సీఎం జగన్‌ మిలాద్‌-ఉన్‌-నబీ శుభాకాంక్షలు

18 Oct, 2021 18:45 IST|Sakshi

సాక్షి, అమరావతి: మహమ్మద్ ప్రవక్త పుట్టినరోజైన మిలాద్-ఉన్-నబీ సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ముస్లిం సోదర సోదరీమణులకు శుభాకాంక్షలు తెలియజేశారు. మహమ్మద్ ప్రవక్త బోధనలైన దాతృత్వం, కరుణ, ధార్మిక చింతన, సర్వ మానవ సమానత్వం, ఐకమత్యం మానవాళికి సదా అనుసరణీయమని పేర్కొన్నారు. భక్తి, శ్రద్ధలతో ఈ పండుగ జరుపుకోవాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు.
చదవండి: సీఎం వైఎస్‌ జగన్‌ సంచలన నిర్ణయం 

మరిన్ని వార్తలు