కరోనా బాధితులపై సీఎం జగన్‌ శ్రద్ధ బాగుంది

22 Sep, 2020 07:23 IST|Sakshi
కరోనాను జయించిన మస్తాన్‌ దంపతులు  

ఆస్పత్రిలో సేవలు బాగున్నాయి

60 ఏళ్ల వయసులో వైరస్‌ బారిన పడి కోలుకున్న దంపతుల వెల్లడి

సాక్షి, శావల్యాపురం(వినుకొండ): కరోనా బాధితులను ఆదుకునేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తీసుకుంటున్న శ్రద్ధ చాలా బాగుందని వైరస్‌ బారిన పడి కోలుకున్న దంపతులు సోమవారం తెలిపారు. శావల్యాపురానికి చెందిన వేలూరు మస్తాన్, ఆయన భార్య అసానమ్మలకు పది రోజుల క్రితం కరోనా పాజిటివ్‌గా నిర్ధారించారు. అరవయ్యేళ్ల వయసుదాటిన వీరిద్దరూ ఇప్పటికే పలు దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతుండగా, కరోనా తోడవడంతో ఆరోగ్య పరిస్థితి విషమించింది.

వైద్యుల సూచన మేరకు గుంటూరు ప్రభుత్వాస్పత్రికి చికిత్స కోసం వారిని తరలించారు. ఆస్పత్రిలో పది రోజులపాటు కరోనాతో పోరాడి ఎట్టకేలకు ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. ఈ నేపథ్యంలో వారు స్థానిక విలేకరులతో మాట్లాడుతూ ఈరోజు తాము ఆరోగ్యంతో క్షేమంగా ఇంటికి వచ్చామంటే ప్రభుత్వ వైద్యశాలలో అన్ని వసతులతో కూడిన వైద్య సేవలు అందించి మంచి పోషకాహారం సకాలంలో క్రమం తప్పకుండా ఇవ్వడం వల్లేనన్నారు. 

మరిన్ని వార్తలు