కేంద్ర మంత్రి స్మృతి ఇరానీకి సీఎం జగన్‌ లేఖ

2 Jul, 2021 14:57 IST|Sakshi

సాక్షి, అమరావతి: కేంద్రమంత్రి స్మృతి ఇరానీకి ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శుక్రవారం లేఖ రాశారు. దిశ చట్టం ఆమోదించాలంటూ సీఎం జగన్‌ లేఖ ద్వారా స్మృతి ఇరానీని కోరారు. దిశ బిల్లు వేగవంతం అయ్యేలా చర్యలు తీసుకోవాలని లేఖలో తెలిపారు. కాగా ‘దిశ’ ప్రాజెక్ట్‌పై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శుక్రవారం తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో సమీక్ష చేపట్టారు. సమీక్షలో భాగంగా దిశ చట్టానికి సంబంధించి కేంద్ర మంత్రికి జగన్‌ లేఖ రాశారు. కాగా ఈ సమావేశానికి హోంమంత్రి సుచరిత, డీజీపీ గౌతమ్‌ సవాంగ్, ఉన్నతాధికారులు హాజరయ్యారు. 

మరిన్ని వార్తలు