జనసేన నేతలకు చేదు అనుభవం

15 Jul, 2021 10:39 IST|Sakshi

జనసేన నేతలు, కార్మిక సంఘాల నేతల మధ్య వాగ్వాదం

సాక్షి, విశాఖపట్నం: విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. జనసేన నేతలు, కార్మిక సంఘాల నేతల మధ్య వాగ్వాదం జరిగింది. స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణపై పవన్‌ వైఖరి తెలపాలని కార్మికుల డిమాండ్‌ చేశారు. దీక్షా శిబిరానికి పవన్‌ కల్యాణ్‌ రావాలంటూ కార్మికుల డిమాండ్‌ చేయగా, పవన్‌ను గాజువాకలో ఓడించారు.. ఆయనెందుకొస్తారంటూ జనసేన నేతలు ఎదురుదాడికి దిగారు. జనసేన, కార్మిక సంఘాల నేతల మధ్య వాగ్వాదంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది. జనసేన నాయకులు వెళ్లిపోవాలంటూ కార్మికుల నినాదాలు చేశారు.


 

మరిన్ని వార్తలు