రోగి అదృశ్యం.. మార్చురీలో మృతదేహం

15 May, 2021 10:54 IST|Sakshi

లబ్బీపేట(విజయవాడ తూర్పు): కరోనా పాజిటివ్‌తో కోవిడ్‌ స్టేట్‌ ఆస్పత్రిలోని అయిన ఘటన శుక్రవారం కాసేపు కలకలం రేపింది. అయితే ఆ రోగి  ఆస్పత్రిలో చేరిన రోజే మృతి చెందగా, మార్చురీకి సిబ్బంది చేర్చారు. ఈ విషయంపై అధికారులకు సమాచారం లేకపోవడంతో కాసేపు గందరగోళం నెలకొంది.

అసలేం జరిగిందంటే..  
గుడివాడకు చెందిన ఎంఎన్‌వీ సుబ్రహ్మణ్యం(42) ఈనెల 12న కరోనాకు చికిత్స కోసం ఆస్పత్రిలో చేరాడు. అతడికి ఐసీయూ–9లో బెడ్‌ నంబర్‌–16 కేటాయించారు. ఆరోజే అతను మృతిచెందాడు. దీంతో సిబ్బంది  మృతదేహాన్ని మార్చురీకి తరలించారు. ఈ సమాచారం అధికారులకు చేరవేయలేదు. దీంతో బంధువులు వచ్చి రోగి ఆరోగ్య పరిస్థితి గురించి ఆరా తీయగా, శుక్రవారం ఉదయం కూడా బాగానే ఉందని సమాచార కేంద్రం సిబ్బంది చెప్పారు. మధ్యాహ్నం మాట్లాడేందుకు యత్నించగా ఫోన్‌ పనిచేయలేదు. బెడ్‌పై సుబ్రహ్మణ్యం కాకుండా, మరొక రోగి ఉండటంతో కాసేపు అధికారులు కంగారు పడ్డారు. ఏం జరిగిందని ఆరా తీస్తే మార్చురీలో మృతదేహాం ఉన్నట్లు గుర్తించారు.

నిర్లక్ష్యం ఎవరిది! 
వార్డులో ఉన్న రోగి మృతి చెందితే, ఆ సమాచారం ఉన్నతాధికారులకు తెలియచేయాల్సింది అక్కడ విధులు నిర్వహిస్తున్న నర్సింగ్‌ సిబ్బందే. కానీ కొందరు నాలుగో తరగతి ఉద్యోగులు ఎవరైనా రోగి మృతి చెందిన వెంటనే మృతదేహాన్ని మార్చురీకి తరలించి, ఆ బెడ్‌పై మరొకరిని తీసుకొచ్చి వేసేస్తున్నారు. దీనికోసం కొంతమొత్తం డబ్బులు తీసుకుంటున్నట్టు ఆరోపణలు ఉన్నాయి.

చదవండి: ఏపీ: ఆలయాల్లో ప్రభుత్వ కోవిడ్‌ కేర్‌ సెంటర్లు  
ఆదర్శం.. ‘ప్రగతి భారత్‌’ కోవిడ్‌ కేర్‌ సెంటర్‌

మరిన్ని వార్తలు