మీరంతా ప్రపంచంతో పోటీ పడేలా ఉండాలి: సీఎం జగన్‌

24 Dec, 2022 17:30 IST|Sakshi

అహోబిలపురం స్కూల్‌ను ప్రారంభించిన తర్వాత సీఎం జగన్‌ మాట్లాడుతూ..


నాడు-నేడుతో స్కూల్స్‌ రూపురేఖలు మార్చాం
రాబోయే రోజుల్లో మన పిల్లల తలరాతలు మారతాయి


విద్యకు సంబంధించి ఎన్నో మంచి కార్యక్రమాలు చేస్తున్నాం
విద్యార్థులు భవిష్యత్తు బావుండాలనే తపనతోనే విద్యకు పెద్ద పీట వేస్తున్నాం
మనం కాంపిటేషన్‌తో ఉండేది పులివెందులతోనో, ఆంధ్ర రాష్ట్రంతోనో కాదు.. 
మీరంతా ప్రపంచంతో  పోటీ పడేందుకే ఈ తరహా మంచి కార్యక్రమాలు చేపట్టాం
అందుకే అంతా చక్కగా చదువుకోవాలి.
విద్యార్థుల తల్లులకు ఒక అన్నగా, విద్యార్థులకు మేనమామగా అండగా ఉంటా

03:53PM
అహోబిలపురం స్కూల్‌ను ప్రారంభించిన సీఎం జగన్‌

03:16PM

పులివెందులలో  బస్టాండ్‌ను ప్రారంభించిన తర్వాత ప్రజలనుద్దేశించి మాట్లాడిన సీఎం జగన్‌

మనం చెడిపోయిన వ్యవస్థతో యుద్ధం చేస్తున్నాం
జరుగుతున్న అభివృద్ధి వారికి కనిపించడం లేదు
గతంతో పోలిస్తే అప్పుల్లో పెరుగుదల ఇప్పుడే తక్కువ
గతంలో అదే బడ్జెట్‌.. ఇప్పుడూ అదే బడ్జెట్‌
గత ప్రభుత్వం ఇన్ని పథకాలు ఎందుకు ఇవ్వలేకపోయింది
గ్లాసులో 75 శాతం నీళ్లున్నా.. నీళ్లే లేవని బాబు ప్రచారం చేస్తున్నారు
అవినీతికి తావు లేకుండా సంక్షేమ పథకాలు అందిస్తున్నాం
విద్యార్థులు, పేదలు, రైతుల తలరాతలు మారుతున్నాయి
మనకు ఓటు వేయని వారికి కూడా సంక్షేమ పథకాలు ఇస్తున్నాం

కేవలం సీఎం మారడంతోనే పేదల తలరాతలు మారుతున్నాయి
రూ. 1.71లక్షల కోట్లు నేరుగా లబ్ధిదారుల ఖాతాలో జమ చేశాం
గత ఎన్నికల్లో 151 సీట్లు.. ఈసారి వైనాట్‌ 175కి 175 సీట్లు
లంచాలకు తావులేకుండా సంక్షేమ పథకాలు అందిస్తున్నాం
నేరుగా లబ్దిదారుల ఖాతాల్లోనే నగదు జమ చేస్తున్నాం
గతంలో అదే బడ్జెట్‌.. ఇప్పుడూ అదే బడ్జెట్‌
గత ప్రభుత్వం ఇన్ని పథకాలు ఎందుకు ఇవ్వలేకపోయింది

పులి వెందులను ఆదర్శవంత నియోజకవర్గంగీ తీర్చిదిద్దుతున్నాం
అత్యాధునిక వసతులతో వైఎస్సార్‌  బస్‌ టెర్మినల్‌ను ప్రారంభించాం
రాష్ట్రంలోని బస్‌ టెర్మినల్‌కు పులివెందుల బస్‌ టెర్మినల్‌ ఆదర్శం

03.14PM
పులివెందులలో సీఎం జగన్‌
కదిరి రోడ్డు జంక్షన్‌, విస్తరణను ప్రారంభించిన సీఎం జగన్‌
పులివెందులలో కూరగాయల మార్కెట్‌ను ప్రారంభించిన సీఎం జగన్‌
పులివెందుల బస్టాండ్‌ను ప్రారంభించిన సీఎం జగన్‌

02:11PM
వైఎస్సార్‌ కడప జిల్లా కూరగాయల మార్కెట్ అనుకుని నూతనంగా నాలుగుకోట్ల 30 లక్షలతో  నిర్మించిన డాక్టర్ వైఎస్సార్‌ మెమోరియల్ పార్క్‌ను ప్రారంభించిన సీఎం జగన్

01: 58 PM
పులివెందుల మున్సిపాలిటీ పరిధిలో కోటి ఇరవై లక్షలతో నూతనంగా నిర్మించిన డాక్టర్ వైఎస్సార్‌ కూరగాయల మార్కెట్‌ను ప్రారంభించిన సీఎం జగన్

01: 15 PM
వైఎస్సార్ జిల్లా
పులివెందులకు చేరుకున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి 
విజయ హోమ్ వద్ద జంక్షన్‌ను, దివంగత నేత రాజశేఖర్ రెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరించిన వైఎస్ జగన్‌

10: 25 AM
వైఎస్సార్‌ జిల్లాలో రెండో రోజు సీఎం జగన్‌ పర్యటన


ఇడుపులపాయలో వైఎస్సార్‌ ఘాట్‌ వద్ద నివాళులర్పించిన సీఎం జగన్‌


పులివెందులలో పలు అభివృద్ధి పనులకు సీఎం ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు
పులివెందులలో ఆర్టీసీ బస్టాండ్‌ను ప్రారంభించనున్న సీఎం జగన్‌

సాక్షి, పులివెందుల: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శనివారం పులివెందులకు రానున్నారు. పులివెందులలో పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు చేయనున్నారు.సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శనివారం మధ్యాహ్నం 12.30గంటలకు ఇడుపులపాయ నుంచి భాకరాపురం హెలీప్యాడ్‌కు చేరుకుంటారు. 1.10గంటల నుంచి 1.20 వరకు విజయ హోమ్స్‌ వద్ద ఉన్న జంక్షన్‌ను ప్రారంభిస్తారు. 1.30 నుంచి 1.45గంటల వరకు కదిరి రోడ్డు జంక్షన్, విస్తరణ రోడ్డును, 1.50 నుంచి 2గంటల వరకు నూతన కూరగాయల మార్కెట్‌ను, 2.05 నుంచి 2.20 గంటల వరకు మైత్రి లేఅవుట్‌లో వైఎస్సార్‌ మెమోరియల్‌ పార్కును ప్రారంభిస్తారు.

2.35 నుంచి 2.50 గంటల వరకు రాయలాపురం నూతన బ్రిడ్జిని ప్రారంభిస్తారు. 3గంటల నుండి 3.30గంటల వరకు డాక్టర్‌ వైఎస్సార్‌ బస్‌ టర్మినల్‌ను ప్రారంభించి బస్టాండు ఆవరణంలో ప్రజలనుద్ధేశించి ప్రసంగిస్తారు. 3.35గంటల నుంచి 3.55గంటల వరకు నాడు – నేడు ద్వారా అభివృద్ధి చేసిన అహోబిలాపురం స్కూలును ప్రారంభిస్తారు. 4.05గంటల నుంచి 4.20గంటల వరకు మురుగునీటిశుద్ధి కేంద్రాన్ని, 4.30గంటల నుంచి 4.45గంటల వరకు గార్బేజీ ట్రాన్స్‌ఫర్‌ స్టేషన్‌ను ప్రారంభిస్తారు. అనంతరం 5.00గంటలకు భాకరాపురం హెలీఫ్యాడ్‌కు చేరుకుని అక్కడ నుంచి ఇడుపులపాయకు బయలుదేరి వెళతారు.  

సీఎస్‌ఐ చర్చిలో ప్రార్థనలు
ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదివారం క్రిస్మస్‌ పండుగ సందర్భంగా పులివెందుల సీఎస్‌ఐ చర్చిలో కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించనున్నారు. అనంతరం అక్కడే క్రిస్మస్‌ కేక్‌ను కట్‌ చేయనున్నారు.  

సీఎం పర్యటనా ప్రాంతాల పరిశీలన 
ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శని, ఆదివారాలు పులివెందుల పర్యటన దృష్ట్యా అందుకు సంబంధించిన ఏర్పాట్లను కడప ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి మున్సిపల్‌ ఇన్‌చార్జి వైఎస్‌ మనోహర్‌రెడ్డి, పాడా ఓఎస్డీ అనిల్‌కుమార్‌రెడ్డిలతో కలిసి శుక్రవారం ఉదయం పరిశీలించారు.

నూతనంగా నిర్మించిన ఆర్టీసీ బస్టాండులో సీఎం బహిరంగ సభ ఉన్న నేపథ్యంలో అందుకు సంబంధించిన ఏర్పాట్లను పరిశీలించి అధికారులకు తగిన సూచనలు, సలహాలు ఇచ్చారు. అలాగే ముఖ్యమంత్రి చేతులమీదుగా ప్రారంభించే అభివృద్ధి పనులను కూడా ఆయన పరిశీలించారు. సీఎం పర్యటనకు సంబంధించి ఏర్పాట్లు పూర్తయ్యాయి.  

ఇడుపులపాయకు చేరుకున్న ముఖ్యమంత్రి 
వేంపల్లె: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఈనెల 23 నుంచి 25వ వరకు మూడు రోజులపాటు జిల్లా పర్యటనలో భాగంగా ఇడుపులపాయకు చేరుకున్నారు. శుక్రవారం  కడప, కమలాపురం ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన వివిధ అభివృద్ధి కార్యక్రమాలను ముగించుకుని హెలీకాప్టర్‌ ద్వారా ఇడుపులపాయకు వచ్చారు. సాయంత్రం 5.51 గంటలకు ఇడుపులపాయలోని వ్యవసాయ క్షేత్రంలో ఉన్న హెలీపాడ్‌ వద్దకు చేరుకున్నారు.

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి  ఎమ్మెల్సీ గంగుల ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు సుధీర్‌రెడ్డి, గడికోట శ్రీకాంత్‌రెడ్డి, పాడా ఓఎస్డీ అనిల్‌కుమార్‌రెడ్డి, డీసీఓ సుభాషిణి, స్పెషల్‌ కలెక్టర్‌ రోహిణి, జమ్మలమడుగు ఆర్డీఓ శ్రీనివాసులు తదితరులు ఘన స్వాగతం పలికారు. అనంతరం ముఖ్యమంత్రి వాహనం ద్వారా రోడ్డు మార్గాన బయలుదేరి వైఎస్సార్‌ గెస్ట్‌హౌస్‌కు చేరుకుని రాత్రికి అక్కడే బస చేశారు.     

మరిన్ని వార్తలు