ప్రైవేట్ ఆసుపత్రులు: రెండోసారి తప్పు చేస్తే క్రిమిన్‌ కేసులు

29 May, 2021 12:11 IST|Sakshi

ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో కలెక్టర్‌ ఇంతియాజ్‌ తనిఖీలు

సాక్షి, విజయవాడ: కృష్ణా జిల్లాలో కలెక్టర్ ఇంతియాజ్ ఆధ్వర్యంలో ప్రైవేట్ ఆసుపత్రుల్లో టాస్క్‌ఫోర్స్‌ విస్తృత తనిఖీలు చేపట్టింది. నిబంధనలు పాటించని 35 ఆస్పత్రులకు రూ.2.86 కోట్ల జరిమానా విధించారు. కృష్ణా జిల్లాలో ఇప్పటివరకు 55 ఆస్పత్రులకు రూ.3.61 కోట్ల జరిమానా విధించారు. రెండోసారి కూడా తప్పు చేస్తే క్రిమిన్‌ కేసులు నమోదు చేస్తామని కలెక్టర్‌ ఇంతియాజ్‌ హెచ్చరించారు.

ఏ ఆసుపత్రిలోనైనా 50 శాతం బెడ్లు ప్రభుత్వం నిర్ధేశించిన కేటగిరీలో భర్తీ చేయాలని కలెక్టర్‌ తెలిపారు. ఈ ప్రక్రియ కోసం 104 కాల్‌ సెంటర్‌కు ఫోన్‌ చేసి సమాచారాన్ని అందివ్వాలన్నారు. నోడల్‌ అధికారులు, ఆసుపత్రి పర్యవేక్షుకులదే పూర్తి బాధ్యత అని కలెక్టర్‌ అన్నారు.

చదవండి: జొన్నగిరిలో మరో రెండు వజ్రాలు లభ్యం 
ఖాకీ దందా: చిన్నసారు.. పంచాయితీ! 

మరిన్ని వార్తలు