సీఎం జగన్‌ను అభినందించిన ప్రధాని మోదీ

23 Sep, 2020 18:10 IST|Sakshi

ప్రధాని మోదీతో వీడియో కాన్ఫరెన్స్‌

సాక్షి, తిరుమల: టీటీడీ అన్నమయ్య భవన్‌లో ప్రధాని నరేంద్ర మోదీతో జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాల్గొన్నారు. కోవిడ్‌ నియంత్రణ చర్యలకు సంబంధించి 7 రాష్ట్రాల సీఎంలతో ప్రధాని ఈ వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్‌లో కోవిడ్‌ నియంత్రణ చర్యలకు సంబంధించి సీఎం జగన్‌ వివరిస్తున్న క్రమంలో ప్రధాని మోదీ మాట్లాడుతూ.. ‘మీతో ఇవాళ ఈ వీడియో కాన్ఫరెన్సు ద్వారా నాకు శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం అయిందన్న సంతోషం కలుగుతోంది’ అన్నారు. సీఎం జగన్‌ వెనుక శ్రీవారి పెద్ద చిత్రపటం చిత్రపటం ఉండడంతో ప్రధాని ఈ విధంగా స్పందించారు.

‘తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో పాల్గొనడానికి వచ్చి కూడా, మీరు ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొనడం అభినందనీయం. రాష్ట్రంలో మీరు అమలు చేస్తున్న గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ వల్ల ప్రజలకు ఎంతో మేలు జరుగుతోంది. ప్రజలకు త్వరితగతిన సేవలన్నీ అందుతున్నాయి. ఇదే విధానాన్ని మిగతా రాష్ట్రాలు కూడా అమలు చేస్తాయని భావిస్తున్నాను’ అని మోదీ పేర్కొన్నారు. రాష్ట్ర హోంమంత్రి సుచరిత, సీఎస్‌, డీజీపీ, ఇతర ఉన్నతాధికారులు వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు.

అంతకుముందు పద్మావతి అతిథిగృహంలో శ్రీవారి ఆలయ గౌరవ ప్రధాన అర్చకుడు రమణ దీక్షితులు సీఎం జగన్‌ను కలిశారు. పదవీ విరమణ పొందిన మిరాశీ అర్చకుల విషయం ఇంకా పెండింగ్‌లోనే ఉండటంతో ముఖ్యమంత్రిని కలిశామని ఈ సందర్భంగా రమణ దీక్షితులు తెలిపారు. శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన అనంతరం కలిసి మాట్లాడుతానని సీఎం హామీ ఇచ్చారని వెల్లడించారు.
(చదవండి: శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన సీఎం జగన్‌)

మరిన్ని వార్తలు