21 లక్షలు దాటిన కరోనా పరీక్షలు

4 Aug, 2020 04:35 IST|Sakshi

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ కరోనా పరీక్షలు 21 లక్షలు దాటాయి. ఆదివారం ఉదయం 9 నుంచి సోమవారం ఉదయం 9 వరకు  45,516 మందికి పరీక్షలు నిర్వహించడంతో మొత్తం పరీక్షలు 21,10,923కి చేరాయి. కొత్తగా 7,822 కేసులు నమోదవడంతో పాజిటివ్‌ కేసుల సంఖ్య 1,66,586కి చేరింది. గడిచిన 24 గంటల్లో 5,786 మంది డిశ్చార్జ్‌ అయినట్టు వైద్యారోగ్యశాఖ వెల్లడించింది. దీంతో కోలుకున్న వారి సంఖ్య 88,672కు చేరింది. మరణాల సంఖ్య 1,537కి చేరింది. యాక్టివ్‌ కేసులు 76,377 ఉన్నాయి.

మరిన్ని వార్తలు