International Nurses Day 2022: ప్రాణాలను సైతం లెక్కచేయని సేవామూర్తులకు శుభాకాంక్షలు: సీఎం జగన్‌

12 May, 2022 14:56 IST|Sakshi

సాక్షి, తాడేపల్లి:  ఇవాళ(మే 12న) అంతర్జాతీయ నర్సుల దినోత్సవం. ఈ సందర్భంగా ఆంధ్ర ప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ట్విటర్‌ ద్వారా శుభాకాంక్షలు తెలియజేశారు.

అత్య‌వ‌స‌ర స‌మ‌యాల్లో ప్రాణాల‌ను సైతం లెక్క‌చేయ‌కుండా సేవ‌లు అందించే సేవామూర్తులు న‌ర్సులు అని, ‘ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు మిన్న’ అన్న‌ట్లుగా ఎంతోమందికి జీవం పోసే ప్రాణ‌దాత‌లు వార’ని సీఎం జగన్‌ కొనియాడారు. అంతర్జాతీయ నర్సుల దినోత్సవం సందర్భంగా.. న‌ర్సులంద‌రికీ శుభాకాంక్షలు తెలియజేశారు ఆయన.

చదవండి: కోనసీమలో సీఎం వైఎస్‌ జగన్‌ పర్యటన

మరిన్ని వార్తలు