అంగన్‌వాడీ కేంద్రాల నిర్మాణం ముమ్మరం

25 Mar, 2021 04:39 IST|Sakshi

రూ.386.88 కోట్లతో 9,143 అంగన్‌వాడీ కేంద్రాల నిర్మాణం

ఇప్పటికే 7,996 భవనాల నిర్మాణ పనులు ప్రారంభం

ఇందులో 4,466 కేంద్రాల నిర్మాణం పూర్తి            

బేస్‌మెంట్‌ స్థాయిలో 1,133, గ్రౌండ్‌ ఫ్లోర్‌ శ్లాబ్‌ స్థాయిలో 1,025, శ్లాబ్‌ పూర్తి అయినవి 1,372 భవనాలు 

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో అద్దె భవనాల్లో అరకొర సౌకర్యాలతో ఉన్న అంగన్‌వాడీ కేంద్రాలకు పక్కా సొంత భవనాల నిర్మాణాలకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. రాష్ట్రంలో 27,490 అద్దె భవనాల్లో అంగన్‌వాడీ కేంద్రాలున్నట్లు గుర్తించారు. వీటిలో 25,455 కేంద్రాలకు ప్రభుత్వం సొంత స్థలాలను గుర్తించింది. ఇందులో ఇప్పటికే 9,143 కేంద్రాల భవన నిర్మాణాలకు రూ.386.88 కోట్లు మంజూరు చేసింది. వీటిలో 7,996 భవనాల నిర్మాణ పనులు ప్రారంభం కాగా, ఇప్పటికే 4,466 భవనాల నిర్మాణం కూడా పూర్తయింది. మరో 1,133 భవనాల పనులు బేస్‌మెంట్‌ స్థాయిలో, 1,025 భవనాలు గ్రౌండ్‌ ఫ్లోర్‌ శ్లాబ్‌ స్థాయిలో ఉన్నాయి. 1,372 భవనాలకు శ్లాబ్‌ కూడా పూర్తయింది.  

మరిన్ని వార్తలు