థ్యాంక్యూ.. సీఎం సార్‌  

22 Aug, 2022 11:05 IST|Sakshi

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి కమ్యూనిటీ హెల్త్‌ ఆఫీసర్లు (సీహెచ్‌ఓ) కృతజ్ఞతలు తెలిపారు. ఆదివారం కడపలోని హెడ్‌పోస్టాఫీసు సమీపంలో ఉన్న వైఎస్సార్‌ విగ్రహానికి పూలమాల వేసి, థ్యాంక్యూ సీఎం సార్‌ అని ప్లకార్డులు ప్రదర్శించారు. ఈ సందర్భంగా యూనియన్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి. సందీప్‌ కుమార్,కడప జిల్లా అధ్యక్షురాలు స్నేహబిందు, ప్రధాన కార్యదర్శి రాహుల్‌ కుమార్‌ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్సార్‌ హెల్త్‌ క్లినిక్‌లలో మిడ్‌ లెవెల్‌ హెల్త్‌ ప్రొవైడర్లుగా పనిచేస్తున్న తమను కమ్యూనిటీ హెల్త్‌ ఆఫీసర్లుగా గుర్తించిన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. 

ఇందుకు సహకరించిన ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, మంత్రి విడుదల రజనిలకు ధన్యవాదాలు తెలిపారు. వెద్య రంగంలో కీలక మార్పులు తీసుకొచ్చి ముఖ్యమంత్రికి మంచిపేరు తీసుకొస్తామని తెలిపారు
–కడప కార్పొరేషన్‌

మరిన్ని వార్తలు