భారీగా పెరుగుతున్న రికవరీ రేటు

19 Aug, 2020 04:06 IST|Sakshi

గడిచిన 24 గంటల్లో 9,652 మందికి పాజిటివ్‌..

9, 211 మంది డిశ్చార్జ్

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కరోనా వైరస్‌ సోకి రికవరీ అవుతున్న వారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. మంగళవారం నాటికి రికవరీ శాతం 71.28కి చేరింది. కరోనా బారిన పడ్డ వారిలో ఎక్కువ మంది పదిరోజుల్లోగానే కోలుకుంటున్నట్టు వైద్యుల పరిశీలనలో తేలింది. కాగా గడిచిన 24 గంటల్లో 56,090 టెస్టులు చేయగా 9,652 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. కాగా మంగళవారం ఒక్కరోజే 9,211 మంది కోవిడ్‌నుంచి పూర్తిగా కోలుకుని డిశ్చార్జి అయ్యారు.

ఇప్పటివరకూ 29,61,611 టెస్టులు చేయగా 3,06,261 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. వీరిలో 2,18,311 మంది కోలుకోగా, మరో 85,130 మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. గడిచిన 24 గంటల్లో కోవిడ్‌ కారణంగా 88 మంది మరణించారు. దీంతో ఇప్పటివరకూ మరణించినవారి సంఖ్య 2,820కి చేరింది. మంగళవారం నమోదైన కేసుల్లో తూర్పుగోదావరి జిల్లాలో అత్యధికంగా 1,396 కేసులు ఉండగా, కృష్ణా జిల్లాలో అతి తక్కువగా 281 కేసులు నమోదయ్యాయి.

మరిన్ని వార్తలు