కృష్ణా జిల్లాలో 519 కంటైన్మెంట్ జోన్లు: కలెక్టర్‌

19 Oct, 2020 19:45 IST|Sakshi

సాక్షి, కృష్ణా: కొత్తగా కరోనా పొజిటివ్ కేసులు నమోదు కావటంతో జిల్లాలో 6 కంటైన్మెంట్ జోన్‌లను ప్రకటించినట్లు కలెక్టర్‌ ఇంతియాజ్‌ తెలిపారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... మహమ్మారి పట్ల ప్రజలు మరింత జాగ్రత్తగా ఉండాలన్నారు. జిల్లాలో కొత్త కేసులు నమోదు అవుతున్నందున విజయవాడ రూరల్‌లోని కొత్తూరు, తాడేపల్లి గ్రామాలు, నూజివీడు మండలంలో యనమదల గ్రామం మోపిదేవి మండలంలో బొబ్బర్‌లంక, మొవ్వ మండలంలో పెదముక్టేవి, అవురుపూడి గ్రామాలను,  ఘంటసాల మండలంలో వి.రుద్రవరం ప్రాంతాలలో కంటైన్మెంట్ నిబంధనలు కచ్చితంగా అమలు చేస్తామని చెప్పారు.

కాబట్టి ఎవరికి వారు స్వీయనియంత్రణ పాటించాలని సూచించారు. జిల్లా వ్యాప్తంగా 519 కంటైన్మెంట్ జోన్‌లో 2460 యాక్టివ్ కేసులు ఉన్నాయని, కోవిడ్‌-19 వ్యాప్తి చెందకుండా ప్రజలు సహకరించాలని కోరారు. 28 రోజులుగా పాజిటివ్ కేసులు నమోదు కాని 5 ప్రాంతాల్లో  కంటైన్మేంట్ జోన్ల నిబంధనలను తొలగించామని చెప్పారు. అవి: జి.కొండూరు మండలంలో చెగిరెడ్డిపాడు గ్రామం, వీరుల్లపాడు మండలంలో చౌటపల్లి గ్రామం, మచిలీపట్నం మండలంలో నేలకుర్రు గ్రామం, పామర్రు మండలంలో జుజ్జవరం గ్రామం, కోడూరు మండలంలో లింగారెడ్డిపాలెం గ్రామంగా కలెక్టర్ పేర్కొన్నారు.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు