సీఎం జగన్ రెండు రోజుల కడప జిల్లా పర్యటన

31 Aug, 2021 16:49 IST|Sakshi

సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రేపు (బుధవారం), ఎల్లుండి(గురువారం) వైఎస్సార్‌ కడప జిల్లాలో పర్యటించనున్నారు. పర్యటనలో భాగంగా రేపు  మధ్యాహ్నం 3.30 గంటలకు గన్నవరం ఎయిర్‌పోర్ట్‌ నుంచి కడప బయలుదేరనున్నారు. సాయంత్రం 4.50 గంటలకు ఇడుపులపాయ చేరుకుని పార్టీ నాయకులతో మాట్లాడి, వైఎస్సార్‌ ఎస్టేట్‌లోని గెస్ట్‌హౌస్‌లో రాత్రికి బస చేస్తారు.

గురువారం దివంగత నేత డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి వర్ధంతి సందర్భంగా ఉదయం 9.30 గంటలకు ఇడుపులపాయలోని వైఎస్సార్‌ ఘాట్‌ వద్ద జరిగే ప్రత్యేక ప్రార్ధనల్లో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ పాల్గొని నివాళులు అర్పించనున్నారు. ఆ తర్వాత పార్టీ నాయకులతో సీఎం జగన్‌ భేటీ అవుతారు. అదే రోజు ఉదయం 11.30 గంటలకు కడప ఎయిర్‌పోర్ట్‌ నుంచి బయలుదేరి 12.45 గంటలకు తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు.

చదవండి: మూడు రాజధానులకు ప్రభుత్వం కట్టుబడి ఉంది : మేకపాటి గౌతమ్ రెడ్డి

మరిన్ని వార్తలు