నేడు కర్నూలుకు సీఎం వైఎస్‌ జగన్‌

20 Nov, 2020 09:18 IST|Sakshi

సాక్షి, కర్నూలు: తుంగభద్ర పుష్కరాలను ప్రారంభించేందుకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శుక్రవారం కర్నూలు రానున్నారు. సంకల్‌భాగ్‌ ఘాట్‌లో పుష్కర పూజలు నిర్వహించనున్నారు.  నేపథ్యంలో సంకల్‌భాగ్‌ ఘాట్‌లో ఏర్పాట్లను గురువారం మధ్యాహ్నం మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, గుమ్మనూరు జయరాం, కలెక్టర్‌ వీరపాండియన్, ఎస్పీ ఫక్కీరప్ప, ఎమ్మెల్యేలు హఫీజ్‌ఖాన్, కాటసాని రాంభూపాల్‌రెడ్డి, సుధాకర్, తొగురు ఆర్థర్‌ పరిశీలించారు. ఈ ఘాట్‌లోకి జిల్లాకు చెందిన మంత్రులు, ప్రజాప్రతినిధులను తప్ప, ఇతరులెవరినీ అనుమతించకూడదని నిర్ణయించారు. సీఎం వెళ్లిన తరువాతే ఇతరులను ఘాట్‌లోకి అనుమతిస్తారు. ఓర్వకల్లు ఎయిర్‌పోర్టు, ఏపీఎస్పీ బెటాలియన్‌లో ముఖ్యమంత్రిని కలిసేందుకు కొద్దిమందికి అవకాశం కల్పించనున్నారు.  (నేటి నుంచి తుంగభద్ర పుష్కరాలు)

సీఎం పర్యటన కొనసాగుతుందిలా.. 
శుక్రవారం ఉదయం 11 గంటలు: తాడేపల్లిలోని ఇంటి నుంచి గన్నవరం ఎయిర్‌పోర్టుకు బయలు దేరుతారు 
11.20: గన్నవరం ఎయిర్‌ పోర్టు చేరుకుంటారు 
11.30: గన్నవరం ఎయిర్‌పోర్టు నుంచి ఓర్వకల్లుకు విమానంలో బయలు దేరుతారు 
12.30: ఓర్వకల్లు ఎయిర్‌ పోర్టు చేరుకుంటారు 
12.40: ఓర్వకల్లు ఎయిర్‌ పోర్టు నుంచి హెలికాప్టర్‌లో  కర్నూలులోని ఏపీఎస్పీ బెటాలియన్‌లో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్‌కు బయలు దేరుతారు 
12.55: ఏపీఎస్పీ బెటాలియన్‌ చేరుకుంటారు 
1 గంట: ఎస్పీఎస్పీ బెటాలియన్‌ నుంచి రోడ్డు మార్గన సంకల్‌భాగ్‌ పుష్కర్‌ ఘాట్‌కు బయలు దేరుతారు 
1.10: సంకల్‌భాగ్‌ పుష్కర ఘాట్‌ చేరుకుంటారు 
01.10 నుంచి 01.50 గంటలు: పుష్కర ఘాట్‌లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు 
01.50: సంకల్‌భాగ్‌ నుంచి ఏపీఎస్పీ బెటాలియన్‌కు బయలు దేరుతారు 
2 గంటలు: ఏపీఎస్పీ బెటాలియన్‌ చేరుకుంటారు 
02.05: బెటాలియన్‌ నుంచి హెలికాప్టర్‌లో ఓర్వకల్లు ఎయిర్‌పోర్టుకు బయలు దేరుతారు 
2.20: ఓర్వకల్లు ఎయిర్‌పోర్టు చేరుకుంటారు 
2.30: ఓర్వకల్లు నుంచి విమానంలో గన్నవరం ఎయిర్‌పోర్టుకు బయలుదేరి వెళ్తారు  

మరిన్ని వార్తలు