థ్యాంక్యూ సీఎం సార్‌

23 Aug, 2022 10:10 IST|Sakshi

(అల్లూరి సీతారామరాజు) పాడేరు : డాక్టర్‌ వైఎస్సార్‌ విలేజ్‌ హెల్త్‌ క్లినిక్‌లో పనిచేస్తున్న మిడ్‌ లెవెల్‌ హెల్త్‌ ప్రొవైడర్లకు కమ్యూనిటీ హెల్త్‌ ఆఫీసర్‌ (సీహెచ్‌వో) హోదాకల్పిస్తూ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తీసుకున్న నిర్ణయం పట్ల హర్షం వ్యక్తమవుతోంది. జిల్లాలోని పలు ప్రాంతాలకు చెందిన సీహెచ్‌వోలు పాడేరు ఐటీడీఏ ఎదుట సోమవారం థ్యాంక్యూ సీఎం సార్‌ అంటూ ప్లకార్డులను ప్రదర్శించారు.

సీఎం జగన్‌మోహన్‌ రెడ్డికి వారంతా కృతజ్ఞతలు తెలిపారు. థ్యాంక్యూ సీఎం సార్‌ నినాదాలతో ఐటీడీఏ ప్రాంగణం హోరెత్తింది. అనంతరం  సీఎం జగన్‌మోహన్‌ రెడ్డి చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో సీహెచ్‌వోల సంఘ ప్రతినిధులు పట్నాల దుర్గా భవానీ, కూడా అమూల్య జ్యోత్స్నరాణి, సమరెడ్డి చంద్రకళ, శరబ ఉదయశ్రీ, ఓలేసు మధుసూదన్‌రాజు, పట్నాల స్వాతి సంధ్య తదితరులు పాల్గొన్నారు.  

మరిన్ని వార్తలు