ముగిసిన ఒంటిమిట్ట సీతారాముల కల్యాణమహోత్సవం

16 Apr, 2022 00:30 IST|Sakshi

అప్‌డేట్స్‌

ముగిసిన ఒంటిమిట్ట సీతారాముల కల్యాణమహోత్సవం

► వెన్నెల వెలుగుల్లో.. కన్నుల పండువగా శ్రీ సీతారాముల కల్యాణం.. భక్తుల పారవశ్యం

► కన్నుల పండువగా కోదండ రాముని కల్యాణ మహోత్సవం

8.10PM


►  కోదండ రాముని కల్యాణోత్సవానికి హాజరైన సీఎం జగన్‌

► ఒంటిమిట్ట కోదండరాముడిని దర్శించుకున్న సీఎం జగన్‌.

7.44PM
► స్వామివారికి పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించిన సీఎం జగన్‌

7.42PM
► సంప్రదాయ రీతిలో రామయ్య దర్శనానికి వెళ్లిన సీఎం జగన్‌.

7.37PM
 ఒంటిమిట్ట కోదండ రామాలయానికి చేరుకున్న సీఎం వైఎస్‌ జగన్‌. ఆహ్వానం పలికిన మంత్రి ఆర్కే రోజా, అధికారులు.

6.46PM
► ఒంటిమిట్ట టీటీడీ గెస్ట్ హౌస్‌కు చేరుకున్న సీఎం జగన్‌. మరికొద్దిసేపట్లో ఒంటిమిట్ట ఆలయానికి.

► కోదండ రామాలయంలో సీతారామ కల్యాణోత్సవం కోసం తొలుత ఒంటిమిట్ట కోదండరామాలయానికి వెళ్లి స్వామి వారిని దర్శించుకుని.. అక్కడ నుంచి నేరుగా స్వామి వారి కల్యాణ వేదికకు చేరుకోనున్న సీఎం జగన్‌.

5.50PM

► కడప చేరుకున్న సీఎం వైఎస్ జగన్. కడప ఎయిర్‌పోర్ట్‌ నుంచి నేరుగా ఒంటిమిట్ట చేరుకోనున్నారు. 

► ఒంటిమిట్ట కోదండ రామాలయంలో సీతారామ కల్యాణోత్సవం కోసం సీఎం వైఎస్‌ జగన్‌ బయలుదేరారు.

► కరోనా ఆంక్షల కారణంగా రెండేళ్లుగా కల్యాణం ఏకాంతంగా నిర్వహిస్తూ వచ్చారు. ఈసారి లక్షలాది భక్తుల సమక్షంలో జగదభిరాముడి జగత్కల్యాణాన్ని వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు.

► ఈ కల్యాణమహోత్సవానికి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి హాజరై.. ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు, తలంబ్రాలు సమర్పించనున్నారు.

► కల్యాణం రాత్రి 8  గంటల నుంచి 10 గంటలవరకు జరుగుతుంది. ఈ కార్యక్రమం..  శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్‌ నుంచి ప్రత్యక్ష ప్రసారం కానుంది.

► ఆంధ్ర భద్రాద్రిగా విరాజిల్లుతున్న వైయ‌స్ఆర్ జిల్లా ఒంటిమిట్ట కోదండ రామాలయం వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం టీటీడీ ఆధ్వర్యంలో ప్రభుత్వ లాంఛనాలతో అంగరంగ వైభవంగా సీతారాముల కల్యాణం నిర్వహించనున్నారు.

(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

మరిన్ని వార్తలు