గ్రామీణ విద్యార్థులకు ట్రిపుల్‌ ఐటీల్లో పెద్దపీట

24 Feb, 2021 03:15 IST|Sakshi

ఆర్జీయూకేటీలో పూర్తి స్థాయిలో 4,407 సీట్ల భర్తీ

54.5 శాతం సీట్లు గ్రామీణ ప్రాంత విద్యార్థులకే 

సాక్షి, అమరావతి/నూజివీడు: గ్రామీణ ప్రాంత విద్యార్థులకు అత్యున్నత సాంకేతిక విద్యనందించే లక్ష్యంతో ఏర్పాటైన రాజీవ్‌గాంధీ యూనివర్సిటీ ఆఫ్‌ నాలెడ్జి టెక్నాలజీ (ఆర్జీయూకేటీ) పరిధిలోని ట్రిపుల్‌ ఐటీల్లో 2020–21 విద్యాసంవత్సరానికి గ్రామీణ విద్యార్థులకే అత్యధిక సంఖ్యలో సీట్లు లభించాయి. రాష్ట్రంలో నూజివీడు, ఇడుపులపాయ (ఆర్కే వ్యాలీ), ఒంగోలు, శ్రీకాకుళంలలో ట్రిపుల్‌ ఐటీలు ఉన్న సంగతి తెలిసిందే. వీటిలో ఒక్కో దానిలో వేయి చొప్పున మొత్తం 4 వేల సీట్లు ఉన్నాయి.

ఈడబ్ల్యూఎస్‌ కోటాలో అదనంగా సూపర్‌ న్యూమరరీ కింద 10 శాతం చొప్పున 400 సీట్లను, ఎన్‌ఆర్‌ఐ కోటా కింద 7 సీట్లను కలిపి మొత్తం 4,407 సీట్లను ఈ విద్యాసంవత్సరంలో కేటాయించారు. గతేడాది కోవిడ్‌ కారణంగా పదో తరగతి పరీక్షలు నిర్వహించలేని పరిస్థితుల్లో విద్యా శాఖ విద్యార్థులందరినీ ఉత్తీర్ణులుగా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ సీట్ల భర్తీకి ఆర్జీయూకేటీ ప్రత్యేకంగా ప్రవేశ పరీక్షను నిర్వహించింది. ఈ సెట్లో ఎక్కువ స్కోరు సాధించి ర్యాంకులు పొందిన వారికి రిజర్వేషన్ల  ప్రకారం సీట్లు కేటాయించారు.  

మరిన్ని వార్తలు