ఎస్వీయూలో పదోన్నతుల వివాదం

7 Sep, 2020 06:50 IST|Sakshi
ఎస్వీయూ పరిపాలన భవనం 

రెండు వర్గాలుగా విడిపోయిన ఉద్యోగులు 

పరస్పరం ఆందోళనకు పిలుపు 

నిబంధనలు అమలు చేశామంటున్న అధికారులు 

యూనివర్సిటీ క్యాంపస్‌: యూనివర్సిటీల్లో పదోన్నతులకు తప్పనిసరిగా డిపార్డ్‌మెంట్‌ పరీక్షల్లో ఉత్తీర్ణులు కావాలి. ఎస్వీయూ పాలకమండలి నిర్ణయం మేరకు డిపార్డ్‌మెంట్‌ పరీక్షలు పాసైన వారికే పదోన్నతులు ఇస్తున్నారు. ఈ విధానంలో ఇప్పటికే మూడు పర్యాయాలు ఉద్యోగోన్నతులు ఇచ్చారు. నాన్‌టీచింగ్‌ అసోసియేషన్‌ మాత్రం ఈ పద్ధతిని వ్యతిరేకిస్తోంది. సీనియారిటీ ప్రాతిపదికన ప్రమోషన్లు ఇవ్వాలని పట్టుబడుతోంది. సోమవారం నుంచి సమ్మెకు ది గాలని పిలుపునిచ్చింది. ఈ సమ్మెకు మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది. ఫలితంగా ఉద్యోగులు రెండు వర్గాలుగా విడిపోయి ఆందోళన బాట పట్టేందుకు సన్నద్ధమవుతున్నారు.  

2017లోనే ఆదేశాలు.. 
యూనివర్సిటీల్లో పదోన్నతులకు ఏపీపీఎస్సీ నిర్వహించే డిపార్ట్‌మెంట్‌ టెస్ట్‌లు పాస్‌ కావాలనే నిబంధనతో 2017లో అప్పటి ఉన్నత విద్యామండలి కార్యదర్శి ఉత్తర్వులు జారీచేశారు. అప్పటి నుంచి రాష్ట్రంలోని అన్ని వర్సిటీల్లో ఈ ఆదేశాలు అమలులోకి వచ్చాయి. ఎస్వీయూలో మాత్రం అప్పటి అధికారులు పట్టించుకోలేదు. 2018లో ఉన్నత విద్యామండలి మరోసారి ఉత్తర్వులు జారీచేసింది. ఈ ఏడాది మాత్రం ఈ ఆదేశాలను అమలు చేయాలని వర్సిటీ పాలకమండలి నిర్ణయించింది. ఇన్‌చార్జ్‌ వీసీగా ఉన్న ఐఏఎస్‌ అధికారి సతీ‹Ùచంద్ర మూడు పర్యాయాలు ఉద్యోగులకు పదోన్నతులు కల్పించారు. తాజాగా ఏడుగురు ఉద్యోగులకు ప్రమోషన్‌ ఇచ్చారు. ఈ నిర్ణయంపై భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి. పదోన్నతులను ఓ వర్గం వ్యతిరేకిస్తుండగా మరో వర్గం స్వాగతిస్తోంది.

సమ్మె అర్థ రహితం 
ప్రభుత్వ ఆదేశాలను ప్రతి ఒక్కరూ పాటించాల్సిందే. నిబంధనలను అతిక్రమిస్తే సమ్మె చేయాలి. అంతే కానీ, నిబంధనలను పాటించినందుకు ఆందోళనకు దిగడం అర్థరహితం 
– ఎం.రెడ్డి భాస్కర్‌రెడ్డి, ఎస్వీయూ అధ్యాపక సంఘం కార్యదర్శి 

నిబంధనల మేరకే పదోన్నతులు 
ఎస్వీయూలో నిబంధనల మేరకే ఉద్యోగులకు పదోన్నతులు కలి్పంచాం. జనవరిలో పాలకమండలి తీసుకున్న నిర్ణయాన్ని అమలు చేస్తున్నాం. అయితే నిబంధనలు పక్కాగా అమలు చేసినా ఉద్యోగ సంఘ నాయకులు ఆందోళనకు పిలుపు ఇవ్వడం బాధాకరం. 
–  పి.శ్రీధర్‌రెడ్డి, ఎస్వీయూ రిజిస్ట్రార్‌

 

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా