తిరుమల: 7 అడుగుల నాగుపాము.. బుసలు కొడుతూ

6 Jul, 2021 12:18 IST|Sakshi

సాక్షి, తిరుపతి: తిరుమలలో పాము హల్‌చల్ చేసింది. భయంతో భక్తులు పరుగులు తీశారు. వివరాలు.. గరుడాద్రి అతిథి గృహాల సమీపంలో 546 గది వద్దకు పాము వచ్చింది. అక్కడున్న వాళ్లు విషయం గమనించిన వెంటనే అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. ఈ క్రమంలో... పాములు పట్టే భాస్కర్ సంఘటన స్థలానికి చేరుకున్నారు. దాదాపు ఏడు అడుగుల పొడవైన నాగుపాము బుసలు కొడుతున్నప్పటికీ ఎంతో చాకచక్యంగా భాస్కర్‌ దానిని పట్టుకున్నాడు. అనంతరం సురక్షిత ప్రాంతంలో పామును వదిలేశారు.
 

మరిన్ని వార్తలు