ఘనంగా కలెక్టర్‌ నాగలక్ష్మి సెల్వరాజన్‌ వివాహం 

17 Feb, 2023 08:48 IST|Sakshi
వధూవరులు నవీన్‌కుమార్, నాగలక్ష్మి 

సాక్షి ప్రతినిధి, అనంతపురం: కలెక్టర్‌ నాగలక్ష్మి సెల్వరాజన్‌ వివాహం గురువారం తిరుపతిలోని ఎస్‌జేఆర్‌ ఫంక్షన్‌ హాల్‌లో ఘనంగా జరిగింది. బుధవారం రాత్రి రిసెప్షన్‌ వైభవంగా నిర్వహించారు. 2012 ఐఏఎస్‌ బ్యాచ్‌కు చెందిన నాగలక్ష్మి 2019 ఐఏఎస్‌ బ్యాచ్‌కు చెందిన నవీన్‌కుమార్‌ను మనువాడారు. ప్రస్తుతం నవీన్‌కుమార్‌ శ్రీకాకుళం జాయింట్‌ కలెక్టర్‌గా పనిచేస్తున్నారు.

గతంలో ఆయన పెనుకొండ సబ్‌కలెక్టర్‌గా పనిచేశారు. కల్యాణోత్సవంలో జిల్లాకు చెందిన పలువురు రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు. ఎస్పీ డాక్టర్‌ ఫక్కీరప్ప, శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్‌ బసంత్‌కుమార్‌ వధూవరులకు శుభాకాంక్షలు తెలిపారు. ఆర్డీఓలు మధుసూదన్, నిశాంత్‌రెడ్డి, పలువురు తహసీల్దార్‌లు వేడుకలో పాల్గొన్నారు.
చదవండి: ఏపీ విద్యార్థులకు లక్కీ చాన్స్‌.. పెద్ద ఉద్యోగం పక్కా

మరిన్ని వార్తలు