ఉద్యోగాలు 4... దరఖాస్తులు 675! 

14 Sep, 2022 11:34 IST|Sakshi

అనంతపురం: పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం, పారిశుద్ధ్య కార్యక్రమాల నిర్వహణ పర్యవేక్షణకు సంబంధించి నాలుగు కాంట్రాక్ట్‌/ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగాల భర్తీకి సంబంధించి మొత్తం 675 దరఖాస్తులు అందినట్లు డీఈఓ కె.శామ్యూల్‌ తెలిపారు. మరుగుదొడ్ల నిర్వహణ నిధి ప్రోగ్రామ్‌ కో–ఆర్డినేటర్, డేటా ఎంట్రీ ఆపరేటర్, మధ్యాహ్న భోజన పథకం డేటా అనలిస్ట్, డేటా ఎంట్రీ ఆపరేటర్‌ పోస్టులు భర్తీ చేయనున్నారు.

మరుగుదొడ్ల నిర్వహణ నిధి ప్రోగ్రామ్‌ కోఆర్డినేటర్‌ పోస్టుకు మొత్తం 166 దరఖాస్తులు, డేటా ఆపరేటర్‌ ఉద్యోగానికి 199 దరఖాస్తులు, మధ్యాహ్న భోజన పథకం నిర్వహణకు సంబంధించి డేటా అనలిస్ట్‌కు 122 మంది, డేటా ఎంట్రీ ఆపరేటర్‌కు 188 మంది దరఖాస్తు చేశారు.  

(చదవండి: ఆస్తి కోసం అంధురాలిపై హత్యాయత్నం)

మరిన్ని వార్తలు