పసికందును లాలించిన సీఎం వైఎస్‌ జగన్‌

5 May, 2022 16:44 IST|Sakshi

సాక్షి, తిరుపతి: శ్రీ పద్మావతి చిల్డ్రన్‌ మల్టీ సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రికి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గురువారం భూమి పూజ చేశారు. అనంతరం శ్రీ పద్మావతి కార్డియాక్‌ ఆస్పత్రిలో చికిత్స పొందిన చిన్నారులు, వారి తల్లిదండ్రులతో ముఖ్యమంత్రి ముచ్చటించారు. ఓ పసికందును చేతిల్లోకి తీసుకుని ఆప్యాయంగా లాలించారు. 
చదవండి: చంద్రబాబు, ఎల్లోమీడియాపై సీఎం జగన్‌ అదిరిపోయే సెటైర్లు.. 

అనంతరం టాటా ట్రస్ట్‌ సహకారంతో శ్రీవెంకటేశ్వర ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ క్యాన్సర్‌ కేర్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ను సీఎం ప్రారంభించారు. టాటా ట్రస్ట్‌ ఆధ్వర్యంలో రూ.190 కోట్లతో 92 పడకల క్యాన్సర్ ఆసుపత్రి నిర్మాణం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం, టీటీడీ సంపూర్ణ సహకారం అందించింది. ఆస్పత్రి నిర్మాణానికి టీటీడీ అలిపిరి వద్ద 25 ఎకరాలు ఇచ్చింది. ఆస్పత్రి ప్రారంభంతో రాష్ట్రంలో క్యాన్సర్‌ రోగులకు తక్కువ ఖర్చుతో అత్యాధునిక వైద్యం అందుబాటులోకి వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వ సూచనలతో టాటా ట్రస్టు సౌజన్యంతో అలమేలు చారిటబుల్‌ ఫౌండేషన్‌ ద్వారా శ్రీవేంకటేశ్వర ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ క్యాన్సర్‌ కేర్‌ అండ్‌ అడ్వాన్స్‌డ్‌ రీసెర్చ్‌ ఆసుపత్రిని శరవేగంగా నిర్మించారు.

మరిన్ని వార్తలు