అశోక్‌బాబు తల్లి భౌతికకాయానికి సీఎం జగన్‌ నివాళులు

27 Mar, 2023 13:57 IST|Sakshi

సాక్షి, అమరావతి: సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి.. కొండెపి నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ ఇన్‌చార్జి వరికూటి అశోక్‌బాబు తల్లి కోటమ్మ భౌతిక కాయానికి నివాళులు అర్పించారు. సోమవారం ప్రకాశం జిల్లా కారుమంచికి వెళ్లిన సీఎం జగన్‌.. అశోక్‌బాబు తల్లి భౌతిక కాయానికి నివాళులు అర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించారు. 

కాగా, సీఎం వైఎస్‌ జగన్‌ సోమవారం ఉదయం తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం కారుమంచి గ్రామానికి చేరుకున్నారు. 

28న విశాఖ పర్యటన 
28వ తేదీ మంగళవారం సాయంత్రం 4 గంటలకు తాడేపల్లిలోని నివాసం నుంచి సీఎం వైఎస్‌ జగన్‌ బయలుదేరి 5.15 గంటలకు విశాఖ చేరుకుంటారు. సాయంత్రం 6 గంటలకు రిషికొండ రాడిసన్‌ బ్లూ రిసార్ట్స్‌కు చేరుకుని రాత్రి 7–8 గంటల మధ్య జీ–20 ప్రతినిధులతో జరిగే ఇంటరాక్షన్‌ కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం అతిథులకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ‘గాలా డిన్నర్‌’లో పాల్గొని రాత్రి 8.45 గంటలకు విశాఖ నుంచి బయలుదేరి 10 గంటలకు తాడేపల్లిలోని నివాసానికి చేరుకుంటారు.   

మరిన్ని వార్తలు :

ASBL
మరిన్ని వార్తలు