మూడో రోజు 14,606 మందికి వ్యాక్సిన్

19 Jan, 2021 03:16 IST|Sakshi
శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల పీహెచ్‌సీలో టీకా వేస్తున్న వైద్య సిబ్బంది

అత్యధికంగా నెల్లూరు జిల్లాలో 1,847 మందికి

నిరంతరాయంగా కొనసాగనున్న వ్యాక్సిన్‌ ప్రక్రియ

సాక్షి, అమరావతి/ భీమడోలు: హెల్త్‌కేర్‌ వర్కర్లకు నిరంతరాయంగా కొనసాగుతున్న కరోనా వ్యాక్సిన్‌ ప్రక్రియలో భాగంగా మూడో రోజు రాష్ట్రంలో 14,606 మందికి వేశారు. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా మూడో రోజు ప్రక్రియ ముగిసింది. అత్యధికంగా నెల్లూరు జిల్లాలో 1,847 మందికి వ్యాక్సిన్‌ వేశారు. అత్యల్పంగా పశ్చిమగోదావరి జిల్లాలో 459 మందికి వ్యాక్సిన్‌ వేశారు. 3.87 లక్షల మందికి ఫ్రంట్‌లైన్‌ వర్కర్లకు వ్యాక్సిన్‌ పూర్తయ్యే వరకు ఈ ప్రక్రియ కొనసాగుతుందని కుటుంబ సంక్షేమశాఖ అధికారులు తెలిపారు.

తొలిరోజు 19,108 మందికి రెండో రోజు 13,036 మందికి వ్యాక్సిన్‌ వేసిన విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా 16వ తేదీన పశ్చిమగోదావరి జిల్లా భీమడోలు సామాజిక ఆరోగ్య కేంద్రంలో 29 మంది ఆశా వర్కర్లు, ఏఎన్‌ఎంలు, ఆరోగ్య సిబ్బంది.. వైద్యుల పర్యవేక్షణలో కోవిషీల్డ్‌ వ్యాక్సిన్‌ వేయించుకున్నారు. అందరి ఆరోగ్య పరిస్థితి బాగానే ఉంది. ఆ తర్వాత రోజు ఆగడాలలంక గ్రామానికి చెందిన కురమా షారోన్‌రాణి, చిగురుపాటి సుశీలకు తల, ఒళ్లు నొప్పులు ప్రారంభమయ్యాయి. సోమవారం వాంతులు కూడా కావడంతో ఏలూరు ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైద్యులు సూచించారు.

జిల్లాల వారీగా సోమవారం వ్యాక్సిన్‌ వేయించుకున్న వారి వివరాలు ఇలా.. 

మీ అభిప్రాయాలను కింద తెలపండి

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments

మరిన్ని వార్తలు