మార్గాన్ని కల్పిస్తాయి
మార్కెట్లో డిమాండు ఉన్న పంటలు సాగు చేసేలా చేయాలి
లేకపోతే రైతులకు నష్టాలు వస్తాయి
ఏ పంట వేయాలి, ఏ రకం వేయాలి, ఏ పంట వేయకూడదు అనేది రైతులకు చెప్పాలి
బోర్ల కింద వరి పంట సాగు లాభదాయకం కాదు
ఇవన్నీ రైతులకు చెప్పాలి:
వరితోపాటు.. అదే స్థాయిలో ఆదాయాలు వచ్చే మార్గాలను రైతులకు చూపించాలి
ఖరీప్‌ సన్నద్థతతో పాటు ఇలాంటి అంశాలన్నింటిపైనా వ్యవసాయ సలహామండలి సమావేశాల్లో చర్చ జరగాలి
ఆర్బీకే స్థాయిలో మొదటి శుక్రవారం, రెండో శుక్రవారం మండలస్థాయి, మూడో శుక్రవారం జిల్లాస్థాయిలో వ్యవసాయ సలహామండలి సమావేశాలు జరగాలి
సలహామండలిల్లో ఇచ్చే సలహాలను పరిగణలోకి తీసుకుని జిల్లాస్థాయి సమావేశాల్లో ఆ అంశాలకు పరిష్కారం చూపాలి
కొన్ని జిల్లాల్లో ఈ సమావేశాల నిర్వహణలో వెనుకబడ్డాయి
దీనిపై మరింత ధ్యాస పెట్టండి 

రైతు బాగుంటేనే జిల్లా బాగుంటుంది
62 శాతం మంది వ్యవసాయ అనుబంధ రంగాలపై ఆధారపడి ఉన్నారు
రైతుల విషయంలో అన్ని రకాలుగా మనం సహాయకారిగా ఉండాలి

ఫీడ్, సీడ్, ఫెర్టిలైజర్‌ కల్తీలపై కొరడా
నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు రైతులకు ఆర్బీకేల ద్వారా అందుబాటులో ఉండాలి
దీని మీద కూడా ధ్యాస పెట్టాలి
మొత్తం 15.4 లక్షల క్వింటాళ్ల విత్తనాలు అవసరం
ఫెర్టిలైజర్స్‌కు సంబంధించి 20.20 లక్షల మెట్రిక్‌ టన్నులు అవసరం ఉంది
విత్తనాల్లోనూ, ఎరువుల్లోనూ కల్తీలు ఎట్టి పరిస్థితుల్లోనూ ఉండకూడదు
క్వాలిటీ గ్యారెంటీ రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది
అప్పుడే రైతు బాగుపడతాడు
రైతులకు అవసరమైన విత్తనాలను అందుబాటులో ఉంచాలి
నాణ్యతతో ఉన్నాయా? లేవా? అన్నది కలెక్టర్లు దగ్గరుండి పర్యవేక్షణ చేయాలి
బయట మార్కెట్లో అమ్ముతున్న విత్తనాలు, ఎరువులు, పురుగు మందులపై కూడా నాణ్యతను పరిశీలించాలి:
కలెక్టర్లు, ఎస్పీలు వారానికొసారి కూర్చుని ప్రజా సమస్యలపై చర్చించాలి
అందులో నాణ్యత లేని విత్తనాలు, ఎరువులు, ఫెర్టిలైజర్స్‌ దుకాణాలపై దృష్టి పెట్టాలి
అలాంటి వాటిపై కలెక్టర్లు, ఎస్పీలు కలిసి.. సంయుక్తంగా దాడులు నిర్వహించాలి
అప్పుడే కల్తీలు ఆగుతాయి:

ఆర్బీకేల స్ధాయి వరకూ బ్యాంకింగ్‌ సేవలు
ఆర్బీకేల వరకూ బ్యాకింగ్‌సేవలు అందాలి
ఆర్బీకేలను సమర్థవంతంగా వాడుకోవాలి
బ్యాంకులు చుట్టూ రైతులు తిరగడం కాదు, ఆర్బీకేల వద్దే వారికి బ్యాంకింగ్‌ సేవలు అందాలి
దీనివల్ల బ్యాంకింగ్‌లో మోసాలు తొలగిపోతాయి
రైతులకు మంచి సేవలు అందుతాయి

కౌలు రైతులకూ రుణాలు 
కౌలు రైతులకు కచ్చితంగా మేలు జరగాలి
కౌలు రైతులకు రుణాలు అందడంపై దృష్టిపెట్టండి
వారికి రుణాలు అందేలా కలెక్టర్లు తగిన చర్యలు తీసుకోండి

గ్రామ–వార్డు సచివాలయాలు, ఆర్బీకేలు–ఎస్‌ఓపీ
గ్రామ, వార్డు సచివాలయాలకు, ఆర్బీకెలకు  వెళ్లినప్పుడు కచ్చితంగా ఎస్‌ఓపీ పాటిస్తున్నారా?లేదా?చూడాలి
మధ్యాహ్నం 3 గంటలనుంచి 5 గంటలవరకూ ప్రజలకు అందుబాటులో ఉండి వారినుంచి విజ్ఞప్తులను స్వీకరించాలి
ఎస్‌ఓపీ కచ్చితంగా అమలయ్యేలా చూడాలి
అక్కడ ఉన్న సిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉండాలి
రోజుకు రెండు దఫాలుగా హాజరు నమోదు కావాలి
ఈ వ్యవస్థబతకాలి, మంచి ఫలాలు అందాలి
మంచి పర్యవేక్షణ, సమీక్షలు, తనిఖీలు ద్వారానే ఇది సాధ్యం

ధాన్యం బకాయిలు విడుదల
మొత్తం ధాన్యం బకాయిలను విడుదల చేస్తున్నాం
మొత్తం రూ.3300 కోట్లుకు గాను, రూ.1800 కోట్లు పది రోజుల క్రితమే చెల్లించాం
మిగిలిన బకాయిలను ఇవాళ విడుదల చేస్తున్నాం
రైతు చేతులోకి డబ్బులు వచ్చి ఖరీప్‌కు ఉపయోగపడాలని భావించాం
అది నెరవేరుతుంది:
రైతులకు ఎంత వేగంగా డబ్బులు ఇవ్వగలిగితే.. అంత మంచి జరుగుతుందని తాపత్రయం పడుతున్నాం
కొనుగోలు చేసిన 21 రోజుల్లో పేమెంట్లు ఇవ్వడానికి నానా తాపత్రయం పడ్డాం
గతంలో ఎప్పుడు లేనంతంగా మనం కొనుగోళ్లు చేశాం
గడిచిన రెండేళ్లలో సగటున మనం 83 లక్షల మెట్రిక్‌ టన్నులు కొనుగోలు చేశాం
అంతకు ముందు ఐదేళ్లలో రాష్ట్రంలో సగటున ప్రతిఏటా కొనుగోలు చేసేది కేవలం 55 నుంచి 57 లక్షల మెట్రిక్‌ టన్నులు మాత్రమే

జగనన్న పచ్చతోరణం:
ఆగస్టు 15 నుంచి ఆగస్టు 31 వరకూ రాష్ట్ర వ్యాప్తంగా కోటి మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నాం
దీన్ని అందుకోవడానికి కలెక్టర్లు చర్యలు తీసుకోవాలి
ఆగస్టు 5 నాటికి మొక్కల కొనుగోలుకు సంబంధించి టెండర్లు ఖరారు కావాలి
మిగిలిన పనులను త్వరితగతిన పూర్తి చేయాలి
గ్రామాల్లో సర్పంచులు, వలంటీర్లు, సచివాలయ సిబ్బందిని ఈ కార్యక్రమంలో భాగస్వాములు చేయాలి
మొక్కలు నాటగానే సరిపోదు, వాటì కి నీరు పోయడం, సంరక్షణపై దృష్టిపెట్టాలి
వేసిన మొక్కలు బతికేట్టుగా చర్యలు తీసుకోండి: సీఎం వైయస్‌.జగన్‌ స్పష్టీకరణ

నిర్మాణ పనులు వేగవంతం కావాలి
గ్రామ సచివాలయాలు, ఆర్బీకేలు, వైయస్సార్‌ హెల్త్‌క్లినిక్స్, ఏఎంసీ, బీఎంసీల నిర్మాణంపై దృష్టిపెట్టండి
రాష్ట్ర వ్యాప్తంగా 10,929 గ్రామ సచివాలయాలను నిర్మిస్తున్నాం
గ్రామ సచివాలయాల నిర్మాణంలో కృష్ణా, నెల్లూరు, తూ.గో.జిల్లాలో వెనకబడి ఉన్నాయి
కలెక్టర్లు వీటిపై ధ్యాస పెట్టాలి:
సెప్టెంబరు 30 కల్లా నిర్మాణ పనులు పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలి
నిర్మాణాలు దాదాపు పూర్తి చేసుకున్న స్ధితిలో అనంతపురం, తూ.గో, కృష్ణా జిల్లాలున్నాయి
వీటిపైనా ఆయా కలెక్టర్లు ధ్యాసపెడితే చాలావరకూ నిర్మాణాలు పూర్తవుతాయి

ఆర్బీకేలు
10,408 ఆర్బీకేలు నిర్మిస్తున్నాం:
ఆర్బీకేలలో ఇంకా బేస్‌మెంట్‌లెవల్లో తూ.గో. కృష్ణా, కర్నూలు జిల్లాలో నిర్మాణాలు ఎక్కువగా ఉన్నాయి 
ఈ జిల్లాల కలెక్టర్లు ప్రత్యేక శ్రద్ధ వహించాలి
డిసెంబరు 31 కల్లా పూర్తిచేసేలా కలెక్టర్లు దృష్టిపెట్టాలి

వైఎస్సార్‌ హెల్త్‌ క్లినిక్స్‌
వైఎస్సార్‌ హెల్త్‌క్లినిక్స్‌లో కర్నూలు, తూ.గో, కృష్ణా జిల్లాలు వెనుకబడి ఉన్నాయి
మొత్తం 8585 భవనాల్లో 76 శాతం బేస్‌మెంట్‌ లెవల్, గ్రౌండ్‌ ఫ్లోర్‌ శ్లాబ్‌ లెవల్‌ వరకు పూర్తయ్యాయి 
కేవలం ఒకటే శ్లాబ్‌ కాబట్టి, శ్రద్ధ పెడితే వెంటనే పూర్తవుతాయి
సెప్టెంబరు 30 కల్లా ఇవి పూర్తయ్యేలా చర్యలు తీసుకోండి
కర్నూలు,తూ.గో, కృష్ణా జిల్లాల్లో వీటిపై ధ్యాస పెట్టాలి
ఏఎంసీ, బీఎంసీల నిర్మాణంపై కలెక్టర్లు దృష్టిపెట్టాలి
తూ.గో, కడప, కృష్ణా జిల్లాలు ప్రత్యేక దృష్టిపెట్టాలి

డిజిటల్‌ లైబ్రరీలు
డిజిటల్‌ లైబ్రరీల విషయంలో 4530 గ్రామ పంచాయతీలకు ఫైబర్‌ కనెక్షన్‌ వస్తుంది
డిసెంబర్‌కల్లా వీటికి కనెక్షన్లు వస్తాయి
ఆ సమయానికి డిజిటల్‌ లైబ్రరీలను పూర్తిచేయడంపై దృష్టిపెట్టాలి
డిజిటల్‌ లైబ్రరీలను పూర్తిచేస్తే సంబంధిత గ్రామాలనుంచే వర్క్‌ఫ్రం హోం అవకాశాలను కల్పించగలుగుతాం
ఆగస్టు 15 కల్లావీటి నిర్మాణాలు మొదలయ్యేలా చర్యలు తీసుకోవాలి
యుద్ధ ప్రాతిపదికన వీటి నిర్మాణాలను పూర్తిచేయాల్సి ఉంది:

వైఎస్సార్‌ అర్భన్‌ క్లినిక్స్‌
534 అర్బన్‌క్లినిక్స్‌ తీసుకు వస్తున్నాం
వీటి నిర్మాణాలు కూడా త్వరగా పూర్తి చేయాలి
నవంబర్‌ 15 కల్లా వీటి నిర్మాణాలు పూర్తిచేసేలా చర్యలు తీసుకోవాలి

ఇళ్ల పట్టాల పంపిణీ
మొదటి దశలో 30 లక్షలకుపైగా ఇళ్లపట్టాలు ఇచ్చాం:
3,69,448 మందికి కోర్టు కేసులు కారణంగా అందలేదు:
ఈ కేసులు త్వరగా పరిష్కారం అయ్యేలా చూడండి:
వాళ్లకి త్వరగా మంచి జరగాలని దేవుడిని కోరుకుంటున్నాను:

90 రోజుల్లోగా ఇళ్లపట్టాల కార్యక్రమాన్ని సమీక్షించిన సీఎం
10,007 దరఖాస్తులు పెండింగులో ఉన్నాయి
వీటిని వెంటనే పరిశీలించి అర్హులను గుర్తించాలి
1,90,346 మందిని అర్హులుగా తేల్చారు. వీరికి వెంటనే పట్టాలు ఇవ్వాలి:
ఇందులో ప్రస్తుతం ఉన్న లే అవుట్లలో దాదాపు 43వేల మందికి పట్టాలు
మరో 10,652 మందికి ప్రభుత్వ స్థలాల్లోనే పట్టాలు:
మరో 1.36 లక్షల మందికిపైగా లబ్ధిదారులకు భూ సేకరణ చేయాల్సి ఉంది
భూ సేకరణ ప్రక్రియను వెంటనే పూర్తిచేయాలి

ఇళ్ల నిర్మాణ పనులపైనా సమీక్ష
మొదటి విడతలో 15.6 లక్షల ఇళ్ల నిర్మాణం చేపట్టాం
ఇందులో 10.01 లక్షల ఇళ్ల నిర్మాణ పనులు ప్రారంభం అయ్యాయి
లే అవుట్లలో నీరు, కరెంటు చాలా వరకూ కల్పించారు
మిగిలిపోయిన సుమారు 600కుపైగా లే అవుట్లలో నీటి వసతిని కల్పించడానికి వెంటనే చర్యలు తీసుకోవాలి

ప్రభుత్వమే ఇళ్లు కట్టించి ఇవ్వాలన్న ఆప్షన్‌ను 3.18 లక్షల మంది ఎంచుకున్నారు 
వీరిలో 20 మందితో ఒక గ్రూపు ఏర్పాటు చేయాలి
స్థానికంగా మేస్త్రిలను గుర్తించి పనులును ఆ గ్రూపులకు అనుసంధానం చేయాలి
ఆగస్టు 10 కల్లా గ్రూపుల ఏర్పాటు పూర్తికావాలి

సిమ్మెంటు, స్టీలు, ఇసుక అందుబాటులో ఉన్నాయా? లేవా? చూడాలి
వర్షాలు ప్రారంభం అవుతున్నందున ఇసుక పంపిణీలో అవాంతరాలు లేకుండా చూసుకోవాలి
మండల స్థాయిలో, గ్రామ సచివాలయ స్థాయిలో, అలాగే మున్సిపాల్టీ స్థాయిలో, వార్డు స్థాయిలో ఇళ్ల నిర్మాణంపై సంబంధిత అధికారులు సమీక్ష చేయాలి
కలెక్టర్లు కూడా దీనిపై పర్యవేక్షణ, సమీక్షచేయాలి
ఇళ్ల నిర్మాణం ద్వారా ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటుంది
సిమ్మెంటు, స్టీలు, బ్రిక్స్‌.. ఇలా ఇళ్లనిర్మాణ సామగ్రి కొనుగోలు ఊపందుకుంటుంది... తద్వారా ఆర్థిక వ్యవస్థకు బలం చేకూరుతుంది
కాలనీల్లో మౌలిక సదుపాయాలకు సంబంధించి డీపీఆర్‌లు కూడా సిద్ధంచేయాలి:

టిడ్కో ఇళ్లకు సంబంధించి అనర్హులైన వారి స్థానంలో కొత్త లబ్ధిదారులను ఎంపిక చేయాలి
వచ్చే స్పందన లోగా ఈ పని పూర్తికావాలి:

ఆగష్టు నెలలో చేపడుతున్న కార్యక్రమాలు
ఆగస్టు 10న నేతన్న నేస్తం
ఆగస్టు 16న విద్యాకానుక ప్రారంభం
ఆగష్టు 24న అగ్రిగోల్డ్‌ బాధితులకు పరిహారం చెల్లింపు
రూ. 20వేల లోపు డిపాజిట్‌చేసిన అగ్రిగోల్డ్‌ బాధితులకు చెల్లింపు
ఆగష్టు 27న ఎంఎస్‌ఎంఈలకు, స్పిన్నింగ్‌మిల్స్‌కు ఇన్సెంటివ్‌లు చెల్లింపు ఈమేరకు కలెక్టర్లు సన్నద్ధంగా ఉండాలి

మరిన్ని వార్తలు