కరోనా: ఏపీలో కొత్తగా 10,328 కేసులు

6 Aug, 2020 20:01 IST|Sakshi

24 గంటల్లో కోలుకున్న వారు  8,516 మంది

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో కరోనావైరస్‌ నిర్ధారణ పరీక్షల జోరు కొనసాగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో 63,686 మందికి కరోనా పరీక్షలు నిర్వహించినట్టు వైద్యారోగ్యశాఖ గురువారం బులెటిన్‌లో పేర్కొంది. దీంతో ఇప్పటి వరకు నిర్వహించిన మొత్తం పరీక్షల సంఖ్య 22,99,332కి చేరింది. కొత్తగా  10,328 మందికి పాజిటివ్‌గా తేలడంతో మొత్తం కరోనా కేసులు 1,96,789కి చేరాయి. గడిచిన 24 గంటల్లో 72మంది కరోనాతో మృతి చెందారు. దీంతో ఏపీలో మొత్తం మరణాల సంఖ్య 1,753కి చేరింది.
(చదవండి : తిరుమలలో విషాదం.. కరోనాతో అర్చకుడు మృతి)

కరోనా వల్ల  గురువారం అనంతపురంలో 10, తూర్పుగోదావరిలో 10, గుంటూరులో 9, చిత్తూరులో 8, కృష్ణాలో 6, నెల్లూరు 6, ప్రకాశం 6, విశాఖపట్నం 4, కడప 3, విజయనగరం 3, పశ్చిమగోదావరి 3, కర్నూలు 2, శ్రీకాకుళంలో ఇద్దరు కరోనాతో చనిపోయారు. రాష్ట్రంలో అత్యధికంగా తూర్పుగోదావరి జిల్లాలో 1351 కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత కర్నూలులో 1285, అనంతపురంలో 1112 కేసులు నమోదయ్యాయి.రాష్ట్రంలో గత 24 గంటల్లో 8516 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇప్పటివరకు ఏపీలో కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 112870 కాగా, ప్రస్తుతం 82166 యాక్టివ్ కేసులు ఉన్నాయి.

మరిన్ని వార్తలు