కోవిడ్‌ జరిమానాలు కట్టిన వారు 40.33 లక్షలు 

19 Oct, 2021 04:43 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

రూ.31.87 కోట్ల వసూలు

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కోవిడ్‌ నిబంధనలు ఉల్లంఘించి జరిమానా కట్టిన వారు 2021 అక్టోబర్‌ 15 నాటికి 40,33,798 మంది.. వారు కట్టిన జరిమానా మొత్తం రూ.31,87,79,933గా తేలింది. మాస్క్‌ లేకుండా బయటకు వెళ్లడం, గుంపులు గుంపులుగా ఉండటం, వ్యాపార సముదాయాల్లోకి మాస్క్‌ లేకున్నా అనుమతించడం.. తదితర నిబంధనలు ఉల్లంఘించినందుకు భారీగానే జరిమానాలు కట్టారు.

ఒక్క విశాఖపట్నం జిల్లాలో 11.41 లక్షల మంది కోవిడ్‌ నిబంధనలు ఉల్లంఘించినట్టు తాజాగా వైద్య, ఆరోగ్యశాఖ గణాంకాల్లో వెల్లడైంది. కోవిడ్‌ నిబంధనలు ఉల్లంఘించిన వారు విశాఖపట్నంలో ఎక్కువగా ఉండగా, జరిమానా వసూళ్లలో చిత్తూరు జిల్లా మొదటి స్థానంలో నిలిచింది. కనీవినీ ఎరుగని రీతిలో చిత్తూరు జిల్లా నుంచి రూ.6.01 కోట్లు వసూలయ్యాయి.  అనంతపురం జిల్లాలో సైతం 4.88 లక్షల మంది నిబంధనలు ఉల్లంఘించగా.. రూ.4.98 కోట్లకు పైగా వసూలైంది. గుంటూరు, శ్రీకాకుళం మినహా అన్ని జిల్లాల్లోనూ జరిమానాలు రూ.కోటి దాటాయి.  

మరిన్ని వార్తలు