‘బీసీ ప్రజలకు చరిత్రలో లిఖించే రోజు’

3 Nov, 2020 12:46 IST|Sakshi

సాక్షి, పశ్చిమగోదావరి : దేశ చరిత్రలోనే సువర్ణ అక్షరాలతో లిఖించే విధంగా బీసి కులాలను గుర్తించి 139 కులాలకు 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేశారని ఎంపీ మార్గాని భరత్ పేర్కొన్నారు. ఏలూరు వేదికగా జరిగిన బీసి గర్జనలో బీసీలకు ఇచ్చిన హమీని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అమలు చేశారన్నారు. ఏలూరులో మంగళవారం ‌బీసీ కార్పొరేషన్ల చైర్మన్లు, డైరక్టర్లకు అభినందన సభ ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ఎంపీ భరత్‌ మాట్లాడుతూ.. ప్రతి బడుగు బలహీన వర్గాలకు నాణ్యమైన విద్యను అందించేందుకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పలు నిర్ణయాలు తీసుకున్నారన్నారు.  బీసీలు ముఖ్యమంత్రికి ఎల్లవేళలా రుణపడి ఉంటారన్నారు. చదవండి: బీసీల దమ్ము ఎంతో చూపిస్తాం..

రాష్ట్రవ్యాప్తంగా ఉన్న బీసీ వర్గాల ప్రజలకు ఈ రోజు చరిత్రలో లిఖించే రోజు అని ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని పేర్కొన్నారు. గత ప్రభుత్వం తెలుగుదేశం హయంలో చంద్రబాబు నాయుడు బీసీలను కేవలం ఓట్ల బ్యాంకుగా మాత్రమే చూశారని విమర్శించారు. బీసీలకు మాయ మాటలు చెప్పి వారిని అణగదొక్కారన్నారు. బీసీకు రాజ్యాధికారం ఇవ్వాలని ముఖ్యమంత్రి కార్పొరేషన్లు ఏర్పాటు చేశారన్న మంత్రి రాష్ట్రంలోని వెనుకబడిన బడుగు బలహీన వర్గాలను గుర్తించి 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేసిన ఏకైక ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌‌మోహన్‌రెడ్డి అని కొనియాడారు. చదవండి: బీసీలంతా వైఎస్‌ జగన్‌కు రుణపడ్డాం

మహిళ పక్షపాతిగా సీఎం వైఎస్‌ జగన్‌ ఎన్నో సంక్షేమ పధకాలు అమలు చేస్తున్నారని స్త్రీ, శిశుసంక్షేమశాఖ మంత్రి తానేటి వనితా అన్నారు. ఏలూరులో నిర్వహించిన బీసీ గర్జనలో బీసీలు తమ పార్టీకి వెనుముక అంటూ వైఎస్‌ జగన్‌ చెప్పారని గుర్తు చేశారు. ప్రతి బిడ్డను చదివించేందుకు అమ్మవడి అనే పథకాన్ని తీసుకువచ్చారని, దిశ అనే చట్టం మహిళలు ముఖ్యమంత్రులుగా ఉన్న రాష్ట్రాలలోను తీసుకురాలేదని పేర్కొన్నారు. పోలవరం, రాజధాని అంశంలో ప్రజలకు ఆలోచనల దిశగా ముఖ్యమంత్రి వెళ్తున్నారని, ఎన్నో లక్షల మందికి ఉపయోగపడే పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తి అయితే భవిష్యత్తు పొతుందని టీడీపీ అడ్డుకుంటుంని మండిపడ్డారు. చదవండి: బీసీ కార్పొరేషన్లతో సామాజిక విప్లవం

ఈ సమావేశంలో మంత్రులు ఆళ్లనాని, తానేటి వనితా, ఎమ్మెల్యేలు కొఠారు అబ్బాయ చౌదరి, జీఎస్ నాయుడు, ఏలీజా, కారుమూరి నాగేశ్వరరావు, పుప్పాల వాసుబాబు, తల్లారి వెంకట్రావు, ముదునూరి ప్రసాదరాజు, ఎంపీ మార్గాని భరత్, డీసీఎమ్‌ఎస్‌ చైర్మన్ యడ్ల తాతాజీ, డీసీబీసీ చైర్మన్ కవూరు శ్రీనివాస్, జిల్లాకు చెందిన కార్పొరేషన్ చైర్మన్లు గుబ్బల తమ్మయ్య, ఇళ్ల భాస్కరరావు,పేండ్ర వీరన్న,అనంతలక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా