బద్వేలు చేరుకున్న సీఎం వైఎస్‌ జగన్‌

9 Jul, 2021 11:59 IST|Sakshi

సాక్షి, వైఎస్సార్‌ జిల్లా: జిల్లాలో రెండు రోజు పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఇడుపులపాయ నుంచి బద్వేలు చేరుకున్నారు. బద్వేలులో రూ.500 కోట్లతో అభివృద్ధి పనులకు సీఎం శంకుస్థాపన చేయనున్నారు. బద్వేలుతో పాటు కడప నియోజకవర్గంలోను సీఎం పర్యటించనున్నారు. రెండు నియోజకవర్గాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు. రెండుచోట్లా బహిరంగ సభల్లో పాల్గొంటారు.

మరిన్ని వార్తలు