CM Jagan: అనకాపల్లిలో సీఎం వైఎస్‌ జగన్‌ పర్యటన

30 Dec, 2022 16:36 IST|Sakshi

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నర్సీపట్నం నియోజకవర్గంలో రూ.986 కోట్లతో అనేక అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా జోగునాథునిపాలెం వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడుతూ.. మీ' ప్రేమానురాగాలకు రెండు చేతులు జోడించి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. దేవుడి దయతో మరో మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఈ రోజు నర్సీపట్నంలో రూ.986 కోట్ల ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశాం. గత పాలకుల వల్ల నర్సీపట్నంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదు.

గతంలో ఈ ప్రాంతాన్ని పాలకులు ఏమాత్రం పట్టించుకోలేదు. మన ప్రభుత్వ హయాంలో నర్సీపట్నం రూపురేఖలు మార్చబోతున్నాం. వెనకబడిన ప్రాంతంలో అభివృద్ధి పనులు చేపట్టాం. విద్యాపరంగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసేందుకు చర్యలు చేపట్టాం. రూ.500 కోట్లతో మెడికల్‌ కాలేజీ రాబోతుంది. కొత్త మెడికల్‌ కాలేజ్‌ కారణంగా 150 మెడికల్‌ సీట్లు వస్తాయి. మెడికల్‌ కాలేజీకి అనుబంధంగా నర్సింగ్‌ కాలేజీ వస్తుంది' అని సీఎం జగన్‌ చెప్పారు.

'ఇచ్చిన ప్రతిమాట నిలబెట్టుకుంటాం. చేసేదే చెబుతాం.. చెప్పిందే చేస్తాం. ప్రతి కార్యకర్త తల ఎత్తుకుని తిరిగేలా పాలన చేస్తున్నాం. రాష్ట్రంలో చెడిపోయిన వ్యవస్థతో యుద్ధం జరుగుతోంది. ఎల్లోమీడియా నిత్యం ప్రభుత్వంపై బురదజల్లడమే పనిగా పెట్టుకుంది. మంచి చేస్తున్నా.. వారికి చెడే కనిపిస్తుంది. అవ్వతాతలకు మంచి చేస్తుంటే దుష్టచతుష్టయం దుష్ప్రచారం చేస్తోంది. నిబంధనల ప్రకారం ప్రతి ఆరు నెలలకు పెన్షన్‌ వెరిఫికేషన్‌ ఉంటుంది. దీనిపై కూడా అసత్య ప్రచారం చేస్తున్నారు' అని సీఎం జగన్‌ మండిపడ్డారు.

12:12 PM
నర్సీపట్నం ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర గణేష్‌ మాట్లాడుతూ.. సీఎం జగన్‌రాకతో సంక్రాంతి పండగ ముందే వచ్చింది. రూ.500 కోట్లతో ప్రభుత్వ మెడికల్‌ కాలేజీ నిర్మాణం కాబోతుంది. రూ.470 కోట్లతో నిర్మించే తాండవ- ఏలేరు ఎత్తిపోతల పథకం కాలువల అనుసంధాన ప్రాజెక్ట్‌ పనులకు సీఎం శంకుస్థాపన చేశారు. రూ.16 కోట్లతో నర్సీపట్నం రహదారి విస్తరణ పనులను ప్రారంభించి.. మనకు సంక్రాంతి పండుగను ముందే తీసుకొచ్చారని ఎమ్మెల్యే ఉమాశంకర గణేష్‌ అన్నారు. 

12:01 PM
మెడికల్‌ కాలేజీ నిర్మాణానికి సీఎం జగన్‌ శంకుస్థాపన
నర్సీపట్నంలో సీఎం వైఎస్‌ జగన్‌ పర్యటిస్తున్నారు. మెడికల్‌ కాలేజీ నిర్మాణానికి సీఎం శంకుస్థాపన చేశారు. రూ. 500 కోట్లతో ప్రభుత్వ మెడికల్‌ కాలేజీ నిర్మించనున్నారు. రూ.470 కోట్లతో నిర్మించే తాండవ-ఏలేరు ఎత్తిపోతల పథకం కాలువల అనుసంధాన ప్రాజెక్ట్‌ పనులకు సీఎం జగన్‌ శంకుస్థాపన చేశారు. రూ.16 కోట్లతో నర్సీపట్నం రహదారి విస్తరణ పనులకు సీఎం జగన్‌ శంకుస్థాపనలు చేశారు. 

11:47AM
►సభాస్థలికి చేరుకున్న సీఎ జగన్‌

11:27AM
►రోడ్డు షోలో భారీ ఎత్తున పాల్గొన్న ప్రజలు
►రోడ్డుకు ఇరువైపులా నిలుచుని సీఎం జగన్‌కి పూలతో స్వాగతం పలుకుతున్న ప్రజలు
►ప్రజలకు చిరునవ్వుతో అభివాదం చేస్తున్న సీఎం జగన్‌

11:17AM
అనకాపల్లి:
►విశాఖ ఎయిర్ పోర్ట్ నుంచి హెలికాప్టర్‌లో బలిఘట్టం చేరుకున్న సీఎం వైఎస్ జగన్‌
►సీఎంకు స్వాగతం పలికిన డిప్యూటీ సీఎం బూడి ముత్యాల నాయుడు.. ఎమ్మెల్యేలు పెట్ల ఉమా శంకర్ గణేష్ ఎమ్మెల్యే ధర్మశ్రీ అవంతి శ్రీనివాస్, కన్నబాబురాజు, అదీప్ రాజ్, భాగ్యలక్ష్మి, పాల్గుణ, సీతం రాజు సుధాకర్, ఎమ్మెల్సీలు వరుదు కల్యాణి, వంశీ.. దాడి వీరభద్రరావు, చింతకాయల జమీల్
►బలిఘట్టం నుంచి జోగినాథపాలెం వరకు ర్యాలీగా బయలుదేరిన సీఎం..
►మరికాసేపట్లో 1000 కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్న సీఎం.. 

10:56AM
►గన్నవరం ఎయిర్‌పోర్ట్‌ నుంచి విశాఖపట్నం చేరుకుని అక్కడి నుంచి సీఎం జగన్‌ నర్సీపట్నం బయల్దేరారు. 

09:23AM
తాడేపల్లి: నర్సీపట్నం బయలుదేరిన సీఎం జగన్
►మరికొద్దిసేపటిలో మెడికల్ కాలేజీ, తాండవ- ఏలేరు లిఫ్టు ఇరిగేషన్ కెనాల్స్ అనుసంధాన ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయనున్న సీఎం
►అనంతరం బహిరంగ సభలో పాల్గొననున్న ముఖ్యమంత్రి జగన్‌

(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

మరిన్ని వార్తలు