ఫింగర్‌ ప్రింట్స్‌ సమస్య.. తక్షణమే స్పందించిన గుంటూరు కలెక్టర్‌

1 Sep, 2021 13:19 IST|Sakshi

దివ్యాంగుడికి పింఛన్‌తో పాటు ట్రైసైకిల్‌ అందించిన కలెక్టర్‌ వివేక్‌ యాదవ్‌

గుంటూరు: దివ్యాంగుడి సమస్యపై గుంటూరు జిల్లా కలెక్టర్‌ వెంటనే స్పందించారు. ఫింగర్‌ ప్రింట్స్‌ అరిగిపోవడంతో పింఛన్‌ రాలేదని కేవీపీ కాలనీకి చెందిన దివ్యాంగుడు షేక్‌ బాజీ ‘ముఖ్యమంత్రి స్పందన సెల్‌’కు ఫిర్యాదు చేయడంతో కలెక్టర్‌ వివేక్‌ యాదవ్ తక్షణమే స్పందించి.. దివ్యాంగుడికి పింఛన్‌తో పాటు ట్రైసైకిల్‌ అందించారు.

కలెక్టర్‌ వివేక్‌ యాదవ్‌ మీడియాతో మాట్లాడుతూ, గుంటూరు జిల్లాలో 5లక్షల 73 వేల మందికి పెన్షన్లు అందిస్తున్నామని పేర్కొన్నారు. జిల్లాలో రూ.133 కోట్లు ప్రతి నెల ఇస్తున్నామని తెలిపారు. వాలంటరీ వ్యవస్థ ద్వారా 99 శాతం పెన్షన్లు ఒకే రోజు అందిస్తున్నామన్నారు. ఈకేవైసీ అప్‌డేట్  కాలేనివారిని గుర్తించి వారికి పెన్షన్‌ వచ్చేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఇంకా ఎవరికైనా పింఛన్‌ రాకపోతే తమ దృష్టికి తీసుకురావాలని కలెక్టర్‌ తెలిపారు.

ఇవీ చదవండి:
కామారెడ్డి వివాహిత కేసులో ట్విస్ట్.. ఏం జరిగిందో తెలిస్తే షాక్‌.. 
అడక్కుండానే పానీ పూరి తెచ్చిన భర్త.. కోపంతో ఊగిపోయిన భార్య.. 

>
మరిన్ని వార్తలు