గన్నవరం చేరుకున్న ‘కోవిషీల్డ్‌’

12 Jan, 2021 13:46 IST|Sakshi

40 బాక్సుల్లో 4,96,680 వ్యాక్సిన్‌ డోస్‌లు

విమానాశ్రయం వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు

సాక్షి, విజయవాడ : తొలిదశ కరోనా వైరస్‌ వ్యాక్సిన్‌ పంపిణీలో భాగంగా కోవిషీల్డ్‌ టీకా డోసులు గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నాయి. 40 బాక్సుల్లో 4,96,680 వ్యాక్సిన్‌ డోస్‌లు రాష్ట్రానికి చేరుకున్నాయి. పుణె నుంచి ప్రత్యేక విమానంలో వచ్చిన కోవిడ్‌ వ్యాక్సిన్‌ డోస్‌లను ఎయిర్‌పోర్ట్‌ కార్గో నుంచి ప్రత్యేక వాహనాల్లో.. గన్నవరంలోని టీకా నిల్వ కేంద్రానికి తరలించనున్నారు. ఈ మేరకు గన్నవరం విమానాశ్రయం వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. సీసీకెమెరాల పర్యవేక్షణలో పటిష్ట భద్రత మధ్య వ్యాక్సిన్ నిల్వ చేయనున్నారు. రేపు అన్ని జిల్లాలకు కోవిడ్‌ వ్యాక్సిన్‌ తరలించనున్న నేపథ్యంలో జిల్లా కలెక్టర్‌ ఇంతియాజ్‌, వైద్యారోగ్యశాఖ జేడీ శ్రీహరి ఏర్పాట్లను పర్యవేక్షించారు.  ఈనెల 16 నుంచి ఏపీలో వ్యాక్సినేషన్‌ ప్రారంభం కానుండగా.. తొలిదశలో 3.87 లక్షల మంది వైద్య సిబ్బందికి కోవిషీల్డ్‌ వ్యాక్సిన్‌ను ఇవ్వనున్నారు. (చదవండి: 1.30 లక్షల డోసులు.. తొలి రోజు 3 వేల మందికి)

మరిన్ని వార్తలు