వైఎస్సార్‌ జిల్లాలో రేపు సీఎం జగన్‌ పర్యటన

14 Feb, 2023 16:57 IST|Sakshi

సాక్షి, వైఎస్సార్‌: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి జిల్లాలో పర్యటించనున్నారు. బుధవారం జమ్ములమడుగు, పులివెందులలో కార్యక్రమాల కోసం ఆయన వెళ్లనున్నారు.  సున్నపురాళ్ళపల్లెలో జేఎస్‌డబ్యు స్టీల్‌ప్లాంటుకు భూమిపూజ, ఆపై పులివెందులలో ఓ వివాహ రిసెప్షన్‌ వేడుకకు హాజరు అవుతారు.

సీఎం పర్యటన షెడ్యూల్‌ ప్రకారం..  ఉదయం 9 గంటల ప్రాంతంలో తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి పదకొండు గంటల ప్రాంతంలో జమ్ములమడుగు మండలం సున్నపురాళ్ళపల్లె చేరుకుంటారు. ఆపై జేఎస్‌డబ్యు స్టీల్‌ప్లాంటుకు సంబంధించి భూమిపూజ, శిలాఫలకాలు ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొంటారు. అక్కడే స్టీల్‌ ప్లాంటు మౌలిక సదుపాయాలపై సమావేశం నిర్వహిస్తారు.  

అనంతరం మధ్యాహ్నాం ఒంటిగంట ప్రాంతంలో పులివెందుల చేరుకుంటారు. అక్కడి ఎస్‌సీఎస్‌ఆర్‌ ఫంక్షన్‌ హాల్‌లో మూలి బలరామిరెడ్డి కుమారుని వివాహ రిసెప్షన్‌ వేడుకలో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదిస్తారు. ఈ కార్యక్రమం తర్వాత సాయంత్రం తిరిగి తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు.
 

మరిన్ని వార్తలు :

ASBL
మరిన్ని వార్తలు