కోవిడ్‌ సేవల్లో కడప 2వ స్థానం

29 Sep, 2020 12:20 IST|Sakshi
జిల్లా కోవిడ్‌ ఆసుపత్రి

సాక్షి, కడప: కోవిడ్‌ నివారణకు తీసుకుంటున్న చర్యలకు  రాష్ట్ర స్దాయిలో మన జిల్లా రెండవ స్థానంలో నిలిచింది. మొదటి స్థానంలో అనంతపురం జిల్లా ఉంది. గత గురువారం జిల్లా 4వ స్థానంలో నిలిచింది. ఈ మూడు రోజుల్లో పనితీరును మెరుగుపరుచుకొని రెండవ స్థానానికి చేరుకుంది. ప్రభుత్వం ప్రతి సోమవారం, గురువారం కరోనా సేవలకు సంబంధించి జిల్లాల వారీగా సమీక్షించి, ర్యాంకులు ప్రకటిస్తుంది.  సోమవారం కడప కలెక్టరేట్‌లో జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో సమీక్ష జరిగింది. జిల్లా రెండవ స్థానంలో నిలిచినట్లుగా ఉన్నతాధికారులు ఇందులో ప్రకటించారు. జిల్లా కలెక్టర్‌ హరికిరణ్‌ నేతృత్వంలో కోవిడ్‌పై ఒక అధికారిని నియమించారు.

అన్ని శాఖల అధికారులకు భాగస్వామ్యం కల్పించారు. కోవిడ్‌ ఆసుపత్రులు, కోవిడ్‌ కేర్‌ సెంటర్లలో మెరుగైన వసతులు కల్పించారు. ప్రభుత్వ ప్రోత్సాహంతో జిల్లా యంత్రాంగం ఉత్సాహంగా సేవలందిస్తోంది. కరోనా నిర్ణారణ పరీక్షలు నిర్వహంచడం, పాజిటివ్‌గా నిర్ణారణ అయిన వ్యక్తులకు మెరుగైన వైద్య చికిత్సలను అందించడం. సకాలంలో ప్రైమరీ, సెకండరీ కాంటాక్ట్స్‌ను గుర్తించడం, కోవిడ్‌ ఆసుపత్రులు, కోవిడ్‌ కేర్‌ సెంటర్లలో మెరుగైన వసతులు కల్పించడం, శుభ్రత చర్యలు చేపట్టడం, హోం ఐసోలేషన్‌లో ఉన్న వారిని పరిశీలించడం లాంటి అంశాలను ప్రభుత్వం పరిశీలిస్తుంది. వాటి ఆధారంగా సోమ, గురువారం ర్యాంకులను ప్రకటిస్తుంది.

మరిన్ని వార్తలు