రెండ్రోజుల్లో 9 మంది చిన్నారులకు కరోనా

7 Jun, 2021 05:37 IST|Sakshi

తిరుపతి తుడా/పుత్తూరు రూరల్‌:  కరోనా సోకిన పదేళ్లలోపు చిన్నారులు తొమ్మిది మంది తిరుపతి రుయా పరిధిలోని చిన్నపిల్లల ఆస్పత్రిలో అడ్మిట్‌ అయ్యారు. వీరిలో వైఎస్సార్‌ జిల్లాకు చెందిన ముగ్గురు, చిత్తూరు జిల్లాకు చెందిన ఆరుగురున్నారు. వీరంతా శుక్రవారం రాత్రి నుంచి ఆదివారం సాయంత్రంలోపు చేరిన వారే. వీరిని ప్రత్యేకంగా పర్యవేక్షిస్తున్నట్లు రుయా అధికారులు తెలిపారు. రెండ్రోజుల వ్యవధిలో ఇంతమంది ఆస్పత్రిలలో చేరడం రాష్ట్రంలో ఇదే తొలిసారని అధికారులు భావిస్తున్నారు. గడిచిన 15 రోజుల్లో మరో 20 మంది చిన్నారులూ చికిత్స పొంది  డిశ్చార్జ్‌ అయ్యారు.  

పుత్తూరులో మరో ఎనిమిది మందికి..
ఇక పుత్తూరు పట్టణం పిళ్లారిపట్టులో పదేళ్లలోపు పిల్లలు ఎనిమిది మందికి కరోనా సోకింది. వీరంతా హోం ఐసోలేషన్‌లో ఉన్నారు. ఒకరి పరిస్థితి ఆందోళనకరంగా ఉండడంతో తిరుపతి రుయాకు తరలించినట్టు వైద్య సిబ్బంది చెప్పారు. ఇటీవల వీరి తల్లిదండ్రులకు పాజిటివ్‌ రావడంతో వారి నుంచి పిల్లలకు సోకి ఉంటుందని వైద్యులు భావిస్తున్నారు.  

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు