ప్రశ్నపత్రం లీకేజీ అంటూ తప్పుడు ప్రచారం

29 Apr, 2022 04:58 IST|Sakshi
మాట్లాడుతున్న ఏపీసీ డాక్టర్‌ జయప్రకాష్, పక్కనే ఆర్జేడీ, డీఈవో, తహసీల్దార్‌

శ్రీకాకుళం జిల్లా సరుబుజ్జిలి మండలంలో ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతి అతి

కఠిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ ఆదేశం

శ్రీకాకుళం న్యూకాలనీ/సరుబుజ్జిలి: శ్రీకాకుళం జిల్లా సరుబుజ్జిలి మండలం రొట్టవలస, షళంత్రితోపాటు కొత్తకోట కేంద్రాల్లో పదో తరగతి హిందీ క్వశ్చన్‌ పేపర్‌ లీకైందంటూ తప్పుడు ప్రచారం చేయడం విద్యార్థుల్లో కలకలం సృష్టించింది. ఇలా లేనిపోని వార్తలు సృష్టించేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్‌ శ్రీకేష్‌ బి.లాఠకర్‌ హెచ్చరించారు. దీనిపై ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతి చానెల్‌ రిపోర్టర్‌ను విచారించారు. ఆయన తనకేమీ తెలియదని చెప్పారు. మరి చానెల్‌లో స్క్రోలింగ్‌ ఎలా వచ్చిందని అధికారులు ప్రశ్నించారు.

రిపోర్టర్‌ సరైన సమాధానం చెప్పకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేసిన కలెక్టర్‌.. ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతి యాజమాన్యం, రిపోర్టర్, తదితరులపై కేసు నమోదు చేయాలని పోలీసులను ఆదేశించారు. అలాగే పరీక్ష కేంద్రం చీఫ్‌ సూపరింటెండెంట్, డిపార్ట్‌మెంట్‌ అధికారులకు షోకాజ్‌ నోటీసులు జారీ చేశారు. మరోవైపు దుష్ప్రచారంపై చర్యలు తీసుకోవాలని కోరుతూ జిల్లా విద్యాశాఖాధికారి గార పగడాలమ్మ ఎస్పీ జీఆర్‌ రాధికకు ఫిర్యాదు ఇచ్చారు. అంతకుముందు పరీక్ష కేంద్రాన్ని ఆర్జేడీ ఎం.జ్యోతికుమారి, సమగ్రశిక్ష ఏపీసీ డాక్టర్‌ ఆర్‌.జయప్రకాష్, రెవెన్యూ అధికారులు సందర్శించారు. పోలీసుల సహకారంతో క్షుణ్నంగా పరిశీలించాక ఎలాంటి లీకేజీ జరగలేదని నిర్ధారణకు వచ్చారు.  

మరిన్ని వార్తలు