అంతే వీరు.. మారదు తీరు 

18 Sep, 2020 11:28 IST|Sakshi
మరమ్మతు పనుల తర్వాత రోడ్డు పరిస్థితి ఇది (ఇన్‌సెట్‌లో) ఆగస్టు 30 నాటికి రూ. 2.86 కోట్లతో వేసిన సింగూరు రోడ్డు దుస్థితి

పని తీరు మార్చుకోని కూన రవికుమార్‌ సోదరుడు

మరమ్మతుల పనులూ నాసిరకమే

అక్కరకు రాకుండా పోతున్న రూ.2.86కోట్ల రోడ్డు  

సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: టీడీపీ కాంట్రాక్టర్ల తీరు మారలేదు. కూన రవికుమార్‌ సోదరుడిలో కనీసం మార్పు రాలేదు. కోట్లాది రూపాయలతో ఆయన వేసిన రోడ్లు మూన్నాళ్ల ముచ్చటగానే మిగిలిపోతున్నాయి. కొత్త రోడ్డు కొన్నాళ్లకే పా డైపోతే కాంట్రాక్ట్‌ అగ్రిమెంట్‌ ప్రకారం పూర్తి స్థాయి నాణ్య తా ప్రమాణాలతో మళ్లీ వేయాల్సి ఉంటుంది. కానీ వారి అవినీతి బుద్ధి ఎక్కడికీ పోలేదన్నట్టుగా మరమ్మతుల్లో కూ డా నాసిరకం పనులే చేపట్టారు. వీరి పనితనం వల్ల రూ. 2.86 కోట్లతో వేసిన రోడ్డు జనాలను వెక్కిరించేదిగా తయారైంది.

విపత్తు నివారణ పథకం కింద పొందూరు మండలం కింతలి–బొడ్డేపల్లి జెడ్పీ రోడ్డు నుంచి సింగూరు మీదుగా ఎన్‌హెచ్‌–5 వరకు 4.75 కిలోమీటర్ల తారు రోడ్డు వేసే కాంట్రాక్ట్‌ను టీడీపీ నేత, మాజీ విప్‌ కూన రవికుమార్‌ సోద రుడు, విజయలక్ష్మి కన్‌స్ట్రక్షన్‌ అధినేత కేవీ సత్యనారాయణ దక్కించుకున్నారు. రూ. 2.86 కోట్లతో వేసిన రోడ్డు కొన్నాళ్లకే శిథిలమైపోయింది. గునపాలతో పెకిలించినట్టుగా ధ్వంసమైపోయింది. ఇదే విషయమై ఆగస్టు 31వ తేదీన ‘సాక్షి’ దినపత్రికలో ‘రోడ్డు శిథిలం–అవినీతి పదిలం’ శీర్షికన వార్త ప్రచురితమైంది.

మరమ్మతు పనుల్లోనూ..  
‘సాక్షి’లో కథనం వచ్చాక హుటాహుటిన కాంట్రాక్టర్‌ కూన వెంకట సత్యనారాయణ ఆ రోడ్డు వద్దకు చేరుకుని, శిథిలమైన రోడ్డును పరిశీలించి, మరమ్మతులు చేపట్టేందుకు చర్య లు తీసుకున్నారు. దీంతో ఆ రోడ్డుకు మంచి రోజులొస్తాయని, తమ కష్టాలు తీరుతాయని స్థానికులు ఆశపడ్డారు. కానీ కాంట్రాక్టర్‌ అవినీతి బుద్ధి ఎక్కడికీ పోలేదు. ఎక్కడైతే రోడ్డు శిథిలమై కుంగిపోయిందో అక్కడే మట్టితో కప్పి మసిపూసి మారేడు కాయ చేశారు. వాస్తవంగా రోడ్డు కాంట్రాక్ట్‌ అగ్రిమెంట్‌ ప్రకారం వేసిన రోడ్డు పాడైతే దాన్ని పూర్తిస్థాయిలో నాణ్యతా ప్రమాణాలతో నిర్మించాల్సి ఉంది. కానీ ఇక్కడ మట్టితో మమ అనిపించేశారు. ఇంకేముంది ఇటీవల కురిసిన వర్షాలకు మళ్లీ రోడ్డు కుంగిపోయింది. వేసిన మట్టి కొట్టుకుపోతోంది. చేసిన ప్యా చ్‌ వర్క్‌ కూడా పనికి రాకుండా పోయింది. మరమ్మతుల్లో కూడా నాసిరకం పనులే చేశారు. ఫలితంగా ఆ రోడ్డు అక్క రకు రాకుండా పోతోంది. చెప్పేందుకే నీతులు చేసేవన్నీ అవినీతి పనులే అని మరోసారి నిరూపించుకున్నారు. టీడీ పీ హయాంలో జరిగిన నీరు చెట్టు పనులు మాదిరిగానే రోడ్డు పనులు చేపట్టి కోట్లాది రూపాయలకు కన్నం పెట్టేసిన ఘనుడిగా మరోసారి నిలిచిపోయారు.   

వెక్కిరిస్తున్న ‘కూన’ వేసిన రోడ్డు  
కూన రవికుమార్‌ సోదరుడు కె.వి.సత్యనారాయణ వేసిన రోడ్డు ఇప్పుడందర్ని వెక్కిరించేలా ఉంది. అటుగా వెళ్లిన వారంతా ఆ రోడ్డును చూసి ఆశ్చర్యపోతున్నారు. కోట్లాది రూపాయలతో వేసిన రోడ్డుకు ఈ పరిస్థితేంటని అవాక్కవుతున్నారు. అధికారంలో ఉన్నంతవరకు అడిగే వారు లేక ఇష్టారాజ్యమైపోయిందని, ఇప్పుడైనా నాణ్యమైన పనులు చేపట్టి, కోట్లాది రూపాయలకు ఫలితం వచ్చేలా చూడాల్సింది పోయి అదే అడ్డదార్లు తొక్కడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోందని స్థానికులు వాపోతున్నారు. ఇంజనీరింగ్‌ అధికారులు సైతం నాసిరకం మరమ్మతు పనులపై అభ్యంతరం తెలపకపోవడం అందరికీ విస్మయం కలిగిస్తోంది.   

మరిన్ని వార్తలు